భారతీయులకు నార్త్ ఆఫ్రికన్ కంట్రీ మొరాకో గుడ్న్యూస్ చెప్పింది. వీసాల జారీ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. టూరిస్ట్, విజిటర్ వీసాల కోసం భారతీయులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. అన్ని కేటగిరీలకు సంబంధించిన వీసా దరఖాస్తులను స్వీకరిస్తున్న స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ వీసా కన్సల్టెంట్ కూడా ధ్రువీకరించింది. న్యూఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై, ముంబై తదితర నగరాల్లోని వీసా అప్లికేషన్ సెంటర్ల ద్వారా భారతీయలు వీసా కోసం అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. టూరిస్ట్, విజిటర్ వీసాల కోసం రూ.2,560 చెల్లించాలని చెప్పింది. దీంతోపాటు టూరిజం ప్రమోషనల్ ఛార్జీల కింద మరో రూ.140 చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది.