*వీఐపీ బ్రేక్ దర్శనాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఇప్పటికే శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. వీఐపీల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకే కేటాయించాలని టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.
* విదేశాంగ మంత్రి జైశంకర్‌కు సీఎం జగన్ ఫోన్‌కాల్ చేశారు. ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారని సీఎం వెల్లడించారు. తెలుగు విద్యార్థులు తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల తరలింపుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని జైశంకర్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ పొరుగు దేశాల మీదుగా తరలిస్తామని జైశంకర్ వెల్లడించారు.
* ప్రకృతిని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని గ్రాండ్ కాకతీయలో ఫారెస్ట్ నేషనల్ వర్క్ షాప్‌ను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.
*కృష్ణాజిల్లా…చెల్లిని పాఠశాలలో దించి వస్తూ ప్రమాదానికి గురై అక్క మృతి…విజయవాడ నగర శివారులో రామవరప్పాడులో ఘటన..స్థానిక బల్లెంవారి వీధిలో విద్యార్థిని స్కూటీ ను ఢీకొన్న లారీ..ప్రమాదంలో విద్యార్థిని పైకి లారీ ఎక్కడంతో అక్కడికక్కడే దుర్మరణం..మృతురాలు పావులూరి సాయి భావన(19)గా గుర్తింపు..ధనేకుల ఇంజినీరింగ్ కళాశాలలో మూడో ఏడాది చదువుతున్న సాయిభావన..సమాచారం అందుకున్న పడమట పోలీసులు వివరాలు సేకరణ.
*అనంతపురం జిల్లా హిందూపురం లో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు… 20 తులాల బంగారు నగలు స్వాధీనంహిందూపురం ఒన్ టౌన్ పోలీసులు అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసి 20 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు పెనుకొండ డీఎస్పీ ఎన్ రమ్య, సి.ఐ ఇస్మాయిల్ లు మీడియాకు వివరాలు వెల్లడించారు.
* నందిగామలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఏర్పాటుపై హైకోర్టు స్టే
నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఏర్పాటును హైకోర్టు నిలుపుదల చేసింది. ప్రభుత్వ స్థలాల్లో విగ్రహాల ఏర్పాటు.. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధమని గుర్తుచేసింది. పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని పేర్కొంటూ.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఏర్పాటును హైకోర్టు నిలుపుదల చేసింది. ప్రభుత్వ స్థలాల్లో విగ్రహాల ఏర్పాటు.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని గుర్తుచేసింది. నందిగామ గాంధీ కూడలి వద్ద వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగే రీతిలో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నారని, ఆ ప్రక్రియను నిలువరించాలని కోరుతూ వై.రామకృష్ణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఇటీవల విచారణ జరిపిన కోర్టు.. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. తాజాగా ప్రభుత్వాసుపత్రి స్థలంలో.. వైఎస్ విగ్రహం ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టారని.. పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై అత్యవసర విచారణ జరపాలని కోరగా అందుకు అంగీకరించిన ధర్మాసనం…విగ్రహం ఏర్పాటుపై స్టే విధించింది. వాహన రాకపోకలకు అడ్డంకులు కలిగేలా గతంలో 14 విగ్రహాలు ఏర్పాటుచేశారని అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాల తమ ముందు ఉంచాలన్న హైకోర్టు……. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది
* బీజేపీ కార్యాలయంలో పార్సిల్ కలకలం సృష్టించింది. బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు బాషా పేరుతో ఓ పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్‌లో తెల్ల వస్త్రం, పిండితో చేసిన మనిషి బొమ్మ(బొమ్మపై అప్సర్ బాషా పేరు) ఉంది. దీంతో ఒక్కసారిగా బీజేపీ నేతలు హడలిపోయారు. పార్సిల్ చూసి కంగుతిన్న అప్సర్ బాషా.. ఆపై అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్సిల్‌ను బీజేపీ కార్యాలయం సిబ్బందికి అందజేసిన అజ్ఞాత వ్యక్తి అందజేశాడు. ఏసీపీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయాన్ని పోలీసులు పరిశీలించారు. అజ్ఞాత వ్యక్తి కోసం బీజేపీ కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తున్నారు. తీవ్రవాద మూలాలపై సీసీ టీవీ ఫుటేజీని నిశితంగా పోలీసులు పరిశీలిస్తోన్నారు.
* విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులను నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి హెచ్చరించారు. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను డీసీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోయిన్‌పల్లిలో ఉన్న పెండింగ్ కేసులు, అక్కడ ప్రజలకు అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ కొత్త భవన నిర్మాణాన్ని కలియ తిరిగి అక్కడ జరుగుతున్న పనులను తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల ఫైల్స్‌ను డీసీపీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చందనా దీప్తి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. కేసులను త్వరితగతిన విచారణ చేయాలని ఆదేశించారు.
