టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులంతా జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్ ప్రాంతాల్లో ఉన్నట్లే, బాలీవుడ్ సినీ జనాలు ముంబైలోని జుహు ప్రాంతంలో ఉంటారు. ఖరీదైన ప్రాంతమైన జుహులో ఇల్లో , ఫ్లాటో ఉండడం స్టార్ స్టేట్‌సకు ఓ సింబల్. అందుకే కాస్త ఖరీదు ఎక్కువైనా జుహూ ప్రాంతంలో ఇళ్లు కొనాలని బీ టౌన్ ప్రముఖులు ఆలోచిస్తుంటారు. జుహూ ప్రాంతంలో అజయ్ దేవగణ్, ఆయన భార్య కాజోల్ శక్తి అనే బంగ్లాలో ప్రస్తుతం ఉంటున్నారు. దీనికి సమీపంలోనే 60 కోట్లతో మరో బంగ్లాను అజయ్ గత ఏడాది కొనుగోలు చేశారు. పుష్పా వాలీయా అనే ఆవిడ దగ్గర నుంచి గత ఏడాది ఈ బంగ్లా కొన్నారు అజయ్. ఇది పాత సంగతే.తాజా విషయం ఏమిటంటే.. కాజోల్ సొంతంగా జుహూ ప్రాంతంలోనే రెండు ఖరీదైన అపార్ట్‌మెంట్లు కొన్నారు. గత నెల్లో కొన్న ఈ రెండు అపార్ట్‌మెంట్ల ఖరీదు ఎంతో తెలుసా? .. రూ 11.95 కోట్లు. అనన్య బిల్డింగ్‌లో పదో అంతస్తులో ఉన్నాయట ఈ రెండు అపార్ట్‌మెంట్లు. మొత్తానికి భార్యాభర్తలిద్దరూ ఇలా పోటీ పడి ఇళ్లు కొంటున్నారన్నమాట!