DailyDose

ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్ధులకు తోడ్పాటు – TNI తాజా వార్తలు 24/02/2022

ఉక్రెయిన్ లో తెలుగు విద్యార్ధులకు తోడ్పాటు –  TNI తాజా వార్తలు 24/02/2022

* ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సహకారం అందించటానికి ఇద్దరు అధికారులను నియమించిన ఏపీ ప్రభుత్వం. నోడల్ అధికారిగా రవి శంకర్ 9871999055. ఏపీ భవన్. అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్‌ గీతేష్ శర్మ. సంప్రదించాల్సిన నెంబర్ : 7531904820

* ఉక్రెయిన్ సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి లో భారత్ ఆందోళన..ఐక్యరాజ్య సమితి :
రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఏర్పడిన సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది.ఉక్రెయిన్‌లో సుమారు 20 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని, వారిని సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC)కి భారత దేశ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి తెలిపారు. విద్యార్థులు, ఇతర భారతీయులను తిరిగి భారత దేశానికి తీసుకెళ్ళేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని UNSCకి చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని భారత్ కోరుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితిని సరైన రీతిలో, చాలా జాగ్రత్తగా పరిష్కరించకపోతే, భారీ సంక్షోభంగా మారే ప్రమాదం ఉందన్నారు. భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందని తెలిపారు. అన్ని వర్గాల భద్రతను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

* మమ్మల్ని వెంటనే ఆంధ్రాకు రప్పించే ఏర్పాట్లు చేయండి. రష్యా లో తెలుగు వారి ఆవేదన. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాలతో అక్కడి తెలుగువారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉక్రెయిన్ లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు… ఇక్కడి విమానాశ్రయాలు రైల్వే స్టేషన్ లు పూర్తిగా మూతపడ్డాయని తమను వెంటనే ఆర్మీ ఏలికాప్టర్ల ద్వారా స్వదేశానికి తీసుకెళ్లాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. క్షణక్షణం తాము ప్రాణభయంతో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి, తాగడానికి కూడా తమకు ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు

* ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి దామోదర్‌ గౌతమ్‌ సవాంగ్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ బందర్‌రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో గౌతమ్‌ సవాంగ్‌ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది గౌతమ్‌ సవాంగ్‌కు అభినందనలు తెలిపారు.

* రాజ్నాథ్ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారత పౌరులు, విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భారత్ ఎప్పుడు శాంతిని కోరుకుంటుందని, ఎలాంటి పరిస్థితులు యుద్ధానికి దారితీయకూడదన్నారు

* ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిని కొనసాగించాలంటూ అమరావతిలోని వెలగపూడిలో రైతులు 24 గంటల పాటు చేపట్టనున్న నిరాహార దీక్షను ఈరోజు ప్రారంభించారు. అమరావతి రాజధాని సాధన ఐక్యకార్యచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రైతులు, విపక్ష సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, లంకా దినకర్‌, సీపీఐ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరావు సంఘీభావం ప్రకటించారు

* హృద్రోగ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న ఓ క‌శ్మీరీ మ‌హిళ‌కు బ్రెయిన్‌డెడ్‌తో గురైన చెన్నై యువ‌కుడి గుండెను అమ‌ర్చి ప్రాణం పోశారు వైద్యులు. ప్ర‌స్తుతం ఆ మ‌హిళ పూర్తిగా కోలుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 26వ తేదీన ఆమెకు వైద్యులు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.

* దేశంలోనే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా లైఫ్ సైన్సెస్ రంగంలో హైద‌రాబాద్ కీల‌కపాత్ర పోషిస్తుంద‌ని చెప్ప‌డానికి గ‌ర్విస్తున్నాను అని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధిలో బ‌యో ఆసియా స‌ద‌స్సు క్రియాశీల‌క పాత్ర పోషిస్తుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. రెండు రోజుల పాటు వ‌ర్చువ‌ల్‌గా జ‌ర‌గ‌నున్న 19వ ఎడిష‌న్ బ‌యో ఆసియా స‌ద‌స్సును మంత్రి కేటీఆర్ గురువారం ఉద‌యం ప్రారంభించారు. లైఫ్ సైన్సెస్ – ఆరోగ్య రంగంలో కొవిడ్ స‌వాళ్ల‌పై చ‌ర్చించారు.

* సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ భూతం మటుమాయం అయిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు.

