* గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఫర్టిలైజర్ వ్యాపారి రైతులను మోసం చేసి ముప్పై కోట్లకు కుచ్చు టోపీ పెట్టి ఐపీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రైతుల రాస్తారోకో.
* గుంటూరు నగరంలో బ్రౌన్ షుగర్ కలకలం. బ్రౌన్ షుగర్ కొనుగోలు చేసి విక్రయిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థి. శ్యామ్‌తో పాటు మరో తొమ్మిది మందిని అరెస్టు చేసిన పట్టాభిపురం పోలీసులు. రెండు గ్రాముల బ్రౌన్ షుగర్, యాభై గ్రాముల గంజాయి స్వాధీనం.. పది సెల్ ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు. గంజాయి వినియోగానికి ప్రత్యేకంగా తయారు చేసిన రెండు పెట్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు..
* పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. పాలకుర్తి మండలం రామారావుపల్లి మాజీ ఎంపీటీసీ దంపతులను అత్యంత దారుణంగా చంపారు. దంపతులు వెంకటి, కనకలక్ష్మిని గొడ్డలితో నరికి చంపారు. భూతగాదాల వల్లే హత్య జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. రామారావుపల్లిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారు
* మహబూబాబాద్ జిల్లాలో సంచలనం కలిగించిన యువతి గ్యాంగ్ రేప్ కేసులో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సామూహిక అత్యాచారానికి పాల్పడి, యువతి ఆత్మహత్యకు కారణమైన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర తెలిపారు. ప్రేమించి పెళ్ళిచేసుకోవాలన్న పాపానికి ముగ్గురు స్నేహితులతో దుండగుడు అత్యాచారం చేయించి వీడియో చిత్రీకరించాడని పోలీసులు తెలిపారు. ఆ అవమానం భరించలేక పురుగుల మందు తాగి ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసిందని ఎస్పీ శరత్ చంద్ర తెలిపారు. యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయిందన్నారు. యువతి ఆత్మహత్యకు కారణమైన నిందితులను అరెస్టు చేశామని ఆయన తెలిపారు
* హన్మకొండ జిల్లా హసన్ పర్తి జెడ్పీ హైస్కూల్ లో పైకప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థులకు గాయాలయ్యాయి. పదో తరగతి విద్యార్థులున్న గదిలోని పైకప్పు పెచ్చులు అకస్మాత్తుగా ఉడి పడ్డాయి. ఈ ఘటనతో తరగతి గదిలో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. అయితే పైకప్పు పెచ్చులు అకస్మాత్తుగా ఉడి పడటంతో ఐదుగురు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు.. వెంటనే వారిని పాఠశాల యాజమాన్యం స్థానిక ఆస్పత్రికి తరలించింది
* విజయవాడలోని ఏపీ కో-ఆపరేటివ్ ట్రైబ్యునల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కమర్షియల్ కాంప్లెక్స్లోని రెండు ఫ్లోర్లలో ఉన్న రెండు కోర్టులకు మంటలు వ్యాపించాయి.విజయవాడ బీసెంట్ రోడ్డులోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఏపీ కో-ఆపరేటివ్ ట్రైబ్యునల్లోని నాలుగవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో నుంచి మంటలు చేలరేగాయి. ఓ కమర్షియల్ కాంప్లెక్స్లోని రెండు ఫ్లోర్లలో ఉన్న కోర్టులకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అదే కాంప్లెక్స్లో బ్యాంక్తోపాటు మరికొన్ని కార్యాలయాలు ఉన్నాయి.
* కోలీవుడ్ స్టార్ అజిత్ హీరోగా, టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించిన తాజా చిత్రం వలిమై. హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురువారం(ఫిబ్రవరి 24న) థియేటర్లలో రిలీజైంది. అజిత్ సినిమా ఫస్ట్ డే చూసేందుకు థియేటర్‌కు తరలివచ్చిన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటుండగా ఈ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. కోయంబత్తూరులోని గంగవల్లి మల్టీప్లెక్స్ థియేటర్ ముందు పెట్రోల్ బాంబ్ దాడి జరిగింది. బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వలిమై సినిమా నడుస్తున్న థియేటర్ ఎదుట బాంబుతో దాడి చేశారు.
* హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. సెక్యురిటీగా పని చేసే సుందర్ రావ్(58) దూలపల్లి కమాన్ వద్ద సైకిల్‌తో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ సుందర్ రావు సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో సుందర్‌రావు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ లారీని వదిలేసి పరారయ్యాడు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేశారు. కేసు నమోదు చేపి దర్యాప్తు చేపట్టారు.
* వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన వరంగల్- ఖమ్మం హైవేపై చోటు చేసుకుంది.
* శుభకార్యానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టీఆర్‌ఎస్ నాయకుడు మృతిచెందాడు. కొత్తపల్లి ఎస్సై బి.ఎల్లయ్యగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన మాజీ సర్పంచ్ భర్త గొల్లపల్లి కిషన్(52) బుధవారం కరీంనగర్‌లో జరిగే వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో చింతకుంట పంచాయతీ పరిధిలోని కరీంనగర్–వేములవాడ ప్రధాన రహదారిపై ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల సమీపంలో వెనకనుంచి వచ్చిన కరీంనగర్–1 డిపో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
* చైన్ స్నాచింగ్, హౌస్ బ్రేకింగ్ దొంగతనాలు చేసే అంతరాష్ట్ర ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. మాటలతో మభ్యపెట్టి, వారి దృష్టిని మరల్చి దొంగతనాలకు పాల్పడే మహిళా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 50 లక్షల రూపాయల విలువైన 1 KG బంగారు ఆభరణాలు, 50 వేల రూపాయల విలువైన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు
* చైన్ స్నాచింగ్, హౌస్ బ్రేకింగ్ దొంగతనాలు చేసే అంతరాష్ట్ర ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. మాటలతో మభ్యపెట్టి, వారి దృష్టిని మరల్చి దొంగతనాలకు పాల్పడే మహిళా దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 50 లక్షల రూపాయల విలువైన 1 KG బంగారు ఆభరణాలు, 50 వేల రూపాయల విలువైన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు
* వరుస చైన్ స్నాచింగ్దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మాటలతో మభ్యపెట్టిదృష్టిని మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న మహిళా దొంగల ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. నిందితుల నుంచి సుమారుగా రూ. లక్షల విలువైన కేజీ బంగారం ఆభరణాలురూ.వేల విలువైన వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకర్ణాటక రాష్ట్రానికి చెందిన మందిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారిస్తున్నారు
*కృష్ణాజిల్లా తిరువూరు బస్టాండ్ సెంటర్లో యువకుడి దారుణ హత్య..అర్థరాత్రి హత్యతో ఉలిక్కిపడిన తిరువూరు పట్టణం..జుదాల్లో రెండు వర్గాల మధ్య ఏర్పడిన పాత పాత కక్షల నేపథ్యంలో జరిగిన హత్యగా భావిస్తున్న ప్రజలు..
హత్యకు గురైన యువకుడు కల్యాణపు కృష్ణ చైతన్య (26) గా గుర్తింపు..సంఘటన స్థలానికి చేరుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్.భీమరాజు..
*ప్రకాశం జిల్లా దర్శిలో ఒక ఉపాధ్యాయుడు చీటీపాటల పేరుతో జనానికి కుచ్చు టోపీ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. దర్శికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామ్‌నాయక్ చిట్టీలు పేరుతో భారీ మొత్తంలో వసూలు చేసి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్శి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమారు రూ.6 కోట్ల వరకు వసూలు చేసినట్లు బాధితులు పోలీసులకు వెల్లడించారు
*భార్య కాపురానికి రావడం లేదంటూ సెల్ టవర్ ఎక్కాడా భర్త! చివరకు కిందకు దిగుతూ.. ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు.
*తిరువూరు బస్టాండ్ సెంటర్లో దారుణ హత్య జరిగింది. యువకుడిని గుర్తు తెలియని దుండగులు బండరాయితో దారుణంగా హత్య చేశారు. యువకుడి మర్డర్‌తో ఒక్కసారిగా తిరువూరు ఉలిక్కిపడింది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువకుడు కల్యాణపు కృష్ణ చైతన్య (25)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.
*మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మయన్మార్ సరిహద్దు సమీపంలో అధునాతన పేలుడు పరికరాలను సాయుధ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మణిపూర్ లో ఉగ్రవాదులు దాడి చేయడానికి అధునాతన పేలుడు పరికరాలను మయన్మార్ నుంచి భారతదేశంలోకి తీసుకువస్తుండగా సాయుధ బలగాలు పట్టుకున్నాయి. ఉగ్రవాదులు ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించే ఉద్ధేశంతో పేలుడు పరికరాలను తెచ్చారని పోలీసులు చెప్పారు. ఇండో-మయన్మార్ సరిహద్దులోని మోరే వద్ద అస్సాం రైఫిల్స్ మోరే బెటాలియన్ మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది.ఈ పేలుడు పరికరాలను మయన్మార్ నుంచి బైక్పై తరలిస్తుండగా సరిహద్దు వెంబడి ఉన్న బెతుక్ గ్రామ సమీపంలో అస్సాం రైఫిల్స్ దళం పట్టుకుంది.
*గుంటూరులో బ్రౌన్ షుగర్ కలకలం రేగింది. బ్రౌన్ షుగర్ కొనుగోలు చేసి విక్రయిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థి శ్యామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శ్యామ్తో పాటు మరో తొమ్మిది మందిని పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. రెండు గ్రాముల బ్రౌన్ షుగర్, యాభై గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పది సెల్ ఫోన్లను సీజ్ చేశారు. గంజాయి వినియోగానికి ప్రత్యేకంగా తయారు చేసిన రెండు పెట్ బాటిల్స్‌ను కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
* కృష్ణా జిల్లాలోని 15 మండలాల్లో కిడ్నీ వ్యాధి విస్తరించిందని, ఒక్క ఎ.కొండూరు మండలంలోనే పదిరోజుల్లో ఐదుగురు మృతి చెందారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు తెలిపారు. కిడ్నీ సమస్యపై ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. మండలంలోని ప్రతి గ్రామంలో కిడ్నీ రోగులు ఉన్నారని, దీప్లానగర్ తండాలో 150 కుటుంబాలు ఉంటే గత మూడేళ్లలో 16 మంది మృతి చెందారని తెలిపారు. ఫ్లోరైడ్ నీటి వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతోందన్నారు.
*అప్పుల బాధ తాళలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్ఐ మోహనరావు తెలిపారు. పెనుగొండ కు చెందిన ఇంటి పద్మనాభం (47) నిడదవోలు– నరసాపురం కెనాల్ రోడ్డులో ఉన్న తన శ్రీ పద్మాలయ ఇంజనీరింగ్ వర్క్స్ ప్రొఫైట్ షీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆవరణలో ఐరెన్ గెడ్డర్కు మంగళవారం తెల్లవారుజామున ఉరి వేసుకున్నాడు. మృతుడికి భార్య,ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
*విశాఖపట్నం స్థానిక పోలీసులు, నర్సీపట్నం ఫారెస్ట్ అధికారులు మంగళవారం కోటవురట్లలో మూడుచోట్ల దాడులు నిర్వహించి 49 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆయా శాఖల అధికారులు తెలిపిన వివరాలు… మండలంలోని సన్యాసిరాజుపాలెం గ్రామంలో ఓ రైతు తన అసైన్డ్ భూమిలో టేకు చెట్లు పెంచుకుంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి టేకు చెట్లను ఇటీవల నరికి వేయించాడు. టేకు దుంగలను మంగళవారం తెల్లవారుజామున వ్యాన్లో లోడింగ్ చేయిస్తున్నాడు. దీనిపై గుర్తు తెలియని వ్యక్తి నర్సీపట్నం ఫారెస్ట్ అధికారులకు, కోటవురట్ల పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని 20 టేకు దుంగలతోపాటు వ్యాన్ని స్వాధీనం చేసుకుని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.
