Devotional

వేయిస్తంభాల గుడిలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం – TNI ఆధ్యాత్మికం 24/02/2022

వేయిస్తంభాల గుడిలో  బ్రహ్మోత్సవాలు  ప్రారంభం –  TNI  ఆధ్యాత్మికం 24/02/2022

హన్మకొండ లోని వేయి స్తంభాల శ్రీ రుద్రేశ్వరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 28వ తేదీ నుండి వచ్చే నెల 4వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కెసీఆర్ పండుగలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా దేవాలయాలకు పూర్వ వైభవం దక్కిందన్నారు. ధూప దీప నైవేద్యాలకు నో చని దేవాలయాలు కూడా ఈరోజు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయని అన్నారు. యాదాద్రి దేవాలయం అత్యున్నత ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్ల నున్నదని మంత్రి చెప్పారు. త్యంత పురాతనమైన కాకతీయుల నాటి వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం కూడా మహిమాన్వితమైనదని మంత్రి చెప్పారు. నాటి కాకతీయ రాజులు ప్రతినిత్యం రుద్రేశ్వరున్ని కొలిచే వారిని చెప్పారు. ఈ దేవాలయ మరింత అభివృద్ధికి తాము కృషి చేస్తామని అన్నారు. ప్రతిష్ఠాత్మకమైన ఈ వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలను ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాకతీయుల కాలంనాటి ఈ వేయిస్తంభాల దేవాలయంనకు గొప్ప చరిత్ర ఉన్నదని శివరాత్రి పండుగ రోజు జరిగే బ్రహ్మోత్సవాలకు దేవాదాయశాఖతో పాటు ఇతర అన్ని శాఖల ద్వారా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.నగర మేయర్ “గుండు సుధారాణి” మాట్లాడుతూ శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు వేయి స్తంభాల దేవాలయ ప్రాంగణమంతా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా పూర్తిస్థాయిలో లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయడంతోపాటు, భక్తులకు మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తామని అన్నారు

2. 19 నుంచి మాతా వైష్ణోదేవి యాత్ర
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ సంస్థ (ఐఆర్సీటీసీ) ‘‘భారత్ దర్శన్’’ పేరుతో కొత్తగా మరో టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. సంస్థ డిప్యుటీ జనరల్ మేనేజర్ జీపీ కిషోర్, ఏరియా మేనేజర్ మురళీకృష్ణ మంగళవారం విజయవాడ కార్యాలయంలో మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. ‘ఉత్తర భారత యాత్ర మాతా వైష్ణోదేవి’ పేరుతో మార్చి 19న ఉదయం రాజమహేంద్రవరంలో రైలు బయలుదేరుతుంది. స్లీపర్ క్లాస్ ఒక్కొక్కరికి రూ.8,510, ఏసీ త్రీటైర్(కంఫర్ట్) రూ.10,400గా నిర్ణయించారు. మరిన్ని వివరాల కోసం 8287932319, 9701360675 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

3. శ్రీవారి దర్శన టికెట్లు పెంపు
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. కొవిడ్ కేసులు తగ్గుతున్న క్రమంలో దర్శనాల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు రోజుకు అదనంగా 13వేల టికెట్ల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కోటాను బుధవారం ఉదయం 9 గంటలకు ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్’ వెబ్సైట్లో టీటీడీ విడుదల చేయనుంది. ఫిబ్రవరికి సంబంధించి ఇప్పటికే రోజుకు 12వేల టికెట్లు కేటాయించిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రస్తుతం తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల్లో ఆఫ్లైన్ ద్వారా ఇస్తున్న సర్వదర్శన టోకెన్లను(ఉచిత దర్శనం) కూడా 15వేల నుంచి 20వేలకు పెంచారు. అదనపు టోకెన్లను ఈ నెల 26 నుంచి భక్తులకు కేటాయిస్తారు. అలాగే మార్చి నెలకు సంబంధించి రోజుకు 25వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను బుధవారం ఉదయం ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.