* కరీంనగర్‌ రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని 23 వ డివిజన్ సుభాష్ నగర్‌లో రూ. 25 లక్షల నిధులతో పోచమ్మ ఆలయ కాంపౌండ్ వాల్, బోరు నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. మొదటగా పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

* పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నటించిన భీమ్లా నాయక్‌ సినిమా శుక్రవారం విడుదల కానుండడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఏపీలో నిరసనలు తెలియజేస్తున్నారు. పవన్‌ అభిమానులు తిరుపతిలో గాంధీ విగ్రహం కూడలి వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వ ఆంక్షలు సరికాదంటూ నినాదాలు చేశారు. ఏపీ సీఎం జగన్‌ కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు

* మధ్యప్రదేశ్లోని ఇండోర్లో గురువారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. నగరంలో భయంతో జనం పరుగులు తీయడం కనపించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.5గా నమోదైంది. గురువారం ఉదయం 4.53 గంటలకు భూప్రకంపనలు వచ్చినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం (ఎన్‌సీఎస్‌) ప్రకటించింది.

* వైసీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు ఇకనైనా మానుకోవాలనే తాను గౌతమ్ రెడ్డి మరణంపై స్పందించినట్లు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ‘‘భూమా నాగిరెడ్డి చనిపోయినప్పుడు వైసీపీ నేతలు చేసింది శవ రాజకీయం. కోడెల చావుకు చంద్రబాబు కారణమని శవరాజకీయం చేసింది కొడాలినాని కాదా. వివేకా హత్యను చంద్రబాబుకు అంటగడుతూ శవరాజకీయం చేసింది ఎవరు?. కోడికత్తి కేసు అడ్డంపెట్టుకుని చేసింది శవరాజకీయం కాదా. శవ రాజకీయాల అలవాటు వైసీపీదని తెలిపే ఉద్దేశం తప్ప ఆ పార్టీ నేతల్ని అనుసరించేతత్వం నాది కాదు. నాకు ఫోన్ చేసి ఎన్నో రకాలుగా బెదిరిస్తున్నారు. వేటికీ భయపడను’’ అని బండారు సత్యనారాయణ స్పష్టం చేశారు.

* రష్యా జరిపిన దాడుల్లో దాదాపు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని, తొమ్మిది మంది గాయపడ్డారని ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై గురువారం సైనిక చర్యను ప్రకటించిన తర్వాత పరిణామాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. రాజధాని నగరం కీవ్‌లోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లు జరిగాయి, ఎయిర్ సైరన్ల మోత మోగిపోతోంది.

* ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఉద్యమం గురువారం నాటికి 800వ రోజుకు చేరింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వెలగపూడిలో సామూహిక నిరాహారదీక్షలను అమరావతి రైతులు, మహిళలు ప్రారంభించారు. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ వామపక్షాల నాయకులు రైతులతో దీక్షలు ప్రారంభింపచేశారు. ఈ దీక్షలు శుక్రవారం ఉదయం వరకు జరగనున్నాయి

*మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలకు వెళ్లే భక్తుల వద్ద నుంచి ఆర్టీసీ పాత టికెట్‌ ధరలే వసూలు చేస్తుందని, ధరల్లో ఎలాంటి మార్పులూ చేయడం లేదని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ద్వారకా తిరుమలరావు చెప్పారు. రెండేళ్లుగా డీజిల్‌ రేట్లు విపరీతంగా పెరిగినా.. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ వద్ద జరిగే తిరునాళ్లకు ఆర్టీసీ సంస్థ చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం ఆయన నరసరావుపేటకు వచ్చారు.

*జీఎన్ఎం, మిడ్ వైఫరీ కోర్సులో ప్రవేశం కోసం మార్చి 8 వరకు ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చని ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది.

*7218 వాలంటీర్ల నియామకాలకు త్వరలో నోటిఫికేషన్ ఏపీ గ్రామ, వార్డు వాలంటీర్ల ఖాళీలను భర్తీ చేయడానికి ఇకపై నెలలో రెండు సార్లు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇప్పటికి 7218 ఖాళీలు గుర్తించిన అధికారులు మార్చి 1న నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ ప్రక్రియ చేపడతారు. జిల్లా యూనిట్ గా రిజర్వేషన్ నిర్ణయిస్తారు.

*ప్రకాశంజిల్లా…SEB CI M.సుకన్య సస్పెండ్. సింగరాయకొండ SEB CI M.సుకన్య ఉలవపాడు మండలం ఆత్మకూరు లో గుట్కా అమ్ముతున్న వ్యక్తి నుంచి కార్యాలయంలో పనిచేస్తున్నా కంప్యూటర్ అపరేటర్ కు ఫోన్ పే ద్వారా 10 వేల రూపాయలు చేయించారు. ఈ విషయం ఉన్నతాధికారులు కి పిర్యాదు అందటంతో సిబ్బంది ని విచారణ జరిపి నిన్న రాత్రి సస్పెండ్ చేయడం జరిగింది.

