DailyDose

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం – TNI కధనాలు

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం – TNI   కధనాలు

ప్రారంభమైన యుద్ధం…
యుద్ధ విమానాలతో బాంబుల వర్షం, ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆందోళన.. ఉక్రెయిన్ లోకి చొచ్చుకు వెళ్లిన రష్యా. మొత్తం ఉక్రెయిన్ లోని ఆరు ప్రధాన పట్టణాల పై రష్యా బాంబుల వర్షం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై యుద్ధ ప్రభావం.. దాడిని మొదలుపెట్టిన ఉక్రెయిన్ బాంబులతో దద్దరిల్లుతున్న ప్రధాన నగరాలు, ఎయిర్ బేస్ లో మూసివేసిన ఉక్రెయిన్.ఉక్రెయిన్ పై గత నాలుగు గంటల గా బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా, దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ ప్రాంతాలు….
4-42
1. రష్యాపై ఉక్రెయిన్‌ తిరుగుబాటు.. 300 మంది పౌరులు మృతి
రష్యా దాడిలో ఉక్రెయిన్‌లో 18 చోట్ల ఇప్పటికే 300 మంది పౌరులు మరణించారు. 23 ప్రాంతాల్లో రష్యా బాలిస్టిక్‌ మిస్సైల్‌ ఎటాక్‌ జరుపుతోంది. రష్యా దాడులతో అప్రమత్తమైన ఉక్రెయిన్‌ ఎదురుదాడి ప్రారంభించింది. రష్యాకు ధీటుగా భారీగా బలగాలను మోహరించి కీలక ప్రాంతాల్లో తిరుగుబాటు మొదలు పెట్టింది. రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్‌ ప్రభుత్వం మార్షల్‌ లా విధించింది. పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని ఉక్రెయిన్‌ ఆదేశించింది. ఉక్రె యిన్‌ను ప్రపంచ దేశాలు అడ్డుకోవాలని కోరింది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో శుక్రవారం జీ-7 దేశాలతో జో బైడెన్‌ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. నాటో కూటమికి సహకరిస్తామని తెలిపారు. రష్యా దాడులపై ఉక్రెయిన్‌ స్పందించింది.