*బైక్ను ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. వికారాబాద్ మండలం నారాయణపూర్కి చెందిన కావలి కృష్ణ(35), అతడి బంధువైన కావలి మాణయ్య(42) మంగళవారం వికారాబాద్ వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఇద్దరూ గ్రామానికి వెళ్తుండగా.. కొత్తగడి సమీపంలో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ అద్దె బస్సు బైక్ను ఢీకొంది. దీంతో ఇద్దరూ బస్సు చక్రాల కింద పడి చనిపోయారు. బస్సు ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో.. గ్రామస్తులు, కుటుంబీకులు రోడ్డుపై బైఠాయించారు. బస్సు డ్రైవర్ను తీసుకువచ్చే వరకూ ఆందోళన ఆగదని పట్టుబట్టారు. పోలీసులు నచ్చజెప్పినా.. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ వెళ్లినా ఫలితం లేకపోయింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు రోడ్డుపై విద్యుత్ స్తంభాలను అడ్డంగా పెట్టి.. టెంట్ వేశారు. ఏఎస్పీ రషీద్ చేరుకొని మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అయినా.. ఆందోళన ఆగలేదు. ఆర్డీవో విజయలక్ష్మి వచ్చి న్యాయం చేస్తామంటూ వారికి నచ్చజెప్పారు. దీంతో వాళ్లు శాంతించడంతో.. మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.
*చెట్టంత కొడుకు చనిపోయాడనే బాధ లేదా వ్యక్తికి. సరికదా.. భర్త లేని బాధలో ఉన్న కోడలిని కన్నకూతురిలా చూసుకోవాల్సింది పోయి ఆమెపై మోజు పడ్డాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను వేధింపులకు గురిచేశాడు. మాట వినడం లేదనే ఆగ్రహంతో ఆమెపై హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం రైల్వే కాలననీ గ్రామంలో జరిగింది.
*తిరుమలాయపాలెం మండలంలోని జల్లేపల్లి గ్రామంలో నాగండ్ల ప్రసాద్ కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడిన టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాషబోయిన వీరన్న, నాగండ్ల ఉపేందర్, మరికొందరిపై పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది.
*జనగామ జిల్లాలోని ఎర్రగొల్లపహాడ్ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మృతుడు తరిగొప్పులకు చెందిన రియల్టర్ కొండా అనిల్గా గుర్తించారు. హైదరాబాద్ అంబర్ పేట శంకర్కు అనిల్ రైట్ హ్యాండ్ అని సమాచారం. మృతుడి వాహనంపై ఎమ్మెల్యే ప్రోటోకాల్ స్టిక్కర్ ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* మద్యం సేవించి నగ్నంగా రోడ్లపై తిరిగిన రాజకీయ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌లోని నలంద జిల్లాలో ఈ ఘటన జరిగింది. అధికార పార్టీ జేడీయూ నేత జై ప్రకాష్ ప్రసాద్ అలియాస్ కాలు, ఇస్లాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ యువజన విభాగం ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. జగదీష్‌పూర్ గ్రామంలో గత రాత్రి ఆయన ఫుల్‌గా మద్యం సేవించారు. అనంతరం బట్టలన్నీ విప్పి నగ్నంగా రోడ్డుపై సంచరించారు. జై ప్రకాష్‌కు నచ్చజెప్పి ఇంట్లోకి రప్పించేందుకు ఆయన సోదరుడు ఎంతగానో ప్రయత్నించారు.
* నిత్యం అండగా ఉండాల్సిన తండ్రే కూతురుపై (Daughter) కన్నేశాడు. తన కామవాంఛ తీర్చాలని బలవంతం చేశాడు. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను లొంగదీసుకోవాలని చూశాడు. అయితే అందరికి చెప్తానని అనడంతో ఆమెను చంపి.. శవంపై తన కోరిక తీర్చుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణాలో జరిగింది.