Movies

హీరోయిన్ ప్రణీతకు యూఏఈ గోల్డెన్‌ వీసా

Auto Draft

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక గోల్డెన్‌ వీసాను నటి ప్రణీత అందుకుంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో వెల్లడించింది. టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన అనేక మంది సెలెబ్రిటీలు ఈ వీసాను అందుకున్నారు. వారిలో నటుడు, దర్శకుడు పార్తిబన్‌, హీరోయిన్లు త్రిష, కాజల్‌ అగర్వాల్‌, అమలాపాల్‌, లక్ష్మీరాయ్‌, మీరా జాస్మిన్‌ తదితరులు ఉన్నారు. ఇపుడు ప్రణీతకు ఈ వీసాను యూఏఈ ప్రభుత్వం అందజేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా ఈ వీసాను పొందారు. వీసా కాలపరిమితి పదేళ్ళు.

కాగా, నటి ప్రణీత టాలీవుడ్‌లో పలు చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంలో కూడా ఆమె కీలక పాత్రలో నటించింది. కోలీవుడ్ విషయానికి వస్తే.. ‘ఉదయన్‌’ అనే చిత్రం ద్వారా తమిళ వెండితెరకు ప్రణీత పరిచయమైంది.. ఆ తర్వాత హీరో సూర్యతో కలిసి ‘మాస్‌ ఎన్‌గిర మాసిలామణి’తో మరో రెండుమూడు చిత్రాల్లో నటించింది. కన్నడంలో అగ్రనటిగా ఉన్న ఆమె.. గత యేడాది ప్రముఖ పారిశ్రామికవేత్త నితిన్‌ రాజును వివాహం చేసుకుంది. బాలీవుడ్‌లోనూ ఆమె రెండు మూడు చిత్రాలలో నటించారు