Movies

అలాంటివి నాకూ నచ్చవు

అలాంటివి నాకూ నచ్చవు

ఇటీవల విడుదలైన ‘గెహరియా’ చిత్రంలో అందాల ఆరబోతకు దిగడమే కాదు, శ్రుతిమించిన శృంగార సన్నివేశాలతో అభిమానులను హీటెక్కించారు బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పడుకోన్‌. ఈ చిత్రంలో హీరోగా నటించిన సిద్ధాంత్‌ చతుర్వేది, దీపిక మధ్య బోల్డ్‌ సన్నివేశాలపై నెటిజన్ల నుంచి ఆమె తీవ్రమైన ట్రోలింగ్‌ ఎదుర్కొన్నారు. తనపై వచ్చిన విమర్శలపై దీపిక ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.‘ఈ సినిమా అంగీకరించేముందు అలీషా (సినిమాలో ఆమె పాత్ర పేరు) ప్రవర్తన తప్పా?, ఒప్పా? అనే విషయాన్ని నేను ఆలోచించలేదు. సినిమాలో చెప్పాలనుకున్న విషయం అది కాదు. ఈ ప్రపంచంలో రకరకాల వ్యక్తులు ఉన్నారు. వాళ్లు చేసే పనులు అందరికీ నచ్చాలని లేదు. అలాగే నాకు కూడా! మంచి చెడుల గురించి తీర్పులు చెప్పడం నా పని కాదు. ఒక నటిగా నా పాత్రతో ప్రేక్షకులు కనెక్టయ్యేలా చేయగలిగానా, లేదా అనేదే నాకు ముఖ్యం’ అన్నారు.