Movies

రౌడీబాయ్ తో రొమాన్స్

రౌడీబాయ్ తో  రొమాన్స్

తెలుగులో ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామా’ చిత్రాలతో యువతరానికి చేరువైంది ఢిల్లీ సొగసరి కియారా అద్వాణీ. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్లో భారీ అవకాశాల్ని సొంతం చేసుకుంటున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడు తెలుగులో విజయ్దేవరకొండ సరసన నటించనున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే…ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమాలో నటిస్తున్నారు విజయ్ దేవరకొండ. ఆగస్ట్ 25న విడుదలకానుంది. ఈ సినిమా అనంతరం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో కియారా అద్వాణీ నాయికగా నటించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ విషయమై సంప్రదింపులు పూర్తయ్యాయని, త్వరలో చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత కియారా అద్వాణీ తెలుగులో రీఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.