Movies

ఇవి లాటరీ కొట్టే రోజులు కావు!

ఇవి లాటరీ కొట్టే రోజులు కావు!

చిత్రసీమలో ప్రతిభ ఎంత ఉన్నా, దానికి అదృష్టం తోడవ్వాల్సిందే. లేదంటే రాణించడం కష్టం. ఈ మాట అందరూ నమ్ముతారు. తమన్నా తప్ప. చిత్రసీమలో కష్టానికి తప్ప, అదృష్టానికి తావు లేదని అంటున్నారామె. ‘‘ఇది వరకేమో గానీ, ఇప్పుడు మాత్రం కేవలం ప్రతిభతోనే పరిశ్రమలో రాణించగలం. ఇవి లాటరీ కొట్టే రోజులు కావు. ఏ టాలెంటూ లేకపోతే, ఎవరూ కెమెరా ముందుకు రాలేరు. ముఖ్యంగా కథానాయికలు చాలా కష్టపడుతున్నారు. హీరోలతో పాటు పోటీగా డాన్సులు నేర్చుకుంటున్నారు. పరాయి భాషలో నటిస్తున్నప్పుడు అక్కడి పద్ధతులు అలవాటు చేసుకుంటున్నారు. భాష నేర్చుకుంటున్నారు. కెమెరా ముందు రాక ముందే అన్ని రకాలుగా సమాయాత్తం అవుతున్నారు. ఎవరి అండదండలూ లేకుండా ఎదగడం, ఓ ఛాన్స్‌ సంపాదించుకోవడం అంటే మాటలు కాదు’’ అని చెప్పుకొచ్చారు. ఆమె నటించిన ‘ఎఫ్‌ 3’ ఈ వేసవిలో విడుదల కాబోతోంది. చిరంజీవి ‘భోళా శంకర్‌’లోనూ తమన్నానే నాయిక.