NRI-NRT

ఉక్రెయిన్ లో భారతీయుల కోసం హెల్ప్ లైన్

ఉక్రెయిన్ లో భారతీయుల కోసం హెల్ప్ లైన్

ఉక్రెయిన్‌లోని భారతీయుల కోసం 24×7 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్.. వివరాలివే.. ఉక్రెయిన్‌పై రష్యా గురువారం ఉదయం యుద్ధం ప్రారంభించడంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులకు సాయం చేసేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అక్కడ ఉన్న మనోళ్లు ఎలాంటి సమాచారం, సాయం కావాలన్న ఈ హెల్ప్‌లైన్‌ ద్వారా అధికారులను సంప్రదించవచ్చు. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ, ఎంఈఏ సంయుక్తంగా ప్రకటించాయి. అలాగే కంట్రోల్ రూమ్ వివరాలను వెల్లడించాయి.

ఎంఈఏ అందించిన కంట్రోల్ రూమ్ వివరాలు ఇలా ఉన్నాయి..
టోల్ ఫ్రీ: 1800118797ఫోన్‌లు: +91 11 23012113, +91 11 23014104, +91 11 23017905
ఫ్యాక్స్: +91 11 23088124
ఇమెయిల్: situationroom@mea.gov.in
ఉక్రెయిన్‌లో 24×7 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్: +380 997300428, +380 997300483
ఇమెయిల్: cons1.kyiv@mea.gov.in
వెబ్‌సైట్: eoiukraine.gov.in