4. తాడేపల్లి పట్టణ పరిధిలోని కృష్ణా తీరంలో ఉన్న శ్రీమద్విరాంజనేయస్వామి ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ మంగళవారం దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చక స్వాములు జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్ను ఆశీర్వదించి, ఆలయ విశిష్టతను వివరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

5. చిన్న ఆలయాల్లోనూ ఈ-హుండీలు
కేటగిరీ 6(బి) ఆలయాల్లోనూ ఈ-హుండీలు, ఈ-డొనేషన్ విధానం ప్రవేశపెట్టాలని దేవదాయశాఖ నిర్ణయించింది. ప్రసు ్తతం6(ఎ) కేటగిరీలోని 175 పెద్ద ఆలయాల్లో ఈ-హుండీలు, డొనేషన్ల విధానం అమలుచేస్తున్నారు. ఈ మేరకు దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీచేశారు.

6. మార్చిలో 14 లక్షల దర్శన టికెట్లు
కోవిడ్ పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తున్న నేపథ్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దాదాపు రెండేళ్లుగా ఆంక్షల నడుమ దర్శనాల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కువమంది ప్రజలకు టీకాలు వేయడం, వైరస్ తగ్గుముఖం పట్టడంతో టీటీడీ మరింతమంది భక్తులకు దర్శనం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. మార్చి నెలలో దాదాపు 14 లక్షల మంది భక్తులకు సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈడీ) కల్పించేందుకు టికెట్లు జారీచేయనుంది. మార్చిలో రోజుకు 25 వేల వంతున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నేడు (బుధవారం) ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే మార్చిలో రోజుకు 20 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని కౌంటర్ల ద్వారా ఆఫ్లైన్ పద్ధతిలో కేటాయించనుంది.

7. Vemulawada రాజన్న హుండీ ఆదాయం రూ. కోటి 89 లక్షలు
వేములవాడ రాజరాజేశ్వరస్వామివారికి ఆలయ హుండీ ద్వారా రూ.కోటి 89 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. బుధవారం ఆలయ ఓపెన్ స్లాబ్లో 14రోజుల హుం డీల ఆదాయాన్ని లెక్కిం చారు. కోటి 89 లక్షల 81 వేల 7 రూపాయాల నగదు, 198 గ్రాముల 430 మిల్లీ గ్రాముల బంగారం, 17 కిలోల 550 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. అధికారులు, సిబ్బందితోపాటు సత్యసాయి సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.

8. తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ బుధవారం ఆన్లైన్ ద్వారా విడుదల చేసింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి 24 నుంచి 28వ తేదీ వరకు రోజుకు 13 వేల టికెట్ల చొప్పున(అదనపు కోటా), మార్చి నెలకు సంబంధించి రోజుకు 25 వేల చొప్పున మొత్తం 8.40 లక్షల టికెట్లను ఉదయం 9 గంటలకు విడుదల చేశారు. టికెట్ల కోసం భక్తులు భారీగా పోటీపడటంతో పేమెంట్ గేట్వేలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దాదాపు 2.80 లక్షల మంది పేమెంట్ గేట్వే వద్ద నిలిచిపోయినట్టు సమాచారం. ఫలితంగా మధ్యాహ్నం 12 గంటల వరకు టికెట్ల బుకింగ్లో భక్తులు ఇబ్బంది పడ్డారు. టికెట్ల కోసం గంటల తరబడి సెల్ఫోన్, సిస్టమ్స్ ముందే కూర్చోవాల్సి వచ్చింది. దీంతో అధికారులు ప్రత్యేక దృష్టిసారించి పేమెంట్ గేట్వే సమస్యను పరిష్కరించారు. ఆ తర్వాత 12 నుంచి 12.45 గంటల వరకు 5 లక్షల టికెట్లను భక్తులు పొందారు. సాయంత్రం 6 గంటల సమయానికి 7.90 లక్షల టికెట్లు భక్తులు తమకు కావాల్సిన తేదీల్లో పొందారు. బిగ్సేల్ ఆఫర్లు భారీగా ఉండటంతో పేమెంట్ గేట్వే సమస్య తలెత్తిందని, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త పడతామని టీటీడీ అధికారులు తెలిపారు.
*భక్తులకు వ్యాక్సినేషన్ లేదా ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్ తప్పనిసరి
కొవిడ్ కేసులు తగ్గుతున్న క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్యను టీటీడీ పెంచింది. అయితే దర్శనాల సంఖ్యను పెంచినప్పటికీ కొవిడ్ వ్యాక్సినేషన్ రెండు డోసులు లేదా 48 గంటల ముందు తీసుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ను తప్పనిసరిగా తీసుకురావాలనే నిబంధనను కొనసాగిస్తామంటూ టీటీడీ ప్రకటించింది.

9. శైవక్షేత్రాలకు 3325 బస్సులు: ఆర్టీసీ ఎండీ
వచ్చే నెల 1న మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ, శ్రీశైలం తదితర 96 శైవక్షేత్రాలకు 3325 బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. బుధవారం ఆయన గుంటూరు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ డిపోను సందర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ శివరాత్రి ముందు రోజు, శివరాత్రి రోజు భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా 21 లక్షల మంది క్షేత్రాలు దర్శించుకునే విధంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

10. భృంగి వాహనంపై మల్లన్న
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల రెండోరోజు బుధవారం నుంచి వాహన సేవలు, గ్రామోత్సవాలు ప్రారంభమయ్యాయి. భృంగి వాహనంపై ఉత్సవమూర్తులను ఆశీనులనుజేసి సుగంధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం క్షేత్ర వీధుల్లో విహరింపజేశారు.

11. పెద్దింట్లమ్మ బోనాలకు సర్వసన్నద్ధం
*మార్చి 3 నుంచి 18 వరకు జాతర
తెలంగాణ బోనాల సంప్రదాయం కొల్లేరు సరస్సుకు ప్రవహిస్తోంది. కృష్ణా జిల్లా కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరలో రెండేళ్ల క్రితం ప్రారంభమైన బోనాల సమర్పణకు ఏటా మహిళా భక్తులు పెరుగుతున్నారు. ఈ ఏడాది నుంచి కొల్లేరు సరస్సులో సహజ సిద్ధంగా లభించే కలువ పువ్వులతో బోనాలు సమర్పించాలని పెద్దలు నిర్ణయించారు. మార్చి 3 నుంచి 18వ తేదీ వరకు వేడుకగా జరిగే ఈ జాతరకు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల కొల్లేరు పరీవాహక ప్రాంత గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారు. బోనాలకు సంబంధించిన సామగ్రిని ఇప్పటి నుంచే గ్రామస్తులు సిద్ధం చేస్తున్నారు.
*నీటి మధ్యలో ద్వీపకల్పం
పద్మాసన భంగిమలో ఆశీనులైన పెద్దింట్లమ్మ తల్లి.. వేంగిరాజుల కాలంలో నిర్మించిన పురాతన దేవాలయం.. కొల్లేటి గ్రామాల ప్రజలకు ఆరాధ్యదైవం. దేవాలయంలో అనేక విశేషాలున్నాయి. అమ్మకు ఏటా జాతర (తీర్థం) నిర్వహిస్తారు. ఆ సమయంలో కొల్లేటికోట పెద్ద జనారణ్యంగా మారుతుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గాగోకర్ణేశ్వరస్వామి కల్యాణం రోజున ప్రభల ఊరేగింపు, బోనాల సమర్పణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
*బోనం ఇలా సమర్పిస్తారు..
భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. తెలంగాణలో ఉజ్జయిని మహంకాళి, మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, మారెమ్మలకు జూలై నెలలో బోనాలు సమర్పిస్తారు. అదే విధంగా 2020 నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మకు బోనాలు సమర్పిస్తున్నారు. మొదటి ఏడాది 60 మంది బోనాలు సమర్పిస్తే, రెండో ఏడాది ఆ సంఖ్య 200కు చేరింది. మహిళలు మూడు మట్టి కుండలను ఒకదానిపై ఒకటి ఉంచి వాటిలో పానకం, పిండి వంట, వడపప్పు, చలివిడి నింపి చివర కుండపై నెయ్యితో నిండిన దీపాన్ని ఉంచుతారు. బోనాలకు ముందు వరసలో 7 కావిళ్లలో పసుపు, కుంకుమ, నెయ్యి, వేప రొట్టలు, నిమ్మకాయలు, పానకం, కల్లు, అమ్మవారి ప్రతిరూపాలుగా భక్తులు మోసుకెళ్తారు.
*అమ్మకు ఇష్టం కలువ బోనాలు..
ఈ ఏడాది నుంచి కొల్లేరు సరస్సులో లభించే కలువ పువ్వుల బోనాలను సమర్పించాలని నిర్ణయించారు. అమ్మవారి దేవస్థానానికి 2 కిలోమీటర్ల దూరంలోని పందిరిపల్లిగూడెం నుంచి ప్రభల ఊరేగింపుతో పాటు బోనాలను ఎత్తుకుని మహిళలు ప్రారంభమవుతారు. పూర్వం అమ్మవారికి కొల్లేరు సరస్సులో లభించే కలువ పువ్వులతో పూజలు చేసేవారు. పెద్దింట్లమ్మకు ఈ పువ్వులంటే ఇష్టమని భక్తులు భావిస్తారు

12. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు వెళ్లే భక్తుల వద్ద నుంచి ఆర్టీసీ పాత టికెట్‌ ధరలే వసూలు చేస్తుందని, ధరల్లో ఎలాంటి మార్పులూ చేయడం లేదని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ద్వారకా తిరుమలరావు చెప్పారు. రెండేళ్లుగా డీజిల్‌ రేట్లు విపరీతంగా పెరిగినా.. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ వద్ద జరిగే తిరునాళ్లకు ఆర్టీసీ సంస్థ చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం ఆయన నరసరావుపేటకు వచ్చారు.
kapileswaraswami-24
13. కపిలేశ్వరస్వామి ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు..
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కొవిడ్‌ 19 నిబంధ‌న‌ల ప్రకారం ఏకాంతంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు గురువారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామి, కామాక్షి అమ్మవారి సమేతంగా భూత వాహనంపై దర్శనమిచ్చారు. పూర్వం క్రూరభూతాల ప్రజలు పడుతున్న బాధల నుంచి కాపాడాలని బ్రహ్మదేవుడు శివున్ని వేడుకున్న మేరకు ‘‘భూతపతి”గా అవతరించి బాధలను తొలగించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకు ప్రతీకగా లయకారుడు భూతవాహనంపై అభయమిచ్చాడని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌య అర్చకులు పాల్గొన్నారు.

14. కొమురవెల్లి మల్లన్న‌కు గోదావరి జలాలతో జలాభిషేకం
ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్నను దర్శించుకొని స్వామివారికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లన్నసాగర్ గోదావరి జలాలతో మల్లన్నకు జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రి హరీష్‌రావు, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయలాంటి కొమురవెల్లి మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును సీఎం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడుతూ మల్లన్నసాగర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కొమురవెల్లిలోని స్వామివారిని దర్శించుకున్నారు. కొమురవెల్లి మల్లన్న స్వామి పేరు మీదుగా తుక్కాపూర్‌లో 50య టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్‌ ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 15.70 లక్షల ఎకరాలకు సాగు నీరు, హైదరాబాద్‌ నగరానికి తాగునీరు అందించేలా రూపొందించారు.

15. తిరుమల శ్రీవారికి రూ. 2. 72 కోట్లు ఆదాయం..
కలియుగ శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంట్లో భాగంగా నిన్న 37,216 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 22,009 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయ హుండీకి రూ. 2. 72 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

16. శ్రీవారి ఆస్తుల పరిరక్షణకు జియో ఫెన్సింగ్‌కు టీటీడీ నిర్ణయం
తిరుమల కొండతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి ఆస్తులకు కాపాడేందుకు టీటీడీ నడుం బిగించింది. ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు, భూములు ఆక్రమణకు గురికాకుండా చూసేందుకు జియో-ఫెన్సింగ్‌కు వెళ్లాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో సంబంధ అధికారులతో భూఆస్తులతోపాటు టీటీడీ ఆస్తుల స్థితిగతులపై టీటీడీ జేఈవో సదా భార్గవి సమీక్ష చేపట్టారు. జియో సర్వే, మ్యాపింగ్, ఫెన్సింగ్ టెక్నిక్‌లతో పాటు జియో ఫెన్స్‌పై హైదరాబాద్‌లోని నీర్ ఇంటరాక్టివ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత జయశంకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు

17. తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి యాదాద్రికి కిలో బంగారం విరాళం
తుంగతుర్తి నియోజకవర్గం నుంచి యాదాద్రి ఆలయానికి కిలో బంగారాన్ని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ విరాళంగా ప్ర‌క‌టించారు. గురువారం తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా తన వంతుగా 250 గ్రాముల బంగారం యాదాద్రికి ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే ప్ర‌క‌టించారు.
bcm
18. భద్రాచలం శ్రీరాముడి కల్యాణానికి ఏర్పాట్లు.. సిద్ధమవుతున్న తలంబ్రాలు
వేయి పున్నముల శోభను కళ్లెదుట సాక్షాత్కరింపచేసే భద్రాద్రి రాములోరి కల్యాణం అద్వితీయం.. అపురూపం.. ఈ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులు తండోపంతాలుగా తరలివస్తారు… కానుకలు, నైవేద్యాలు సమర్పించుకుంటారు… కానీ ఆ సీతారాముల కల్యాణానికి కావాల్సిన తలంబ్రాలు సమర్పించే భాగ్యం మాత్రం కొందరికే దక్కుతుంది… ఈ సారి కూడా ఆ అవకాశాన్ని శ్రీరఘురామ భక్త సమితే పొందింది.భద్రాద్రి రామయ్య కల్యాణానికి గోటితో ఒలిచే తలంబ్రాలు సమర్పించే భాగ్యాన్ని ప్రకాశం జిల్లా చీరాలలోని శ్రీరఘురామ భక్త సేవా సమితి దక్కించుకుంది. శ్రీరామనవమి రోజున సీతారామ కళ్యాణానికి ఉపయోగించే తరంబ్రాలను గోటితో వలిచి తరంబ్రాలుగా తీర్చిదిద్దే అవకాశాన్ని వరుసగా ఎనిమిదోసారి సేవా సమితి దక్కించుకుంది. గత ఐదు రోజుల నుంచి గోటితో వడ్లు వలిచే ప్రక్రియ ప్రారంభించారు. ఈ క్రతువు భద్రాచలంలో తలంబ్రాలు సమర్పించటంతో ముగియనుంది.చీరాలకు చెందిన శ్రీరఘురామ భక్త సేవా సమితి 2011లో 11 మంది సభ్యులతో ఏర్పాటైంది. 2013లో శ్రీరామ నవమి వేడుకలకు తలంబ్రాలు సమర్పించేందుకు భద్రాచలం దేవస్థానం నుంచి అనుమతి పొందారు. అప్పటినుంచి భద్రాచలానికి గోటితో ఒలిచిన తలంబ్రాలను పంపుతున్నారు. ఈ క్రతువు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు దిల్లీ, బెంగుళూరు, చెన్నై, ఒడిశా మొదలుకుని.. అమెరికా, దక్షణాఫ్రికా, కెనడా, తదితర ప్రాంతాల్లో జరగుతుంది. 50 మంది పర్యవేక్షకుల మధ్య పది వేలకుపైగా భక్తులు పాల్గొంటున్నారు. కమిటీ ప్రతినిధులు దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల సహాయంతో రామ భక్తులకు ఈ వడ్లను పంపిస్తారు. వారు ఒలవడం పూర్తి చేసి వాటిని పర్యవేక్షకుల వద్దకు కొరియర్ల ద్వారా చేరుస్తారు.
*మొత్తం క్రతువుకు 15 వేల కిలోల
శీరాముడి కల్యాణ క్రతువుకు మొత్తం 15 వేల కిలోల బియ్యం అవసరం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ 10వ తేదీ శ్రీరామ నవమి పర్వదినం. మార్చి 26వ తేదీ వరకు గోటితో ఒడ్లను ఒలిచి 27వ తేదీన మూటలు కడతారు. సుమారు 30 కింట్వాళ్ల బియ్యాన్ని పసుపు ఇతర సుగంధద్రవ్యాలతో కలుపుతారు. అన్నింటినీ అదేరోజు భద్రాచలానికి పంపిస్తారు. పసుపు 250 కిలోలు, కుంకుమ 500 కిలోలు, నూనె, నెయ్యిని భద్రాచలానికి పంపుతామని నిర్వాహకులు పొత్తూరి బాలకేశవులు తెలిపారు.

Whats-App-Image-2022-02-24-at-08-03-45

Whats-App-Image-2022-02-24-at-08-03-46

Whats-App-Image-2022-02-24-at-08-03-47-1

Whats-App-Image-2022-02-24-at-08-03-47

Whats-App-Image-2022-02-24-at-14-30-05

Whats-App-Image-2022-02-24-at-14-30-06-1

Whats-App-Image-2022-02-24-at-14-30-06

Whats-App-Image-2022-02-24-at-14-30-07