‘‘జగన్ లాంటి సీఎంను నా జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు. నా గవర్నమెంటు నా ఇష్టం అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారు’’ అని టీడీపీ అధినేత చందబాబు ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని దుయ్యబట్టారు. సర్పంచ్‌లను జగన్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని తప్పుబట్టారు. గ్రామాల్లో ఆడిటింగ్ కూడా సర్పంచ్‌ల ఆధ్వర్యంలో జరగాలన్నారు. జగనుకు రాజ్యాంగం ఎలాంటి హక్కులిచ్చిందో.. సర్పంచులకూ రాజ్యాంగం అలాంటి హక్కులే ఇచ్చిందని గుర్తుచేశారు. పంచాయతీలకు రావాల్సిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటే.. దొపిడీ అనాలా..? ఇంకేమైనా అనాలా..? అని చంద్రబాబు ప్రశ్నించారు.
* జగ్గారెడ్డి పార్టీ విడిచి వెళ్ళడని భావిస్తున్నాం: భట్టి విక్రమార్క ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ విడిచి వెళ్ళడని భావిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డికి కొన్ని ఇబ్బందులున్నాయని, తమ దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. జగ్గారెడ్డి రాజీనామా చేయకుండా సముదాయించామని, ఆయన లేవనెత్తిన అంశాలపై అధిష్టానంతో మాట్లాడుతామని భట్టి తెలిపారు. జగ్గారెడ్డిని పార్టీ వీడొద్దని చెప్పామని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు. జగ్గారెడ్డి తమతో అనేక విషయాలు చెప్పారని, వాటిని అధిష్టానం ముందు పెడతామని చెప్పారు. జగ్గారెడ్డి వ్యవహారం మాణిక్కం ఠాగూర్‌కు పీసీసీ నేతలు చేరవేస్తున్నారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
* జగన్‌కు చిరంజీవి దండం పెట్టడం బాధనిపించింది: జేసీ సినీ పరిశ్రమ కోసం సీఎం జగన్‌కు నటుడు చిరంజీవి దండం పెట్టడం బాధ కల్గించిందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు బ్రతికే పరిస్థితి లేదన్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై జగన్ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని దుయ్యబట్టారు. జగన్ చర్యలతో పవన్‌కు ఏం కాదు.. నిర్మాతలకే ఇబ్బందని తెలిపారు. పవన్‌ను ఏం చేయలేక.. సినిమా వారిపై పడ్డారా? అని ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంకెంతమందిని జగన్‌రెడ్డి వేధిస్తారని నిలదీశారు. టీటీడీ రేట్లు ఎందుకు పెంచుతున్నారు? అని ప్రశ్నించారు. దేవస్థానం మీ అబ్బసొత్తు కాదు.. పేదలు తిరుపతికి రావద్దా? అని మరోసారి ప్రశ్నించారు. జగన్‌రెడ్డి.. ఇకనైనా ధరల పెంపు మానుకోవాలని ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు
* భట్టితో ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. జగ్గారెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారంతో ఇద్దరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. 25న శుక్రవారం సంగారెడ్డిలో కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశం కానున్నారు. దీంతో జగ్గారెడ్డిని భట్టి బుజ్జగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి త్వరలో రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి…కార్యకర్తలతో భేటీకి సిద్ధమయ్యారు. సంగారెడ్డిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం ఓ సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, సీనియర్లు బుజ్జగింపుల అనంతరం పార్టీకి రాజీనామా చేసే అంశాన్ని జగ్గారెడ్డి 15 రోజులు వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే
* అయ్యన్న కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్
నర్సీపట్నంలోని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. గురువారం మధ్యాహ్నం విశాఖలోని కోర్టు పనులు ముగించుకుని నర్సీపట్నం వచ్చిన లోకేష్‌కు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన అయ్యన్న కుటుంబ సభ్యులను పరామర్శించి వారితో కలిసి భోజనం చేశారు. కాగా అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. సీఎం జగన్‌ను దూషించారంటూ అయ్యన్నపాత్రుడిపై పశ్చిమ గోదావరి జిల్లాలో 505(2), 153(ఎ), 506 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. అయ్యన్నపాత్రుడి ఇంటికి వచ్చిన నల్లజర్ల పోలీసులు నోటీసులంటించారు. బుధవారం రాత్రి అయ్యన్నపాత్రుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పోలీసుల చర్యలపై అయ్యన్నపాత్రుడి తరపు న్యాయవాది సతీష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయ్యన్నపై నమోదైన కేసుల్లో తదనంతర చర్యలపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఎటువంటి దూకుడు చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశించింది.