* మనీలాండరింగ్ కేసులో బుధవారం అరెస్ట్ అయిన ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ నేడు ముంబైలోని జేజే ఆసుపత్రిలో చేరారు. వైద్యుల సలహాపై ఆయన ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తున్నప్పటికీ దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారమూ లేదు. అయితే, ఆయన కుమార్తె సనాఖాన్ మాత్రం తన తండ్రి ఆసుపత్రిలో చేరిన విషయాన్ని పార్టీ కార్యకర్తలకు తెలిపారు. ఆయన కడుపునొప్పితో బాధపడుతున్నట్టు చెప్పారు
* దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా కరోనా ఆంక్షలను సవరించారు. కొద్ది రోజులుగా అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూను ఎత్తివేయాలని నిర్ణయించారు. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో, శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త నిబంధనల ప్రకారం మాస్క్ ధరించకపోతే ఐదు వందల రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించారు. ఇంతకుముందు ఈ జరిమానా రెండు వేల రూపాయలుగా ఉండేది. ఢిల్లీ పరిధిలోని పాఠశాలల్లో ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాసులే జరుగుతుండగా, వచ్చే ఏప్రిల్ ఒకటి నుంచి పూర్తిస్థాయి ఆఫ్‌లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యాసంస్థలకు సూచించారు. మరోవైపు ప్రజలంతా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీలో కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం వాటిని సడలించారు.
* తిరుమల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోగర్భం డ్యామ్ సమీపంలో ఉన్న కాకుల కోన వద్ద అఒక్కసారిగా మంటల చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
* కోర్టులు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితులైన ఇద్దరు న్యాయవాదులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితులైన ఇద్దరు న్యాయవాదులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతీ సోమవారం విజయవాడలోని సీబీఐ క్యాంపు కార్యాలయంలో సంతకాలు పెట్టాలని ఆదేశించింది.
* ఉక్రెయిన్ సంక్షోభంపై ఏపీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ బాధ్యతలను ఎంటీ కృష్ణబాబుకు అప్పగించారు. కాల్ చేసి తల్లిదండ్రులు వారి పిల్లల సమాచారం తెలుసుకోవచ్చనిసూచించారు. ఇప్పటికే కాల్ సెంటర్లకు పైగా కాల్స్ వచ్చాయని సీఎం సమీర్‌శర్మ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో వెయ్యి మంది తెలుగు విద్యార్థులు ఉంటారనిపోలాండ్‌ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి భారత్‌కు విద్యార్థుల తరలించామని పేర్కొన్నారు. మరో సరిహద్దు నుంచీ తరలించేందుకు విదేశాంగశాఖ ఏర్పాట్లు చేసిందని ప్రకటించారు. ఉక్రెయిన్ సరిహద్దు దాటించి విమానాల ద్వారా ఢిల్లీకి విద్యార్థులను తరలించామని తెలిపారు. ఢిల్లీ నుంచి ఏపీకి తరలిస్తామని సమీర్‌శర్మ పేర్కొన్నారు.
* డిస్కంల అప్పులు రూ.60 వేల కోట్లకు చేరాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కూడా ఒక వినియోగదారు అనే అంశాన్నే మర్చిపోతున్నారని, ప్రభుత్వాల నుంచి బకాయిలు రాబట్టకపోవడంతో డిస్కంలు అప్పులపాలు చేశారని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, పథకాలపై ఛార్జీలను డిస్కంలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏటా డిస్కంలకు ప్రభుత్వం రూ.16 వేల కోట్లు చెల్లించాలన్నారు. ప్రభుత్వం ఏటా రూ.వేల కోట్లు మాత్రమే చెల్లిస్తోందనిడిస్కంలకు ప్రధాన డిఫాల్టర్ రాష్ట్ర ప్రభుత్వమేనని తప్పుబట్టారు. విద్యుత్ సంస్థ వైఫల్యానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కారణమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
* ఆశావర్కర్ల సేవలను మరింతగా సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 27వేల మంది ఆశావర్కర్లకు 4జీసిమ్, స్మార్ట్ ఫోన్ లను అందిస్తున్నామని పంచాయితీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. శుక్రవారం ఆయన వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలోని ఆశ వర్కర్లకు స్మార్ట్ ఫోన్ లను పంపిణీ చేశారు వరంగల్ లోని 693 మంది, హనుమకొండలోని 616 మంది ఆశ వర్కర్లకు మంత్రి స్మార్ట్ఫోన్లను హనుమకొండ కలెక్టరేట్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ స్మార్ట్ ఫోన్ లను అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో27 వేల ఆశా కార్యకర్తలకు 4జి సిమ్, స్మార్ట్ ఫోన్ అందిస్తున్నామని తెలిపారు.