02242022160010n47
2. కీవ్ గగనతలంలో రష్యా యుద్ధవిమానాలు
ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. కీవ్ గగనతలంపై రష్యా యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. యుద్ధసైరన్లు మోగుతున్నాయి. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు చేశారు. భయంగుప్పెట్లో కీవ్ ప్రజలు గడుపుతున్నారు. కీవ్ విమానాశ్రయాన్ని రష్యా సైనికులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కీవ్, ఖర్కీవ్, తూర్పు దొనెట్స్ ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం – TNI   కధనాలు
3. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోండి..
ఉక్రెయిన్ లోని భారతీయులకు భారత రాయబార కార్యాలయం ముఖ్య సూచనలు
ప్రపంచవ్యాప్తంగా అందరినీ యుద్ధ భయం వెంటాడుతోంది. అమెరికా(America) హెచ్చరికలను రష్యా(Russia) లెక్కచేయలేదు. నాటో దేశాల అభ్యంతరాలను పట్టించుకోలేదు. ఉక్రెయిన్‌(Ukraine)పై యుద్ధంతో.. దేనికైనా సిద్ధమంటూ తెగింపు ధోరణి ప్రదర్శిస్తోంది. ఉక్రెయిన్‌లో సైనిక స్థావరాలు లక్ష్యంగా మిస్సైల్స్‌ దూసుకెళ్తున్నాయి. ఎయిర్‌పోర్టులు రష్యా వశమవుతున్నాయి. తనకున్న ఆయుధసంపత్తితోనే ఉక్రెయిన్‌ ప్రతిఘటనకు దిగింది. రష్యాదాడిలో ఉక్రెయిన్‌ సైనికులతో పాటు సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతోమంది ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లేందుకు పరుగులు పెడుతున్నారు. నాటోపై ఒత్తిడి పెరుగుతోంది. ఉక్రెయిన్‌ ఐక్యరాజ్యసమితి జోక్యం కోరుతోంది.
*రష్యాపై యుద్ధం ఆలోచన లేదంటూనే అమెరికా సమర సన్నాహాల్లో ఉంది. బ్రిటన్‌నుంచి అమెరికా బాంబర్లు గాల్లోకి ఎగిరాయి. నాటో దళాలకు సహకరిస్తామని అగ్రరాజ్యం ప్రకటించింది. రష్యాపై ప్రతిదాడికి నాటోదళాలు సిద్ధమవుతుండటంతో యుద్ధం యూరప్‌కే పరిమితమయ్యేలా కనిపించడంలేదు. రష్యా దూకుడు ప్రపంచయుద్ధానికి దారితీసేలా ఉంది. ఉక్రెయిన్‌పై తమ దాడిని అడ్డుకునేందుకు ఎవరూ సాహసించొద్దని రష్యా హెచ్చరిస్తోంది. తనదాడిని పుతిన్‌ సమర్ధించుకుంటున్నారు.
*రష్యా ఎయిర్‌స్ట్రిప్‌ టెక్నాలజీ వ్యవస్థని ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించుకుంది. ఉక్రెయిన్‌ పార్లమెంట్‌, బ్యాంకులు, ఐటీపై సైబర్‌ దాడులకు తెగబడింది. ఉక్రెయిన్‌ పవర్‌గ్రిడ్‌ సర్వర్లపైనా రష్యా సైబర్‌ ఎటాక్‌ జరిగిందని సమాచారం అందుతోంది. ఎయిర్‌పోర్టులను స్వాధీనం చేసుకుంటున్న రష్యా ఉక్రెయిన్‌ పోర్టుసిటీపై కూడా బాంబుల వర్షం కురిపించింది. సైనికస్థావరాలు, కీలకవ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామంటోంది రష్యా. ఉక్రెయిన్‌ని స్వాధీనం చేసుకునే ఆలోచన లేదంటూనే దాడులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
*రష్యాకి బెలారస్‌ తోడవ్వటంతో ముప్పేటదాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్‌ నాటో దేశాలు కలిసొస్తాయనే నమ్మకంతో ఉంది. అందుకే రష్యా ఆయుధసంపత్తిని ఎదుర్కునే శక్తి లేకపోయినా గట్టిగానే ప్రతిఘటిస్తోంది. ఐదు రష్యా యుద్ధ విమానాలతో పాటు హెలికాప్టర్‌ని కూల్చినట్లు ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. రష్యాదాడిలో 300మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. కైవ్‌లోని బ్రోవరీలో ఒకరు మరణించారని, ఒకరు గాయపడ్డారని ఉక్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకవైపు జనంలో ఆందోళన మొదలైంది. భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏటీఎంల వద్ద జనం బారులు తీరుతున్నారు. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు సూపర్ మార్కెట్లకు పరుగులు తీస్తున్నారు.
*రష్యా తమ మాటను లెక్కచేయకపోవటంతో నాటో దేశాలు కూడా ఉక్రెయిన్‌పై దాడిని సీరియస్‌గా తీసుకున్నాయి. రేపు జీ సెవెన్‌ దేశాల అత్యవసర సమావేశానికి అమెరికా పిలుపునిచ్చింది. ఉక్రెయిన్‌పై యుద్ధం వద్దని రష్యాకి ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తిచేసింది. మరోవైపు, ఉక్రెయిన్‌పై దాడిని పూర్తిగా సమర్ధించుకున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌. ఇప్పటికైనా ఉక్రెయిన్‌ సైన్యం లొంగిపోతే మంచివదని సలహా ఇచ్చారు. నాటో బలగాలు ఉక్రెయిన్‌కు మద్దతిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

