‘భీమ్లా నాయక్’ సినిమా విడుదల సందర్భంగా అట్లాంటాలో ఉన్న పవర్ స్టార్ అభిమానులు హడావుడి సృష్టించారు. భీమ్లా నాయక్ ప్రదర్శిస్తున్న ధీయేటర్ ముందు బ్యానర్లు, కటౌట్లు కట్టి బాణసంచా కాల్చారు. కేక్ కటింగ్ తో సంబరాలు ప్రారంభించారు. భీమ్లా నాయక్ చిత్రం ప్రదర్శిస్తున్న డిజిమేక్స్ థీయేటర్ ముందు భారీ కటౌట్లు ఏర్పాటు చేసారు. భీమ్లా నాయక్ పేరుతొ ఉన్న టీ షర్టులు, కండువాలు ధరించి సంబరాలు చేసుకున్నారు.