* భీకర పోరు జరుగుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు వారందరికీ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సెల్ మద్దతు ప్రకటించింది. వారికి సహాయం చేయడానికి ప్రత్యేకంగా సహాయ కేంద్రాలను నెలకొ్ల్పినట్లు పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ తెలిపారు. NRI TDP సెల్ హాట్‌లైన్ +91 8645350888కి కాల్ చేయవచ్చని, లేదా nritdpservices@gmail.comకు ఇమెయిల్ చేయవచ్చని వారు కోరారు.
*రాష్ట్రంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు ఏప్రిల్ 10నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. దీనిని బట్టి 2021-22 విద్యాసంవత్సరాన్ని ఏప్రిల్ మొదటివారంలోగానే ముగించదలచారు. గురువారం విద్యాశాఖ ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో కొవిడ్ మూడోవిడత ప్రబలినా కేవలం నెలరోజులు మాత్రమే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అందులోను 1-8 తరగతులకు మాత్రమే వర్తింపచేశారు. మిగిలిన పాఠశాలలు, కళాశాలలు యథావిధిగానే పనిచేశాయి.
*పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘‘భీమ్లా నాయక్’’ చిత్రం నేడు థియేటర్ల ముందుకు వచ్చింది. థియేటర్ల వద్ద పవన్ అభిమానుల సందడి నెలకొంది. ఈ చిత్రంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. భీమ్లా నాయక్ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. జగన్ రెడ్డి ఒక పరిశ్రమ తర్వాత మరొక పరిశ్రమను ధ్వంసం చేయటం ద్వారా రాష్ట్రాన్ని భిక్షాటన చిప్పగా మార్చాలనుకుంటున్నారని విమర్శించారు. సినీ పరిశ్రమ కూడా దీనికి మినహాయింపు కాదన్నారు. భీమ్లా నాయక్ అన్ని కుట్రలను అధిగమించి విజయం సాధించాలని కోరుకుంటున్నానని లోకేష్ పేర్కొన్నారు.
*బీదర్- బెంగళూరుల మధ్య పౌర విమానయాన సేవలు గురువారం నుంచి మళ్ళీ ప్రారంభం అయ్యాయి. కొవిడ్ కారణంగా ఈ విమాన సేవలు తాత్కాలికంగా రద్దయిన సంగతి విదితమే. కేంద్రమంత్రి, బీదర్ ఎంపీ భగవంత్ ఖూబా తీసుకున్న చొరవ కారణంగా విమాన సేవలకు శ్రీకారం చుట్టారు. వారంలో మూడు రోజులు అంటే మంగళవారం,గురువారంఆదివారం ఈ విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు విమానాశ్రయంలో ఉదయం కు బయల్దేరే ఈ విమానం మధ్యాహ్నం గంటలకు బీదర్‌కు చేరుకుంటుంది. బీదర్‌లో ఈ విమానం మధ్యాహ్నం గంటలకు బయల్దేరి మధ్యాహ్నం గంటలకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోనుంది. బెంగళూరు-బీదర్‌ల మధ్య విమాన ప్రయాణ అవధి గంట నిముషాలుగా ఉంటుంది. తొలి దశలో ట్రూజెట్ తన విమాన సేవలను ప్రారంభించనుంది. అత్యవసర వేళల్లో నగరానిని ప్రయాణించే ప్రయాణికులకు ఇది బాగా ఉపయోగప డనుందని నిర్వాహకులు వెల్లడించారు
*కృష్ణా జిల్లా గుడివాడలో పవన్ కళ్యాణ్ అభిమానుల అరెస్ట్‌ను మాజీమంత్రి కటారి ఈశ్వర్ కుమార్ ఖండించారు. అభిమానులకు మద్దతుగా కటారి టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులుజనసేన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలపై ముఖ్యమంత్రి కక్షపూరిత విధానాలు మానుకోవాలని హితవుపలికారు. పక్క రాష్ట్రాల్లో రాజకీయాలకు అతీతంగా అందరి హీరోలను సమదృష్టితో చూస్తుంటేఆంధ్రప్రదేశ్‌లో వివక్ష పూరితంగా వ్యవహరించడం దారుణమన్నారు. స్వశక్తితో ఎదిగిన చిరంజీవి స్థాయి తగ్గించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వద్దకు రప్పించుకున్నారని కటారి ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
*విద్యుత్ చార్జీల పెంపుపై రెడ్ హిల్స్‌లోని ఫ్యాప్సీ బిల్డింగ్‌లో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించింది. 2022-23లో రూ.6831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదనలు చేశాయి. బహిరంగ విచారణలో వివిధ వర్గాలు పాల్గొన్నాయి. వచ్చిన సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ఈఆర్సీ పరిశీలించి చార్జీల పంపుపై తుది నిర్ణయం తీసుకోనుంది. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కాసేపట్లో హియరింగ్‌కు హాజరై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన వాదనలు వినిపించనున్నారు.