* టీఆర్ఎస్ పార్టీ సింహం లాంటింది : ఎమ్మెల్సీ కవిత
టీఆర్ఎస్ పార్టీ సింహం లాంటింది.. తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ పార్టీ రారాజుగా నిలిచిపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముజిబుద్దీన్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత హాజరై ప్రసంగించారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాలను ఎండగడుతూ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని లెక్కలతో సహా చెప్పి ప్రజలను ముందుకు నడిపించాం. టీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మి, వెంట నడిచారు. అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కేసీఆర్‌ను రెండు సార్లు సీఎం చేశారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ 70 లక్షల సభ్యతాలకు చేరుకుంది. టీఆర్ఎస్ పార్టీ న్యాయం, ధర్మం వైపే ఉంది అని కవిత స్పష్టం చేశారు
* టీఆర్ఎస్ న్యాయం వైపే ఉంటుంది: ఎమ్మెల్సీ కవిత
టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అన్నం పెడితే, బీజేపీ సున్నం పెడుతోందని ఆమె ఆరోపించారు.రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలు నోరు విప్పడం లేదని ఆమె విమర్శించారు. దేశ ప్రజల ప్రయోజనం కోసం పోరాడేది కేవలం టీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. దేశ సంపదను అమ్మడంలో బీజేపీ నెంబర్ వన్ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓపికను, సహనాన్ని చేతకాని తనంగా భావించొద్దని కవిత స్పష్టం చేశారు
* ఇంటర్మీడియట్ అంటే తెలియని అమిత్ షా – ల్యాప్‌టాప్ హామీపై అఖిలేశ్ చురక
పన్నెండో తరగతి పూర్తయి ఇంటర్‌లో ప్రవేశం పొందే వారికి ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇవ్వడంపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చురకలు వేశారు. ఇంకా నయం ఇంటర్ పూర్తయి పదో తరగతి చదువుతున్నవారికి ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తామనలేదని ఎద్దేవా చేశారు. 11, 12వ తరగతులను కలిపి ఇంటర్మీడియట్ అంటారన్న విషయం అమిత్ షాకు తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉన్నదని చెప్పారు. బుధవారం బహ్రైచ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అఖిలేశ్ మాట్లాడుతూ నాలుగో విడుత పోలింగ్ ముగిసేసరికి సమాజ్‌వాదీ పార్టీకి 200 సీట్లు వస్తాయని పేర్కొన్నారు.
* అంగన్ వాడీలపై టీడీపీకి ప్రేమలేదు: మంత్రి తానేటి వనిత
అంగన్ వాడీ వర్కర్ల పై టీడీపీకి ప్రేమ లేదని మంత్రి తానేటి వనిత విమర్శించారు. ఎర్రపార్టీ,పచ్చపార్టీలు కుమ్మక్కయి కుట్రతో రోడ్డుపైకి వచ్చి డ్వాక్రా మహిళలకు అన్యాయం జరిగిందని ఆందోళనచేస్తున్నారని అన్నారు. 2014 లో డ్వాక్రా మహిళలకు టీడీపీ పదోన్నతులు ఇవ్వలేదు. డ్వాక్రా మహిళల డిమాండ్ల ను ముఖ్యమంత్రి జగన్ ధృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
* వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక అరాచకం: అశోక్‌బాబు
రాష్ట్రంలో భౌతిక, రాజకీయ అరాచకంతో పాటు ఆర్థిక అరాచకం కూడా పెరిగిపోతోందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రూ. 7 లక్షల కోట్ల అప్పు తీర్చేందుకు ప్రజలపై పరోక్షంగా పన్నుల భారం మోపారని ఆరోపించారు. స్కీంలు, స్కామ్‌లు తప్ప రాష్ట్రంలో బడ్జెట్ అనే పదానికి అర్థం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికే ఏపీ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఐపీ పెట్టే స్థాయికి వచ్చిందని, రేపు రాష్ట్రానిదీ అదే పరిస్థితని అన్నారు. ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం పరీష్కరించలేదని, అణగదొక్కిందని విమర్శించారు. పీఆర్సీ నివేదికను కోర్టు ద్వారా ఉద్యోగులు సాధించటంతో రాష్ట్ర ప్రభుత్వ పరువు పోయిందన్నారు
* డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం కృషి : మంత్రి తలసాని
ష్ట్రంలో డ్రగ్స్ నిర్ములన కోసం సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని, ఇప్పటికే రెండు సార్లు ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన సదస్సు లో ముఖ్య అతిథిగా పాల్గొని మంత్రి మాట్లాడారు. ప్రపంచాన్ని డ్రగ్స్ ప్రస్తుతం కుదిపేస్తున్నది. చాలా మంది తెలియకుండానే డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని ఆయన తెలిపారు.ఒక్కసారి డ్రగ్స్ కు బానిసలు అయితే చావే శరణ్యం అన్నారు. చాలా నేరాలలో నేరస్తులను క్షణాల్లో పట్టుకునే సత్తా తెలంగాణ పోలీసులకే ఉందన్నారు. కార్పొరేట్ ఆఫీలకు దీటుగా పోలీస్ స్టేషన్ కార్యాలయాలు ఉన్నాయన్నారు. సమాజంలో ఉన్న డ్రగ్స్ మాఫియా నిర్ములించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరికి డ్రగ్స్ పై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీసే డ్రగ్స్‌ను అందరం కలిసి అడ్డుకుందామన్నారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే పోలీసులు ఎంతటి వారినైనా వదిలి పెట్టరని హెచ్చరించారు.
* కేసీఆర్‌ను చూసి నేర్చుకో…జగన్‌పై మండిపడ్డ సోమిరెడ్డి సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో వ్యవసాయం మూతపడిందని.. ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గొంతెమ్మ కోర్కెలు కోరారని గుర్తు చేశారు. ఆక్వా రంగంలో నెల్లూరు జిల్లాలో రెండు కోట్ల వరకు నష్టం వాటిల్లితే రూ.75 లక్షలు మాత్రమే పరిహారం అందించారన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ను చూసి నేర్చుకో… రైతు శ్రేయస్సు కోసం ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారో’’ అని దుయ్యబట్టారు. ‘‘కన్నబాబు మీకు అగ్రికల్చర్ స్పెల్లింగ్ తెలుసా… ఇరిగేషన్ మంత్రి అనిల్ నీకు నీటిపారుదల గురించి తెలుసా..అలాంటి వారిని మంత్రులుగా పెట్టుకున్నారు.. నీటిపారుదల శాఖ స్తంభించిపోయింది’’ అని విమర్శించారు. అధికార పార్టీకి చెందిన బ్రోకర్లు రైతులను మోసం చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. దేశంలో ప్రతి రాష్ట్రంలో బిందు సేద్యం పథకం ఉంటే రాష్ట్రంలో నిలుపుదల చేసే హక్కు ఎవరిచ్చారని
* ఏపీలో టీడీపీ నేతకు హైకోర్టులో ఊరట..
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడికి సానుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అకారణంగా పోలీసులు తనకు నోటీసులు జారీ చేసి అరెస్టు చేయాలని చేస్తుందని పేర్కొంటు అయ్యన్నపాత్రుడు ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారించిన అయ్యన్నపాత్రుడుపై తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో అయ్యన్నపాత్రుడికి ఊరట లభించినట్లయ్యింది.విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించారని వైసీపీ నాయకుడు రామకృష్ణ అయ్యన్నపాత్రుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు నిన్నటి నుంచి ఈరోజు వరకు అయ్యన్నపాత్రుడి ఇంటికి నోటీసులు అతికించారు. అయ్యన్నపాత్రుడు ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పోలీసులకు వివరించినా పోలీసులు నమ్మలేదు. రాత్రి కూడా అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లిన పోలీసులు ఈరోజు వరకు అక్కడే ఉండిపోయారు.
* అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 800 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రైతుల ఉద్యమానికి, పోరాటానికి టీడీపీ ఎప్పుడూ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ప్రత్యేకంగా ఒక ప్రాంతం మీద కక్షను పెంచుకున్న ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో మొదటిసారి చూస్తున్నామన్నారు. తన మూర్ఖపు వైఖరితో రాష్ట్రంలో లక్షల కోట్ల సంపదను సృష్టించే రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసిన జగన్ తప్పులను చరిత్ర ఎప్పటికీ క్షమించదన్నారు
* మోదీ ఆజ్ఞ లేకుండా జై అమరావతి అంటారా?: Nagabhushan
ప్రధాని మోదీ ఆజ్ఞ లేకుండా ఒక్క బీజేపీ కార్యకర్త కూడా ఇక్కడకు వచ్చి జై అమరావతి అంటారా…. ఆయన ఆదేశం మేరకే ఇక్కడికి మద్దతుగా వచ్చామని బీజేపీ నేత పాతూరు నాగభూషణం అన్నారు. వెలగపూడిలో రైతులు చేపట్టిన సామూహిక నిరాహార దీక్షకు బీజేపీ నేతలు లంక దినకర్, పాతూరు నాగభూషణం, విశ్లేషకులు లక్ష్మినారాయణ తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పాతూరి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేస్తాం అంటున్నాయని, అయితే ఇక్కడ రహదారులు కల్పించడం లేదని విమర్శించారు. అమరావతి మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని… దీన్ని ఎలా చేయాలో ఆయనే చూసుకుంటారని నాగభూషణం పేర్కొన్నారు.
* చంద్రబాబు తీసుకువచ్చిన చట్టమే రైతులను కాపాడుతోంది: Devineni Uma
రైతులకు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా చంద్రబాబు సీఆర్డీఏ చట్టం తెచ్చారని… ఆ చట్టమే ఇప్పుడు రాజధాని రైతులను కాపాడుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. వెలగపూడిలో రైతులు చేపట్టిన సామూహిక నిరాహార దీక్షకు దేవినేని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం అమరావతి విధ్వంసం వరకూ కొనసాగుతోందని. రైతులు అమరావతి కోసం ఆనందంగా భూములు ఇచ్చారని అన్నారు. అమరావతి గ్రాఫిక్స్ అంటున్న మంత్రులు ఇక్కడి భవనాల పైకి ఎక్కి దూకాలని… అప్పుడు రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణానది వరదలతో అమరావతిని ముంచాలని చూసిన దుర్మార్గులు వీరన్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన వైకుంఠపురం వద్ద బ్యారేజికి మేం పనులు ప్రారంభిస్తే జగన్ వాటిని ఆపేశారని మండిపడ్డారు. రైతుల భూముల్లో నిర్మించిన సచివాలయంలో కూర్చుని అమరావతికి వ్యతిరేకంగా జీవోలు ఇస్తున్నారన్నారు. నేలపాడులోని హైకోర్టు మాత్రమే ఇప్పుడు రైతులను కాపుడుతోందని తెలిపారు. న్యాయస్థానం లేకపోతే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి ఎవరినీ ఉండనిచ్చేవారు కాదన్నారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని… ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తామని దేవినేని ఉమా స్పష్టం చేశారు.
*హిందుత్వం అంటే వ్యాపారం కాదు: సోము వీర్రాజు
హిందుత్వం అంటే వ్యాపారం కాదని, దేవాలయాలను ఆదాయాన్ని కుమ్మరించే వాటిగా చూస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. టిటిడి బోర్డు చైర్మన్ నిర్ణయాలపై స్పందించిన ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సేవా టికెట్ రేట్లు పెంచడంపై పునరాలోచన చేయాలని సూచించారు. బడ్జెట్‌లో హిందుత్వానికి నిధులు పెంచాలన్నారు. బోర్డు పరిపాలన ధర్మ బద్దంగా ఉండాలని, దేవాలయాల నిర్మాణానికి నిధులు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేవాలయాల పరిపాలన ప్రజల చేతుల్లో ఉంటుందన్నారు. హిందూ ధర్మం పట్ల వైసీపీ వైఖరి అనుమానించే రీతిలో ఉందని సోము వీర్రాజు అన్నారు.
*జగన్ మోదీకి భజన రెడ్డిగా.. కీలుబొమ్మలా తయారయ్యారు: Tulasireddy
జగన్ మోదీకి భజన రెడ్డిగా.. కీలుబొమ్మలా తయారయ్యారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతారా?… ఎంపీలతో రాజీనామా చేయిస్తారా అన్నది జగన్ ప్రభుత్వం తేల్చుకోవాలని అన్నారు. హోదా, వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీతో పాటు రూ.5 లక్షలతో పథకాలు విభజన చట్టంలో ప్రకటించారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రావడంతో అన్ని ఆగిపోయాయన్నారు. బీజేపీ మోసకారితనం… ప్రాంతీయ పార్టీల చేతగానితనం అని వ్యాఖ్యానించారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి మోసం చేసిన వ్యక్తి నరేంద్రమోదీ అని అన్నారు. జగన్ ఎన్నికల ముందు చెప్పిన మాటలు విని ఓట్లేస్తే… విభజన చట్టంలో ఒక్క హామీ నెరవేర్చలేదని తులసిరెడ్డి మండిపడ్డారు
*రైతులకు సీఆర్డీఏ అనే రక్షణ ఉంది: Lanka dinakar
రాజధాని రైతులకు సీఆర్డీఏ అనే రక్షణ ఉందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. వెలగపూడిలో రైతులు చేపట్టిన సామూహిక నిరాహార దీక్షకు లంకాదినకర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతికి న్యాయస్థానాలు బాసటగా నిలిచాయన్నారు. అమరావతి రైతులకు అనుగుణంగా తీర్పు వస్తుందనే దాన్ని ఆలస్యం చేయడానికి చట్టాలు వెనక్కి తీసుకున్నారని తెలిపారు. అమరావతిలో 40 వరకు కేంద్ర సంస్థలు ఏర్పాటు చేస్తాం అని ముందుకు వచ్చాయని… అయితే వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించడం లేదని లంకా దినకర్ మండిపడ్డారు.
*జగన్ మోదీకి భజన రెడ్డిగా.. కీలుబొమ్మలా తయారయ్యారు: Tulasireddy
జగన్ మోదీకి భజన రెడ్డిగా.. కీలుబొమ్మలా తయారయ్యారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతారా?… ఎంపీలతో రాజీనామా చేయిస్తారా అన్నది జగన్ ప్రభుత్వం తేల్చుకోవాలని అన్నారు. హోదా, వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీతో పాటు రూ.5 లక్షలతో పథకాలు విభజన చట్టంలో ప్రకటించారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రావడంతో అన్ని ఆగిపోయాయన్నారు. బీజేపీ మోసకారితనం… ప్రాంతీయ పార్టీల చేతగానితనం అని వ్యాఖ్యానించారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి మోసం చేసిన వ్యక్తి నరేంద్రమోదీ అని అన్నారు. జగన్ ఎన్నికల ముందు చెప్పిన మాటలు విని ఓట్లేస్తే… విభజన చట్టంలో ఒక్క హామీ నెరవేర్చలేదని తులసిరెడ్డి మండిపడ్డారు
*చెప్పింది చేయకపోతే కాలర్ పట్టుకోవాలని జగన్ చెప్పారు: రఘురామ
అంగన్వాడీ ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరిస్తామని సీఎం జగన్ చెప్పారని, ఇప్పుడు న్యాయం చేయాలని అడిగిన ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లను అరెస్ట్ చేస్తున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. బుధవారం ఆయన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పింది చేయకపోతే కాలర్ పట్టుకోవాలని జగన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మంది ఆశావర్కర్లు, లక్షకు పైగా అంగన్వాడీ టీచర్లు ఉన్నారన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన ఆశావర్కర్లకు న్యాయం చేయాలని కోరుతున్నానని అన్నారు. ఓట్లు వేయించుకుని ఇప్పుడు ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లను అరెస్ట్ చేయించడం ఏంటని రఘురామ ప్రశ్నించారు.
*బద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్: అనిత
ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత అన్నారు. అంగన్వాడీ వర్కర్లకు రూ.26 వేలు ఇస్తామని చెప్పి జగన్ మోసం చేశారని ఆమె ఆరోపించారు. ఇకనుంచి మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా సీఎం ఇంటిని ముట్టడిస్తామని ఆమె హెచ్చరించారు. జగన్కు మహిళలు బడిత పూజచేసే రోజు దగ్గర పడిందని ఆమె పేర్కొన్నారు.
*టీటీడీ పాలకమండలివి తప్పుడు నిర్ణయాలు: నారా లోకేష్
శ్రీవారి దర్శనం టికెట్లపై టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలు తప్పని టీడీపీ నాయకుడు నారా లోకేష్ అన్నారు. టీటీడీ ధార్మికమండలిని జగన్ దోపిడీ మండలిగా మార్చారని ఆయన ఆరోపించారు. శ్రీవారి సేవా టికెట్లను పాలక మండలి దోపిడీ దొంగల్లా దోచుకుంటున్నారన్నారు. ప్రసాదం, వసతి, సేవా టికెట్ల రేట్లు భారీగా పెంచే ఆలోచన దుర్మార్గమన్నారు. 31 కేసుల్లో నిందితుడైన సీఎం జగన్రెడ్డి క్రిమినల్ కేసులున్న 16 మందిని బోర్డు సభ్యులుగా నియమించారని ఆయన పేర్కొన్నారు.
