మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు విఖ్యాత రెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించింది. ఆళ్లగడ్డ పోలీసు స్టేషన్లో నమోదైన కేసులను కొట్టివేయాలంటూ అఖిల ప్రియ దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎటువంటి కారణాలు లేకుండా రాజకీయ వేధింపులతోనే కేసు నమోదు చేశారని న్యాయవాది కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం సీఆర్పీసీలోని సెక్షన్ 41 ఎ ప్రకారం విచారణ జరపాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది.