ఫిట్నెస్ అంటే ప్రాణం పెట్టే రకుల్ తాను చేసే వర్కవుట్లూ , తీసుకునే ఆహారానికి సంబంధించిన ఫొటోలూ , వివరాలను ఎప్పటికప్పుడు ఇన్స్టాలో పోస్ట్ చేయడం మామూలే . కానీ అక్కడితోనే ఆగిపోకుండా … తన పేరుతో యూట్యూబ్ ఛానల్నీ అందుబాటులోకి తెచ్చింది రకుల్ ప్రీత్సింగ్ . తన ఛానల్ ద్వారా బోలెడు సరదా విషయాలను తెలుసుకోవచ్చనే ఈ నటి … ఇందులో ఎక్కువగా ఆహారం , అందం , వ్యాయామం , స్నేహితులూ , పోషకాల వంటలకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తోంది . దీన్ని సరదాగా ప్రారంభించాననీ … తీరిక దొరికినప్పుడల్లా వీడియోలు పోస్ట్ చేస్తుంటాననీ చెప్పే రకుల్ … ఈ ఛానల్ దా ద్వా వచ్చే ఆదాయాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి అందిస్తానని అంటోంది . ప్రస్తుతం ఈ ఛానల్కు రెండు లక్షలా నలభై వేలమందికి పైగా సబ్సైబర్లు ఉండటం విశేషం .