DailyDose

హైదరాబాద్ లో మళ్ళీ డ్రగ్స్ కలకలం – TNI నేర వార్తలు

హైదరాబాద్ లో మళ్ళీ డ్రగ్స్ కలకలం – TNI నేర వార్తలు

* విజయనగరం పట్టణంలో ఈనెల 23న రవి జ్యువెల్లరీ దుకాణంలో జరిగిన భారీ చోరీ ఘటనను పోలీసులు ఛేదించారు. ఛత్తీస్‌గఢ్ కు చెందిన లోకేశ్‌ శ్రీవాస్‌ను విజయనగరం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 6.18 కిలోల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. గంటస్తంభం వద్ద రవి జువెల్లర్స్‌లో పైకప్పు నుంచి దుకాణంలో చొరబడి 8 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు.దుకాణం యజమాని కోట రామ్మోహన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు పాత నేరస్థుడు లోకేశ్‌ శ్రీవాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడని ఎస్పీ దీపికా వెల్లడించారు. నిందితుడు విజయనగరంలో 3 కేసులు, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలో మరో 11 కేసులో పాల్గొన్నాడని తెలిపారు. అతడిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వివరించారు.

* హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. డ్రగ్స్‌ సరాఫరా చేస్తున్న ఓ నైజీరియన్‌తోపాటు 12 మందిని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే డ్రగ్స్‌ సేవిస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఎమ్‌డీఎమ్‌ఏ, ఎల్‌ఎస్‌డీ బ్లాట్‌లతో పాటు గంజాయి, హ్యాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఆర్‌ నగర్‌, కార్ఖానా, సికింద్రాబాద్‌లో ముఠాగా ఏర్పడి డ్రగ్స్‌ అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను బషీర్ బాగ్ సీపీ కార్యాలయంలో కమిషనర్ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు

*రూ.7 కోట్ల విలువైన 1.04 కేజీల హెరాయిన్ను అసోం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ తరలింపుకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. అసోంలో 1.04 కేజీల హెరాయిన్ను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాల విలువ రూ.7 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

* పోలవరం లో గోదావరి నదిలోకి దూకిన నవవధువు కాళ్ల పారాణి ఆరకముందే గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న నవవధువు. ఇలా జరగడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మృతదేహం కోసం గోదావరి నదిలో గాలింపు చర్యలు చేపట్టిన పోలవరం ఎస్ఐ ఆర్ శ్రీను

* హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తింటూ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన కమలాపూర్ మండలం శ్రీరాములపల్లిలో జరిగింది. శ్రీరాములపల్లి ప్రభుత్వ పాఠశాలలోని 70 మంది విద్యార్థులు భోజనం తినగా 30 మందికి అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురయిన విద్యార్థులను శ్రీరాములపల్లె పాఠశాల నుంచి 108 ద్వారా స్థానిక కమలాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు

* శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో ఇద్దరు బీ-ఫార్మసీ విద్యార్థులు వైద్యుల అవతారమెత్తారు.ఓ లాడ్జి గదిని ఆపరేషన్ థియేటర్గా చేసుకుని లింగమార్పిడి శస్త్రచికిత్స మొదలుపెట్టారు. ఈ క్రమంలో తీవ్ర రక్త స్రావమై పల్స్ డౌన్ కావడంతో ఓ ట్రాన్స్ జెండర్ మృతి చెందాడు.

* వారంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే… కష్టపడితే కానీ పూట గడవని బతుకులే… కానీ భార్యాబిడ్డలను బాగా చూసుకోవాలని ఆశపడ్డారు. తమ కష్టం పిల్లలు పడకూడదని తాపత్రయపడ్డారు. భవిష్యత్తు అవసరాలను తీర్చుకోవడానికి తపాలా శాఖ పథకాల్లో పొదుపు చేసుకుంటున్నారు. నమ్మిన మనిషే మోసం చేస్తాడని పసిగట్టలేకపోయారు.. తమ ఆశలు ఆడియాశలవుతాయని ఊహించలేదు. ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది.

* మద్యం సీసా.. ఓ యువకుడి ప్రాణం తీసిన ఘటన ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పుర్లో జరిగింది. ఓ వ్యక్తి మద్యం సీసాను చొక్కాలో దాచిపెట్టి సైకిల్పై వెళ్తుండగా.. అకస్మాత్తుగా పడిపోయాడు. దీంతో సీసా పగిలి అతని పొట్టలో గుచ్చుకుంది. సాయం కోసం అరుస్తూ.. ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. దీంతో అక్కడికక్కడే ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

* మనిషి రూపంలో ఉన్న ఓ మృగాడు మూగ జీవిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కర్ణాటకలో జరిగింది. అర్ధరాత్రి వేళ పశువుపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని.. ఆవు యజమాని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు మూగ జీవంపై లైంగిక దాడి చేశాడు. ఈ వికృత ఘటన కర్ణాటక బెంగళూరులో వెలుగుచూసింది. ఈ కేసులో నిందితుడిని పోలీసులు రెడ్వ్యాండెడ్గా పట్టుకున్నారు.

* తాను ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉన్నాడన్న కోపంతో ఓ యువకుడు.. 16 ఏళ్ల బాలుడ్ని కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. తాను ప్రేమించిన యువతితో మరొక యువకుడు చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అతడ్ని కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
* హైదరాబాద్ నగరంలోని భారీగా డ్రగ్స్ పట్టుబడింది. హైదరాబాద్ నార్కోటిక్స్ వింగ్‌ గంజాయితో పాటు డ్రగ్స్‌ ను పట్టుకుంది. డ్రగ్స్‌ కు సంబంధించి నైజీరియన్‌తో పాటు 12 మందిని అరెస్ట్ చేశారు. అలాగే డ్రగ్స్‌ సేవిస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో 13మంది పరారీలో ఉన్నారు. ఎస్‌ఆర్‌ నగర్‌, కార్కానా, సికింద్రాబాద్‌ల్లో ముఠా డ్రగ్స్‌ అమ్ముతున్నట్లు తెలుస్తోంది. సిటీ పరిసరాల్లో గంజాయి, హెరాయిన్‌, ఎమ్‌డీఎమ్మేను ముఠా విక్రయిస్తున్నట్లు హైదరాబాద్ నార్కోటిక్స్ వింగ్‌ తెలిపింది.

* ప్రేమించిన పాపానికి ఏకంగా ఓ యువకుడి కళ్లను లేకుండా చేసిన కిరాతకులు దుర్మార్గం బెంగళూరు నగరం హుళిమావు ప్రాంతంలో చోటుచేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చరణ్‌ అనే యువకుడి రెండు కళ్లకు డ్రాగన్‌తో పొడిచినట్లు పోలీసులు నిర్ధారించారు.

* ఎదురుగా వస్తున్న బస్సును ఓ బైక్‌ వేగంగా ఢీకొట్టింది.. బైక్‌ను తప్పించే క్రమంలో బస్సు ఆటోపైకి దూసుకెళ్లింది. బస్సు ఇంజిన్‌ కిందిభాగంలో బైక్‌ ఇరుక్కొని మంటలు చెలరేగగా, బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మంటల్లో కాలిపోయి ప్రాణాలు వదిలాడు.

* హైద‌రాబాద్ న‌గ‌రంలోని హుస్సేన్ సాగ‌ర్‌లో ఓ వ్య‌క్తి మృత‌దేహం ల‌భ్య‌మైంది. మృత‌దేహాన్ని గ‌మ‌నించిన స్థానికులు రాంగోపాల్ పేట్ పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో పోలీసులు సాగ‌ర తీరానికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని గాంధీ ఆస్ప‌త్రి మార్చురీకి త‌ర‌లించారు. మృతుడిని కాచిగూడ‌కు చెందిన హ‌సిక్‌గా పోలీసులు గుర్తించారు. కుటుంబ క‌ల‌హాల‌తోనే హ‌సిక్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. మృతుడి కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

* రూ. 6.7 కోట్ల విలువ చేసే హెరాయిన్ స్వాధీనం
ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలోని 7 ట్యాంక్స్ లేన్‌లో యాంటీ ఎఫ్ఐసీఎస్ బృందాలు త‌నిఖీలు నిర్వ‌హించాయి. ఈ త‌నిఖీల్లో జార్ఖండ్‌కు చెందిన డ్ర‌గ్ డీల‌ర్ నుంచి భారీగా డ్ర‌గ్స్‌ ను స్వాధీనం చేసుకున్నారు. రూ. 6.7 కోట్ల విలువ చేసే 1.341 కిలోల హెరాయిన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ డ్ర‌గ్స్‌ ను వాహ‌నంలో దాచి ఉంచిన‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఇవాళ కోర్టు ఎదుట హాజ‌రు ప‌ర‌చ‌నున్న‌ట్లు కోల్‌క‌తా పోలీసులు తెలిపారు

*హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీలో మధ్యప్రదేశ్‌ పోలీసుల సోదాలు నిర్వహించారు. కాలర్‌ ఇమ్రాన్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలను కాలర్‌ ఇమ్రాన్‌ ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో భూపాల్‌ ఎంపీ సాద్వి ప్రజ్ఞా ఠాకూర్‌ ఫిర్యాదుతో కాలర్‌ ఇమ్రాన్‌ను పట్టుకునేందుకు సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.

*పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి నదిలో దూకి నవ వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈనెల 20న కరిబండి అనురాధాకు తిరువూరుకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కాగా ఈరోజు ఉదయం అనురాధా గోదావరిలో దూకుతుండగా స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులు, అధికారులు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకుని నవవధువు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా అనురాధ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

*ఎనిమిది మందితో కూడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.50.50లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్‌ అతిథి గృహంలో డీఎస్పీ సుధాకర్‌రెడ్డితో కలిసి డీఐజీ సెంథిల్‌కుమార్‌ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఇటీవల హౌస్‌ బ్రేకింగ్‌, చైన్‌స్నాచింగ్‌లతోపాటు బస్సులు, బస్టాండ్లలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. వీటిపై డీఐజీ ప్రత్యేక దృష్టి సారించారు. దొంగలను పట్టుకోవడానికి చిత్తూరు తాలూకా సీఐ బాలయ్య ఒకటో పట్టణ సీఐ నరసింహరాజు, పాకాల సీఐ ఆశీర్వాదం ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

*కాంచీపురం సమీపంలో శుక్రవారం ఉదయం డీఎంకే నాయకుడిని గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు వేట కొడవళ్లతో దాడి జరిపి దారుణంగా హత్య చేశారు. కాంచీపురం సమీపం కోనేరికుప్పంలో శేఖర్‌ శైలజ అనే భార్యా భర్తలు నివసిస్తున్నారు

*చెట్టంత కొడుకు చనిపోయాడనే బాధ లేదా వ్యక్తికి. సరికదా.. భర్త లేని బాధలో ఉన్న కోడలిని కన్నకూతురిలా చూసుకోవాల్సింది పోయి ఆమెపై మోజు పడ్డాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమెను వేధింపులకు గురిచేశాడు. మాట వినడం లేదనే ఆగ్రహంతో ఆమెపై హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం రైల్వే కాలననీ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్వయాన తన సోదరి కూతురును ఇంటి కోడలిగా చేసుకోవాలనుకున్నాడు. ఆమెను తన కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అనారోగ్యంతో ఇటీవల కుమారుడు మృతిచెందాడు. కొన్నాళ్లుగా తనను పెళ్లి చేసుకోవాలని కోడలిపై ఒత్తిడి తెస్తున్నాడు. ఈ విషయంపై కుటుంబంలో మంగళవారం ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన మామ కోడలిని కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. బాధితురాలి తల్లి అడ్డుగా వెళ్లింది. దాంతో ఆమెకు రెండు చోట్ల కత్తిపోట్లు తగిలాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోడలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

*నల్లగొండ జిల్లాలో కూలిన ట్రైనీ హెలికాప్టర్‌
నల్లగొండ జిల్లాలో ట్రైనీ హెలికాఫ్టర్ ఒకటి కూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్‌లో ఉన్న పైలెట్, కో పైలెట్ ఇద్దరూ మృతి చెందారు. మృతుల్లో ఒకరు మహిళ. పెద్దవూర మండలం తుంగతుర్తి దగ్గర ఈ చాపర్ కూలింది. ఘటనాస్థలానికి పోలీసు, రెవెన్యూ, వైద్య సిబ్బంది చేరుకున్నారు. చాపర్‌.. ప్లైటెక్‌ ఏవియేషన్‌ అకాడమీకి చెందినదిగా గుర్తించారు. దట్టమైన పొగతో ఒక్కసారిగా ట్రైనీ చాపర్‌ కుప్పకూలింది. నాగార్జున సాగర్‌ పరిసర ప్రాంతాల్లో ఈ ట్రైనింగ్‌ జరుగుతోంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.

*మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నెలో దారుణం జరిగింది. మామపై అల్లుడు కర్రతో దాడి చేసి హత్య చేశాడు. అత్తతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో అల్లుడిని మామ చెన్నబోయిన వెంకన్న నిలదీశాడు. దీంతో అక్రమబంధానికి అడ్డుగా ఉన్నాడని మామను అల్లుడు యాకయ్య కర్రతో కొట్టి గొంతు నులిమి చంపేశాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. 15 వ కార్ప్స్ ఛత్తీస్గఢ్ ఆర్మీ బలగానికి చెందిన కానిస్టేబుల్ కుడియం అర్జున్ను గురువారం రాత్రి హత్య చేసి మృతదేహాన్ని గంగలూరు-మడకంపర(రెడ్డి మార్గ్) ప్రాంతంలో పడేసి.. మృతదేహంపై పోస్టర్లను వదిలారు. 2018 నుంచి పోలీసు ఇన్ఫార్మరుగా పనిచేస్తున్నాడంటూ పేర్కొన్నారు. అర్జున్ మెడికల్ లీవుపై స్వగ్రామమైన ధనోరాకు రాగా హత్య చేశారు. అయితే ఈ హత్యకు గంగలూరు ఏరియా కమిటీ భాద్యత వహిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

*గుట్టుచప్పుడు కాకుండా మత్తుపదార్థాలను విక్రయించేందుకు వాటిని నిల్వ చేసుకున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎక్సైజ్ సీఐ మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం… ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసుస్టేషన్ పరిధి బోడుప్పల్ కార్పోరేషన్ బుద్దానగర్కు చెందిన అనురాగ్ పశాంత్రనడే తన ఇంట్లో మత్తుపదార్థాలు కలిగి ఉన్నాడనే పక్కా సమాచారంతో ఎక్సైజ్, ఎస్వోటీ పోలీసులు దాడిచేశారు. ఈ దాడిలో ఎల్.ఎ్స.డీ రెండు కవర్లు, ఎండీఎంఏ 4 ప్యాకెట్ల మత్తుపదార్థాలు లభించాయి. మత్తుపదార్థాలతో పాటు సెల్ఫోన్ను స్వాధీనం చేసుకొని మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. కాగా, నిందితుడు ఈ మత్తుపదార్థాలను సెలబ్రిటీలకు విక్రయించేవాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు.