Movies

ప్రభాస్‌ హీరోయిన్లు దొరికేశారా?

ప్రభాస్‌ హీరోయిన్లు దొరికేశారా?

ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. డివివి దానయ్య నిర్మాత. ప్రస్తుతం స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయి. ఇదో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని, ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు నటించబోతున్నారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కథానాయికలు వీళ్లేనంటూ… వార్తలు పుట్టుకొస్తున్నాయి. ‘పెళ్లి సందడి’తో ఆకట్టుకున్న శ్రీలీలని ఓ కథానాయికగా ఎంచుకున్నారని టాక్‌. తమిళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన మాళవిక మోహనన్‌ ని మరో నాయికగా ఎంచుకున్నారని సమాచారం అందుతోంది. మూడో కథానాయికగా మెహరిన్‌ పేరు చర్చల్లో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే… చిత్ర బృందం మాత్రం అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం ‘ఆదిపురుష్‌’, ‘స్పిరిట్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. ఈ యేడాది చివర్లో మారుతి సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.