DailyDose

అగ్రిగోల్డ్‌ కేసులలో కీలక మలుపు – TNI నేర వార్తలు

అగ్రిగోల్డ్‌ కేసులలో కీలక మలుపు  – TNI  నేర వార్తలు

*అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసులలో కీలక మలుపు చోటుచేసుకుంది. అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసు ఏలూరు జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. వివాదాలను ఏలూరు జిల్లా కోర్టుకు హైకోర్టు బదిలీ చేసింది. వేలం ద్వారా వచ్చిన రూ. 50 కోట్లు కూడా జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. ఏడేళ్లుగా అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసులు హైకోర్టులో కొనసాగుతున్నాయి. విచారణ కొనసాగించాలన్న డిపాజిటర్లు, బ్యాంకు అభ్యర్థన తిరస్కరించారు. డిపాజిటర్ల రక్షణ చట్టం ప్రకారం కోర్టుకే విచారణాధికారం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అగ్రిగోల్డ్‌, అక్షయగోల్డ్‌ కేసులన్నింటిపై హైకోర్టు విచారణ ముగించింది

* కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్ల మండంలో పెట్నికోటలో ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేదంటూ ఇళ్లను కూల్చేందుకు అధికారుల యత్నం చేశారు. దీనిని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా పోలీసులను మోహరించారు. అధికారుల ప్రయత్నానానికి నిరసనగా వాస్మొల్‌ తాగి ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించారు.

* అనంతపురం నగరంలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో విషాదం ఏఎస్ఐ చలమయ్య.. విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి

* వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం బెక్కం గ్రామానికి చెందిన యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో వెల్లడించి క్రిమిసంహారక మందు తాగాడు. కృష్ణా నదిలో సాగు చేస్తున్న భూముల పంచాయితీలో ముస్లింలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. సదరు యువకుడి కోసం గ్రామస్తులు గాలించగా.. కృష్ణానదిలో యువకుడి ఆచూకీ లభ్యమైంది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు

*రాజస్థాన్లో ఓ నాలుగేళ్ల బాలుడు బోరుబావిలో చిక్కుకున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు.. బాలుడిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రాజస్థాన్లోని శిఖర్ జిల్లాలో సరదాగా ఆడుకుంటున్న ఓ నాలుగేళ్ల బాలుడు అకస్మాత్తుగా అక్కడ ఉన్న బోరుబావిలో పడిపోయాడు. ఆ బాలుడిని వెలికితీసేందుకు అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు .

*అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై లారీ బస్సు ఢీ 15మందికి గాయాలు 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలింపు ముగ్గరి పరిస్థితి విషమం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

*అనంతపురం జిల్లాలోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ చలమయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చలమయ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తూముకుంట రామాంజనేయులు అనే వ్యక్తి కోటి రూపాయల వరకు మోసం చేశాడని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. సీఐ రెడ్డప్ప, ఎస్సై నాగ మధు తమ కొంపముంచారంటూ చలమయ్య భార్య ఆరోపించారు. న్యాయం చేయకపోగా మనిషి ప్రాణానికి ముప్పు తీసుకువచ్చారంటూ చలమయ్య భార్య కృష్ణవేణి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు

*హుజురాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న నరెడ్ల రజిని (40) అక్కడికక్కడే మృతి చెందింది. టేకుమట్ల మండలంలోని కుందనపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహించడానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

*జగద్గిరిగుట్టలో ఓ యువకుడు నాలాలో పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. గాజుల రామారాం, దేవేందర్‎నగర్‎లో నివాసం ఉంటూ బైక్ మెకానిక్‎గా ఆసిఫ్ జీవనం సాగిస్తున్నాడు. గత నాలుగు రోజులుగా ఆసిఫ్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. శుక్రవారం (నేడు) ఉదయం బాలయ్యనగర్ వద్ద ఉన్న క్వారీ గుంతలో ఆసిఫ్ మృతదేహం లభ్యమైంది. దీంతో ఆసిఫ్‎ది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*ఒంటిమిట్ట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు చెరువులోకి దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం కర్ణాటక సిద్దనూరు నుండి తిరుమలకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి చెరువులోనుంచి కారును బయటికి తీయించారు. మృతులు చంద్రగుప్త, ఖేదర్‎నాథ్‎లుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*నంద్యాల వన్టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని దళితవాడకు చెందిన నరసింహుడు భార్య రామలక్ష్మి (27) గురువారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త నరసింహుడు నంద్యాల మున్సిపాల్టీలో శానిటేషన్ వర్కర్గా పని చేస్తున్నాడు. వీరికి పది సంవత్సరాల క్రితం వివాహమైంది. ముగ్గురు సంతానం ఉన్నారు. రామలక్ష్మి ఇంట్లో ఉరివేసుకోవడాన్ని కుటుంబ సభ్యులు గమనించి నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు

*బైక్ను ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. వికారాబాద్ మండలం నారాయణపూర్కి చెందిన కావలి కృష్ణ(35), అతడి బంధువైన కావలి మాణయ్య(42) మంగళవారం వికారాబాద్ వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఇద్దరూ గ్రామానికి వెళ్తుండగా.. కొత్తగడి సమీపంలో ఎదురుగా వచ్చిన ఆర్టీసీ అద్దె బస్సు బైక్ను ఢీకొంది. దీంతో ఇద్దరూ బస్సు చక్రాల కింద పడి చనిపోయారు. బస్సు ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో.. గ్రామస్తులు, కుటుంబీకులు రోడ్డుపై బైఠాయించారు. బస్సు డ్రైవర్ను తీసుకువచ్చే వరకూ ఆందోళన ఆగదని పట్టుబట్టారు. పోలీసులు నచ్చజెప్పినా.. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ వెళ్లినా ఫలితం లేకపోయింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు రోడ్డుపై విద్యుత్ స్తంభాలను అడ్డంగా పెట్టి.. టెంట్ వేశారు. ఏఎస్పీ రషీద్ చేరుకొని మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అయినా.. ఆందోళన ఆగలేదు. ఆర్డీవో విజయలక్ష్మి వచ్చి న్యాయం చేస్తామంటూ వారికి నచ్చజెప్పారు. దీంతో వాళ్లు శాంతించడంతో.. మృతదేహాలను వికారాబాద్ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు.

*ఖమ్మం వెంకటగిరి క్రాస్రోడ్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన గోకర్ల లాలయ్యకు దొంగతనం కేసులో రెండు నెలల జైలుశిక్ష, జరిమానా విధించారు. ఈమేరకు స్థానిక ఒకటవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ర్టేట్ నూతక్కి శాంతిసోని గురువారం తీర్పు చెప్పారు బ్యాంకుకాలనీలో సీతారామాంజనేయస్వామి ఆలయంలో 2019న హూండీలను పగలగొట్టి రూ 25వేలు దొంగలించాడు. దీనిపై ఆలయ పర్యవేక్షకుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావటంతో న్యాయమూర్తి శిక్షించారు. ఇదే నిందితుడికి మరో రెండు దొంగతనం కేసుల్లో సైతం శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.ప్రాసిక్యూషన్ తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్కుమార్, అప్పటి టూటౌన్ ఎస్సై ఉడయ్కుమార్ కోర్టు కానిస్టేబుల్ నాగేశ్వరరావు లు సహకరించారు.

*భార్యాపిల్లలతో కలిసి బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి.. ఉన్నట్టుండి భార్యతో గొడవపడ్డాడు. కోపంతో ఊగిపోతూ బైక్ పక్కన ఆపేసి భార్యాపిల్లలు చూస్తుండగానే గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు-రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు బ్రిడ్జిపై గురువారం ఈ దుర్ఘటన జరిగింది.

*వ్యవసాయం కలిసిరాక అప్పులు తీర్చే దారి కానరాక మరో రైతు బలవనర్మరణం చెందాడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం చిరుమర్రిలో ఇనప కోటయ్య(48)తనకున్న ఎకరంతోపాటు మరో ఎకరం కౌలుకు తీసుకొని మిర్చి, వరి పంటలు వేశాడు. పెట్టుబడులకు రూ.3.50లక్షలు అప్పులు చేశాడు. దిగుబడులు ఆశించిన విధంగా రాక అప్పులెలా తీర్చాలో అర్థంకాక బుధవారంరాత్రి పురుగులమందు తాగాడు.

*మహబూబాబాద్ జిల్లాలో యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతిని బెదిరించి నిందితులు లొంగదీసుకున్నారని పోలీసులు నిర్ధారించారు. నిందితుల్లో టీఎ్సఎస్పీ నాలుగో బెటాలియన్ కానిస్టేబుల్, ఓ ఎంపీటీసీ భర్త, మరో ఇద్దరు ఉన్నారు

*ఆడుతూ పాడుతూ సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేయాల్సిన ఓ 13 ఏళ్ల బాలుడు అర్థాంతరంగా తనువు చాలించాడు. తన తండ్రి బిర్యానీ తీసుకురాలేదనే మనస్తాపంతో.. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో కొెందరు పిల్లలు.. అమ్మానాన్న ఫోన్ కొనివ్వడం లేదనో.. కాస్త మందలించారనో.. ఇలా చాలా చిన్న కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒడిశాలోని బాలాసోర్కు చెందిన 13 ఏళ్ల బాలుడు.. బిర్యానీ తీసుకురాలేదని ఆత్మహత్య చేసుకొని.. కన్నవారికి కడుపుకోతను మిగిల్చాడు.