Whats-App-Image-2022-02-24-at-16-13-25
4. ఇది ఉక్రెయిన్‌పై దాడి కాదు, మమ్మల్ని మేం కాపాడుకోవడమే : రష్యా
ప్రస్తుత పరిణామాలు ఉక్రెయిన్‌పై కానీ, ఉక్రెయిన్ ప్రజలపై కానీ దాడి చేయాలనే కోరికకు సంబంధించినవి కాదని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్‌ను నిర్బంధించినవారు దానిని తమ దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల నుంచి రష్యాను కాపాడుకోవడానికి సంబంధించనవే ఈ పరిణామాలని తెలిపారు. యూనియన్ ఆఫ్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ (USSR) ఏర్పడినపుడు కానీ, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కానీ, నేడు ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న ప్రాంతాల్లో జీవిస్తున్న ప్రజలు ఏ విధంగా తమ జీవితాలను నిర్మించుకోవాలనుకుంటున్నారో వారిని అడగలేదన్నారు. నేడు ఉక్రెయిన్‌లో జీవిస్తున్న ప్రజలు, ఈ పని చేయాలని కోరుకునే ఎవరైనా, స్వేచ్ఛాయుతంగా ఎంపిక చేసుకునే హక్కును తప్పనిసరిగా వినియోగించుకోగలగాలని చెప్పారు. ఉక్రెయిన్‌పై గురువారం ఉదయం రష్యా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను, విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

5. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
..రష్యా భవిష్యత్తు కోసం యుద్ధం తప్పలేదని వివరించిన అధ్యక్షుడు..ఇతర దేశాలు జోక్యం చేసుకోరదని హెచ్చరించిన రష్యా ఐరోపా దేశాలు,అమెరికా మరికొన్ని దేశాలు ఉక్రెయిన్ కి మద్దత్తుగా మాట్లాడుతున్నాయి…చూడాలి ఈ యుద్ధం రెండు దేశాలు మధ్య ముగుస్తుందా లేకా ప్రపంచ దేశాలు మధ్య యుద్ధంగా మారి మూడో ప్రపంచ యుద్దానికి దారి తీస్తుందా….
ఈ యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచ వ్యాప్తంగా కొన్ని రోజులుగా నష్టపోతున్న స్టాక్ మార్కెట్లు ఈ రోజు యుద్ధం మొదలవడంతో మరింత నష్టాల్లో కూరుకు పోయి ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉంది ..ఇప్పటికే భారత్ లో స్టాక్ మార్కెట్ లు కుప్పకూలిపోయాయి
02242022090548n32
6. ఉక్రెయిన్‌లో సిక్కోలు వాసులు ఉక్రెయిన్‌ దేశంలో సిక్కోలు విద్యార్థులు చిక్కుకున్నారు. శ్రీకాకుళం జి ల్లాలోని వీరఘట్టాం మండలం కంబరివలస గ్రామానికి చెందిన కుమారస్వామి, వంశీకృష్ణ బోకోవిన్ యూనివర్సిటీలో చదువుతున్నారు. ఉక్రెయిన్‌ పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండడంతో విద్యార్థుల కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అయితే తాము క్షేమంగానే ఉన్నామని తల్లిదండ్రులకు విద్యార్థులు వీడియో సందేశం పంపారు. తమ వారిని క్షేమంగా ఇండియాకు రప్పించాలని ఎంపీ రామ్మోహన్‌నాయుడుకి వినతి చేశారు.

7. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభం: యుద్ధంపై భారత్‌ రియాక్షన్‌ ఇది
ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిలిటరీ ఆపరేషన్‌ అని పుతిన్‌ ప్రకటించినప్పటికీ.. అది యుద్ధంగానే ప్రపంచం భావిస్తోంది. ఇరు దేశాల పోటాపోటీ ప్రకటనలతో గందరగోళం నెలకొంది. ఆస్తి, ప్రాణ నష్టం ఇప్పుడప్పుడే ఒక అంచనాకి వచ్చే పరిస్థితులు ఎలాగూ లేవు. కనీసం వీలైనంత త్వరగా నష్టనివారణ చర్యలు చేపట్టాలని పాశ్చాత్య దేశాలపై అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. యుద్ధంపై భారత్‌ తన స్పందన వెల్లడించింది. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభంలో భారత్‌ తటస్థ పాత్ర పోషిస్తుందని భారత్‌ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ(స్టేట్‌) మంత్రి రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌ మీడియాతో గురువారం మాట్లాడారు. Ukraine-Russian Crisis పై స్పందించిన రాజన్‌ సింగ్‌.. మా(భారత్‌) స్టాండ్‌ తటస్థం. శాంతియుత పరిష్కారాన్ని మేం ఆశిస్తున్నాం అంటూ వ్యాఖ్యానించారాయన. త్వరలోనే పరిస్థితి సర్దుమణుగుతుందని అనుకుంటున్నాం. అవసరమైతేనే భారత్‌ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలనుకుంటోంది. అప్పటిదాకా తటస్థంగానే ఉంటాం. ఒకవేళ కోరితే.. చర్చలకు వీలైన రీతిలో సాయం అందిస్తామ’ని చెప్పారాయన.ఇదిలా ఉంటే స్పెషల్‌ ఫ్లైట్‌ ద్వారా భారతీయులను(విద్యార్థులతో సహా) కొందరు ఇవాళ ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం నుంచి ఉక్రెయిన్‌ను తూర్పు, ఉత్తరం, దక్షిణ వైపు నుంచి రష్యా బలగాలు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో భయాందోళనల నడుమ ప్రజలు పశ్చిమానికి తరలిపోతున్నారు. మరోవైపు భారతీయులను సైతం పడమర వైపునే తరలించే ప్రయత్నాలు సాగుతున్నాయి. భారత్‌-ఉక్రెయిన్‌ నడుమ ఫిబ్రవరి 22, 24, 26 తేదీల్లో ఎయిర్‌ ఇండియా మూడు ఫ్లైట్లను నడిపించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

8. ఉక్రెయిన్‌ విలవిల: మోదీజీ… జోక్యం చేసుకోండి ప్లీజ్‌!
ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు భీకరంగా దాడులు చేస్తున్నాయి. బాంబుల మోత మోగిస్తున్నాయి. రష్యా చర్యలను పలు దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో భారత్‌లోని ఉక్రెయిన్‌ రాయబారి డా. ఇగోర్‌ పొలిఖా భారత్‌ మద్దతు కోరారు. భారత్‌ రష్యాతో ప్రత్యేకమైన స్నేహం కలిగి ఉందని, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని భారత్‌ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.మిత్రదేశమైన భారత్‌.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను నిలువరించడానికి సాయం చేయగలదని పేర్కొన్నారు. వెంటనే భారత్‌దేశ ప్రధాని నరేం‍ద్ర మోదీ.. రష్యా, ఉక్రెయిన్‌ దేశాధినేతలతో మాట్లాడాలని కోరారు. ప్రపంచంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఎవరి మాట వింటారో? లేదో? తెలియదు కానీ, ప్రధానిమోదీ మాటలను ఆలోచిస్తారని తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు రష్యాది సైనిక చర్య కాదు.. యుద్ధమే అని భారత్‌లోని ఉక్రెయిన్‌ రాయబారి డా. ఇగోర్‌ పొలిఖా అన్నారు. రష్యా దాడుల్లో భారీగా ఉక్రెయిన్‌ ప్రజలు మృతి చెందారని తెలిపారు. యుద్ధ పరిణామాలను భారత్‌ నిశితంగా గమనిస్తోందని చెప్పారు. యుద్ధ సంక్షోభ వేళ భారత్‌ అండగా నిలవాలని కోరుకుంటున్నామని కోరారు. పరిస్థితులు క్షీణిస్తున్నందున ఉక్రెయిన్‌కు భారత్‌ మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. నాటో, ఈయూ సభ్యత్వం గురించి మాట్లాడలేనని పేర్కొన్నారు

Whats-App-Image-2022-02-24-at-16-24-57
9. ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు క్షేమం: మంత్రి ఆదిమూలపు
ఉక్రెయిన్‌ దేశంలో తెలుగు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని ఏపీ మంత్రి ఆదిమూలాపు సురేష్‌ తెలిపారు. రష్యా, ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న యుద్ధ సమయంలో మంత్రి ఆదిమూలాపు సురేష్‌ ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు విద్యార్థులతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు

10. ఉక్రెయిన్ సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి లో భారత్ ఆందోళన..
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఏర్పడిన సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది.ఉక్రెయిన్‌లో సుమారు 20 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని, వారిని సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC)కి భారత దేశ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి తెలిపారు..విద్యార్థులు, ఇతర భారతీయులను తిరిగి భారత దేశానికి తీసుకెళ్ళేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని UNSCకి చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని భారత్ కోరుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితిని సరైన రీతిలో, చాలా జాగ్రత్తగా పరిష్కరించకపోతే, భారీ సంక్షోభంగా మారే ప్రమాదం ఉందన్నారు. భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందని తెలిపారు. అన్ని వర్గాల భద్రతను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

11. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
రష్యా భవిష్యత్తు కోసం యుద్ధం తప్పలేదని వివరించిన అధ్యక్షుడు..ఇతర దేశాలు జోక్యం చేసుకోరదని హెచ్చరించిన రష్యా ఐరోపా దేశాలు,అమెరికా మరికొన్ని దేశాలు ఉక్రెయిన్ కి మద్దత్తుగా మాట్లాడుతున్నాయి…చూడాలి ఈ యుద్ధం రెండు దేశాలు మధ్య ముగుస్తుందా లేకా ప్రపంచ దేశాలు మధ్య యుద్ధంగా మారి మూడో ప్రపంచ యుద్దానికి దారి తీస్తుందా….ఈ యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచ వ్యాప్తంగా కొన్ని రోజులుగా నష్టపోతున్న స్టాక్ మార్కెట్లు ఈ రోజు యుద్ధం మొదలవడంతో మరింత నష్టాల్లో కూరుకు పోయి ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉంది ..ఇప్పటికే భారత్ లో స్టాక్ మార్కెట్ లు కుప్పకూలిపోయాయి

12. ఉక్రెయిన్ లోని తెలుగు వారి కోసం ఇద్ద‌రు అధికారుల‌ను నియ‌మించిన ఏపీ ప్ర‌భుత్వం
నోడ‌ల్ అధికారిగా ర‌విశంక‌ర్‌, ప్ర‌త్యేకాధికారిగా గీతేశ్ శ‌ర్మ‌
ఇద్ద‌రు అధికారుల ఫోన్ నెంబ‌ర్లు కూడా వెల్ల‌డి
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల‌కు స‌హ‌కార‌మే వీరి బాధ్య‌త‌
ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడుల నేప‌థ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇత‌ర దేశాల పౌరుల కోసం ఆయా దేశాల విదేశాంగ కార్యాల‌యాలు చ‌ర్య‌లు మొద‌లుపెట్టాయి. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భార‌తీయుల కోసం భార‌త విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఇప్ప‌టికే రంగంలోకి దిగిపోయారు. ఇక ఆ దేశంలో చిక్కుకున్న ఏపీ పౌరుల‌ను సుర‌క్షితంగా ర‌ప్పించాల‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ కేంద్రానికి లేఖ రాయ‌గా.. తెలంగాణ పౌరుల కోసం బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కూడా కేంద్రానికి లేఖ రాశారు.తాజాగా ఏపీ ప్రభుత్వం మ‌రో అడుగు ముందుకేసింది. ఉక్రెయిన్‌లో చిక్కుబ‌డిపోయిన తెలుగు విద్యార్థులకు స‌హ‌కారం అందించేందుకు ఏకంగా ఇద్ద‌రు అధికారుల‌ను నియ‌మించింది. వీరిలో నోడ‌ల్ అధికారిగా నియ‌మించిన ర‌విశంక‌ర్‌ను 9871999055 నెంబ‌రులోను, ప్ర‌త్యేక అధికారిగా నియ‌మితులైన గీతేశ్ శ‌ర్మ (రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి)ని 7531904820 నెంబ‌రులోను సంప్ర‌దించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం తెలిపింది.
02242022095103n90