నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఆదివారం నాడు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) 175వ సాహితీ సదస్సు డాలస్లో ఆసక్తికరంగా సాగింది. ప్రవాస చిన్నారి భవ్య ఆలపించిన వినాయకుడి ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది. టాంటెక్స్ మాజీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ ముఖ్య అతిథి కొమరవోలు సరోజని సభకు పరిచయం చేశారు. సరోజ “అందరినీ ఆకట్టుకునే కథా రచన – ఒక కథా రచయిత్రి మనోభావాలు” అనే అంశంపై ప్రసంగించి ఆకట్టుకున్నారు. వారి రచనలలో పేరు గడించిన “గాదిరి కోడలు” కథతో ఉల్లాసపరిచారు. కాశీనాథుని రాధ పద్య సౌగంథం శీర్షికన భాగవతంలో నుండి చక్కని పద్యాన్ని వినిపించారు. లెనిన్ వేముల మయూరుని శతకం గురించి వివరించారు. “మన తెలుగు సిరి సంపదలు” ధారావాహికలో భాగంగా నరసింహారెడ్డి పొడుపు కథలు, జాతీయాలు, సంఖ్యా బోధక పదాలను సభ్యులకు గుర్తుచేశారు. మాసానికో మహనీయుడు శీర్షికలో అరుణ జ్యోతి ప్రముఖ రచయితల గురించి వివరించారు. సమన్వయకర్త శ్రీనివాసులు బసాబత్తిన జ్ఞాపిక చదివి వినిపించారు. అధ్యక్షుడు ఉమా మహేష్ పార్నపల్లి ధన్యవాదాలు తెలిపారు.
ఆసక్తికరంగా టాంటెక్స్ 175వ సాహితీ సదస్సు
Related tags :