Movies

బౌలింగ్ నేర్చుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ

Auto Draft

అనుష్క శర్మ కొంత కాలం క్రితం సినిమాలకు బ్రేకిచ్చిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్నాక చిత్రాలకు విరామం ప్రకటించింది. దాదాపుగా నాలుగేళ్ల అనంతరం తిరిగి ఆమె వెండి‌తెర పైన మెరవనుంది. ‘ఛక్ దా ఎక్స్‌ప్రెస్’ మూవీలో ఆమె నటించనుంది. ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీలో ఝులన్ పాత్రలో ఆమె కనిపించనుంది.అనుష్క శర్మ ప్రస్తుతం ‘ఛక్ దా ఎక్స్‌ప్రెస్’ కు సన్నద్ధం అవుతోంది. అందుకోసం కొన్నాళ్ల నుంచి క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటుంది. తాజాగా బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బంతి గ్రిప్‌ను పట్టుకునే విధానాన్ని ఆమె నేర్చుకుంటోంది. అందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటోల కింద క్యాప్షన్ కూడా ఇచ్చింది. ‘‘గ్రిప్ బై గ్రిప్’’ అని ఆమె రాసింది. ఈ ఏడాది జనవరి 6న ‘ఛక్ దా ఎక్స్‌ప్రెస్’ టీజర్‌ను అనుష్క ఇన్‌స్టాలో షేర్ చేసింది. టీజర్‌లోని ఆమె లుక్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. విరాట్ భార్య కావడం వల్లే ఈ చిత్రంలో ఆమెకు అవకాశం దక్కిందని కొందరు విమర్శించారు.