*కడప ఎయిర్పోర్ట్ నుంచి విమాన రాకపోకలు పునరుద్ధరణ..మార్చి 27 నుంచి సేవలు ప్రారంభం..తొలిసారిగా విశాఖపట్నానికి సర్వీసులు ప్రారంభం..తొమ్మిది నెలల తర్వాత విమాన రాకపోకల పునరుద్ధరణ…ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ శివ ప్రసాద్ వెల్లడి…

*పర్యాటకప్రియులను అలరించేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రత్యేక తీర్థయాత్ర రైళ్లను నడుపుతున్నది. కరోనా ప్రభావం క్షీణించడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే పర్యటనపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మార్చి నెలలో రాజమండి, సామర్లకోట జంక్షన్, తుని, విశాఖపట్నం మీదుగా ఉత్తర భారత యాత్ర నిర్వహించేందుకు రైల్వే శాఖ సర్వం సిద్ధం చేసింది.

*ఏపీ ప్రణాళికా విభాగంలో కలెక్టర్ల సమావేశం నేడు జరిగింది. జిల్లాల పునర్విభజన అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిధార్ధ జైన్, జడ్పీ సీఈఓలు, ఇతర అధికారులు సైతం పాల్గొన్నారు. జిల్లాల పునర్విభజనపై కలెక్టర్ల నుంచి.. సూచనలు, సలహాలను ప్రణాళికా విభాగం తీసుకోనుంది.

*ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎన్నారై కోటాలో పీజీ కోర్సు(2021-22)ల్లో మిగులు సీట్ల భర్తీకి ఈనెల 28 చివరి గడువుగా నిర్ణయించినట్లు రిజిస్ర్టార్ గిరిధర కృష్ణ తెలిపారు. ఆరోజు సాయంత్రం 4గంటల్లోపు రిజిస్ర్టార్, ఏఎన్జీఆర్ఏయూ, లాం, గుంటూరు కార్యాలయానికి దరఖాస్తులు అందాలని సూచించారు.

*రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని, విభజన హామీలు అమలుచేస్తారని ఏడేళ్లుగా ఎదురుచూస్తుంటే, బడ్జెట్లో కనీస నిధులు కూడా కేటాయించకుండా అన్యాయం చేసిందని వామపక్షాలు ధ్వజమెత్తాయి. ‘కేంద్ర బడ్జెట్లో ఏపీకి మరోసారి దగా’ అంశంపై విశాఖ పౌర గ్రంథాలయంలో మంగళవారం అన్ని పార్టీలతో జరిగిన సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడారు.

*నిర్వహణ పనుల కారణంగా రద్దు చేసిన రెండు రైళ్లను యథావిధిగా నడపనున్నట్టు, రద్దు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్- తిరువనంతపురం(నెంబర్: 17230) రైలును మార్చి 5 నుంచి 16 వరకు, 18 నుంచి 21 వరకు యథావిధిగా నడపనున్నారు. తిరువనంతపురం- సికింద్రాబాద్(నెంబర్: 17229) రైలును మార్చి 19 నుంచి 22 వరకు యథావిధిగా నడపనున్నారు

*పెగాసస్ నిఘా వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 25న విచారణ జరపనుంది. నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికను బుధవారమే పరిశీలించాల్సి ఉంది. అయితే అదేరోజు మనీల్యాండరింగ్ కేసు విచారణ ఉన్నందున.. ఆ కేసు విచారణ వాయిదా వేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు. కాగా.. పెగాసస్ నిఘా వ్యవహారంపై విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టులో 12 ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. మరోవైపు.. పెగాసె్సని హ్యాకింగ్కి పోలీసులువాడలేదని ఇజ్రాయెల్ న్యాయశాఖ తెలిపింది.

*వేటు తప్పదన్న కారణంతో బీజేపీ అసమ్మతి నేతలు అలెర్ట్ అయ్యారు. బండి సంజయ్, తరణ్ చుగ్కి బీజేపీ నేతలు వివరణ ఇస్తున్నారు. సమావేశ ఎజెండా చెప్పకుండా తమను కొందరు ఆహ్వానించారని వివరించారు. నిన్న హైదరాబాద్లో భేటీకి హాజరు కాలేదంటూ చింతా సాంబమూర్తి, కంకణాల శ్రీధర్రెడ్డి, పాపారావు, నాగూరావు నామోజీతో పాటు కొందరు వివరణ ఇచ్చారు. రేపటిలోగా వివరణ ఇవ్వని వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. అసమ్మతి భేటీకి కారకులైన గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగణాకరరావులపై వేటు తప్పదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.