*మెగా వేలం తర్వాత.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీ ఎల్-2022 ప్రారంభతేదీని ప్రకటించారు. 10 జట్ల మెగా లీగ్ వచ్చే నెల 26న ముంబైలో ఆరంభం కానుండగా.. మే 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. గురు వారం జరిగిన పాలకమండలి సమా వేశంలో టోర్నీ తేదీలు, వేదికలను ఖరారు చేసినట్టు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపాడు. మొత్తం 74 మ్యాచ్ల్లో.. 70 లీగ్ మ్యాచ్లను ముంబైలోని వాంఖడే, బ్రబౌర్న్, డీవై పాటిల్, పుణెలోని గహుంజే స్టేడియాల్లో నిర్వహించ నున్నారు. ముంబైలో 55, పుణెలో 15 మ్యాచ్లు జరగనుం డగా.. మొత్తం 12 డబుల్ హెడర్ మ్యాచ్లను ఖరారు చేశారు. పూర్తి షెడ్యూల్ విడుదల చేసినప్పుడు వీటిపై స్పష్ట త రానుంది. కాగా, నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచ్లకు సంబంధించిన వేదికలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, అహ్మదాబాద్లో నాకౌట్ మ్యాచ్లను నిర్వహించే అవకాశం ఉంది. లీగ్ ఆరంభదశలో 40 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనుండగా.. కరోనా అదుపులోకి వస్తే పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది.
*శాతవాహనుల కాలం నాటి బౌద్ధ కేంద్రం ఆనవాళ్లను పరిశోధకులు పెద్దపల్లి జిల్లా తేలుకుంటలో వెలికితీశారు. చెరువు పక్కనే మట్టిదిబ్బపై గుర్తించిన వీటిని 2 వేల ఏళ్ల క్రితం విలసిల్లిన బౌద్ధమతానికి చెందిన స్ధూపంగా భావిస్తున్నారు. చరిత్ర పరిశోధకులు, తెలుగు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏంఏ శ్రీనివాసన్ నేతృత్వంలో చరిత్ర పరిశోధన సంస్థ ప్రిహా సభ్యుల బృందం జరిపిన పరిశోధనలో వీటిని శాతవాహనుల కాలం నాటి అవశేషాలుగా నిర్ధారించారు. సుమారు 130 మీటర్ల వ్యాసం ఉన్న మట్టి దిబ్బపై ఇటుకలతో కూడిన నిర్మాణం చెరువు పక్కనే ఉండటంతో ఇక్కడి జనావాసానికి ఇది నీటి వనరు వినియోగపడి ఉంటుందని భావిస్తున్నారు. రెండు వరుసల గోడలు, ఇక చివర గోడ కొంచెం మలుపు తిరిగి ఉన్నందున ఇది గజ పృష్ఠాకారంలో ఉన్న బౌద్థ స్థూపం కావొచ్చని శ్రీనివాసన్ వివరించారు
*మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడ్డ తరగతుల గురుకుల విద్యా సంస్థల సొసైటీకి ప్రభుత్వం రూ.82.84 కోట్లు విడుదల చేసింది. 2021-22 రెండవ త్రైమాసికానికి ఈ నిధులు విడుదల చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ పరిధిలోనీ హైస్కూల్, జూనియర్ కాలేజీల నిర్వహణకు ఈ నిధులు వినియోగిస్తారు. 2021-22 బడ్జెట్లో సొసైటీకి ప్రభుత్వం రూ.165.68 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, మహబూబ్నగర్లోని బీసీ స్టడీ సర్కిల్ భవనం మరమ్మత్తులు, నిర్వహణకు రూ.7.50 లక్షలు విడుదల చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి మరో ఉత్తర్వు జారీ చేశారు.
*థర్మల్ లేదా లిగ్నైట్ విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి వెలువడే బూడిద(ఫ్లైయా్ష)ను వేలం ద్వారా విక్రయించి.. తద్వారా కరెంట్ చార్జీల భారం నుంచి వినియోగదారులకు ఉపశమనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ సూచించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించి గురువారం పలు సూచనలు చేసింది. వాటి ప్రకారం.. బూడిద వినియోగం తొలి రెండేళ్లు 80ు వరకూ ఉండాలి. ఆ మరుసటి ఏడాదికి నూరు శాతానికి చేరాలి. లేకపోతే టన్నుకు రూ.వెయ్యి చొప్పున పర్యావరణ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.
*కల్యాణలక్ష్మి పథకానికి ప్రభుత్వం రూ.465.50 కోట్లు విడుదల చేసింది. 2021-22 చివరి త్రైమాసికానికి ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం ఉత్తర్వులిచ్చారు.
*దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ షెడ్యూల్ గురువారం విడుదలైంది. అయితే, ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు.