త్వరలో ‘ ఆర్ఆర్ఆర్ ‘ ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్న ఆలియాభట్ తన వ్యక్తిగత విషయాల నుంచీ … సినిమాల వరకూ సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకునేందుకు ముందుంటుంది . ఇందులో ఎక్కువగా ఆలియా తీసుకునే ఆహారం , చేసిన వంటకాల ప్రయోగాలు , వ్యాయామాలు , మేకప్ … ఆమె ప్రారంభించిన పిల్లల దుస్తుల కంపెనీకి సంబంధించిన ప్రకటనల తాలూకు వీడియోలు ఉంటాయి . వీటన్నింటితోపాటూ తన సినిమాలకు సంబంధించిన వివరాలను కూడా ఈ ఛానల్లో అప్పుడప్పుడూ పోస్ట్ చేస్తుంటుంది . దీన్ని సరదాగానే ప్రారంభించినా ప్రస్తుతం పదహారు లక్షల మందికి పై సబ్సైబర్లు ఉన్నారనీ , ఎప్పటికప్పుడు కొత్త విషయాలను పంచుకునేందుకు ఇది కూడా చక్కని వేదికేననీ అంటుంది ఆలియా .