*ప్రసన్నపై టీఆర్ఎస్ గూండాల దాడి హేయమైన చర్య: విజయశాంతి
ప్రముఖ న్యాయవాది, బీజేపీ నాయకురాలు ప్రసన్నపై కొంతమంది టీఆర్ఎస్ గూండాలు మల్కాజ్గిరి కోర్టులో దాడి చేయడం హేయమైన చర్య అని బీజేపీ నాయకురాలు విజయశాంతి అన్నారు. ఆస్పత్రిలో ప్రసన్నను పరామర్శించిన విజయశాంతి టీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళా నాయకురాలిపై న్యాయవాదుల రూపంలో ఉన్న గూండాలతో టీఆర్ఎస్ దాడులు చేయించడం సిగ్గు చేటన్నారు. శాంతిభద్రతల్లో దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పుకుంటున్న కేసీఆర్… దీనికేం సమాధానం చెబుతారని రాములమ్మ ప్రశ్నించారు.
*మైలవరంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి: Devineni
మైలవరంలో రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… వైసీపీ మినహా అఖిలపక్షం నేతలు కలెక్టర్ను కలసి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. హడావుడిగా కొత్త జిల్లాల ఏర్పాటు చేశారని.. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి తప్పులకు కారణం.. కొందరు అధికారులు ప్రమోషన్లు, పదవులకు ఆశపడి తప్పుడు సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం బుద్ధి జ్ఞానం లేకుండా వ్యవహరిస్తోందన్నారు. జనగణన, నియోజకవర్గ పునర్విభజన చేయాల్సి ఉందని అన్నారు. కొత్త జిల్లాల ప్రక్రియపై పునరాలోచన చేయాలని సూచించారు. మైలవరం రెవిన్యూ డివిజన్ కోసం ఆందోళనలు ఉధృతం చేస్తామని దేవినేని ఉమా హెచ్చరించారు.
*పులివెందుల తెదేపా అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు
కడపజిల్లా పులివెందుల శాసనసభ స్థానానికి వచ్చే ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా మరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)ని పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. పులివెందుల నియోజకవర్గ నాయకులతో మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు అభ్యర్థిపై స్పష్టతనిచ్చారు. గత ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసి, ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ సతీష్రెడ్డి మళ్లీ పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగుతోందని కొందరు నేతలు ప్రస్తావించారు. ఎవరు వచ్చినా రాబోయే ఎన్నికల్లో అక్కడ బీటెక్ రవి పోటీచేస్తారని చంద్రబాబు స్పష్టం చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బీటెక్ రవి పులివెందుల ఇన్ఛార్జిగానూ కొనసాగుతున్నారు.
*ఉగాదికి ఇస్తామన్న ఇళ్లు ఏమయ్యాయి?: టీడీపీ
‘‘ఈ ఏడాది ఉగాది నాటికి రాష్ట్రంలో పేదలకు మూడున్నర లక్షల ఇళ్లు నిర్మించి, ప్రారంభిస్తామని జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ ఏమైంది? కొత్తగా ఇళ్లు కట్టడం చేతగాకపోయినా గత ప్రభుత్వాలు కట్టినఇళ్లకు ఓటీఎస్ పేరుతో డబ్బులు వసూలు చేయడం దారుణం’’ అని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ఆ పార్టీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2019-20 సంవత్సరంలో ఐదు ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. 2020-21 సంవత్సరంలో ఒక్కటి కూడా కట్టలేదని అన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రూ.4,500 కోట్లు మింగేశారన్నారు.
‘
*హామీలు నెరవేర్చమంటే అరెస్టులా..!: లోకేశ్
‘‘ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్రెడ్డి ఎన్నో హామీలిచ్చారు. నేడు ప్రభుత్వంలోకి వచ్చాక ఆ హామీలు నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు శాంతియుతంగా ఉద్యమిస్తే పోలీసుల్ని ప్రయోగించి నిర్దాక్షిణ్యంగా అణచివేయడం నిరంకుశత్వం’’ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. నిన్న అంగన్వాడీ, నేడు ఆశావర్కర్లని అరెస్టు చేయడం గర్హనీయమంటూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.