‘ జయం ‘ , ‘ అపరిచితుడు ‘ వంటి సినిమాల్లో నటించి , ఇప్పుడు రియాలిటీ షోలల్లో పాల్గొంటున్న సదా కొంతకాలం క్రితం ‘ సదా గ్రీన్ లైఫ్ ‘ పేరుతో యూట్యూబ్ ఛానల్ను మొదలు పెట్టింది . తాను చేసే వంటకాలు , తీసుకునే ఆహారం , అభిరుచులూ … ఇలా ఎన్నో విషయాలకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేసేస్తూ అభిమానులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది . ప్రస్తుతం తన ఛానల్కు లక్షా ఎనభైఎనిమిది వేలమంది సబ్సైబర్లు ఉన్నారనీ … ఈ సంఖ్యను ఇంకా పెంచేందుకు తనకు తోచిన ప్రయోగాలన్నీ చేస్తున్నాననీ వివరిస్తుంది సదా