DailyDose

నరేష్ .. మూడు పెళ్ళిళ్ళ వెనుక కథ

నరేష్ .. మూడు పెళ్ళిళ్ళ వెనుక కథ

సీనియర్ యాక్టర్‌ నరేష్‌.. గత కొన్ని రోజులుగా ఏదో వివాదంలో ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. తాజాగా ఆయన మాజీ భార్య కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. నటుడి మాజీ భార్య రమ్య రఘుపతి.. నరేష్‌, ఆయన తల్లి విజయ నిర్మల పేరు చెప్పి పలువురి దగ్గర భారీగా వసూళ్లకు పాల్పడింది. ఆమె మీద గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ లో కొందరు మహిళలు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివాదంపై నరేష్‌ స్పందిస్తూ.. రమ్యకు, తనకు ఎలాంటి సబంధం లేదని స్పష్టం చేశారు. ఆమెతో 9 ఏళ్ల క్రితమే వివాహం జరగ్గా.. 5 ఏళ్ల క్రితం విడిపోయానని.. ఒకే క్యాంపస్‌ లో ఉన్న తమ మధ్య ఎలాంటి సబంధం లేదని చెప్పారు. ఈ క్రమంలో మరోసారి నరేష్‌ వివాహ జీవితం గురించి జనాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆ వివరాలు..

*విజయ క్రిష్ణ నరేష్.. సీనియర్ నటి విజయ నిర్మల కుమారుడు. అనేక ఏళ్లుగా తెలుగు చిత్రాలలో కమెడియన్ గా, హీరోగా, సహాయనటుడిగా అనేక పాత్రల్లో మెప్పించాడు.. మెప్పిస్తున్నాడు కూడాను. బాలనటుడిగా 1972లో పండంటి కాపురం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు నరేష్. 1982 లో తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో ప్రేమ సంకెళ్ళు చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. ప్రస్తుతానికి సహాయ పాత్రలను పోషిస్తున్నాడు. ప్రతినాయక పాత్రలను కూడా పోషించనున్నట్లు తన అభిప్రాయాన్ని ఈ మధ్యనే వెల్లడించారు. 2019 మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడైన శివాజీ రాజా మీద 69 ఓట్ల ఆధిక్యంతో గెలిచి అధ్యక్ష పదవిని చేపట్టాడు.Actornareshవిజయ క్రిష్ణ నరేష్ కి ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదట్లో విజయనిర్మల ఓ సంబంధాన్ని చూసి పెళ్లి చేసింది. సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత మనస్ఫర్ధల కారణంగా విడిపోయారు. తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండో పెళ్ళి చేసుకున్నారు. వీరు కూడా మనస్ఫర్ధల కారణంగానే విడిపోయారు. 50 ఏళ్ళ వయస్సులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు అయిన రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కొడుకులు.

కొన్నేళ్ల క్రితం నరేష్, రమ్య రఘుపతి కూడా మనస్పర్థల కారణంగా విడిపోయారని సమాచారం. అధికారికంగా వాళ్లు భార్యాభర్తలు అయినప్పటికీ.. విడాకులయ్యాయని.. నరేష్‌ వాళ్లకి మెయింటెనెన్స్ కూడా చెల్లిస్తున్నాడనీ కొంత కాలంగా వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా రమ్య రఘుపతి చేసిన పని కారణంగా.. నరేష్‌ మూడోసారి కూడా విడాకులు తీసుకున్నాడని తెలిసింది. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.. అయన పేరు, అత్తగారైన విజయ నిర్మల గారి పేరు చెప్పి పలువురి దగ్గర డబ్బు తీసుకుందని.. తిరిగి చెల్లించట్లేదని ఐదుగురు మహిళలు గచ్చిబౌలి పీఎస్ లో ఫిర్యాదుచేశారు. రమ్య హైదరాబాద్ తో పాటు అనంతపూర్, హిందూపూర్ లో కూడా పలువురి నుంచి భారీగా వసూళ్లు చేపట్టినట్లు తెలిసింది.