కేంద్రం ఇమ్మిగ్రేషన్ వీసా ఫారినర్స్ రిజిస్ట్రేషన్ ట్రాకింగ్ ( ఐవీఎస్ఆర్టీ ) పథకాన్ని మరో అయిదేళ్లపాటు పొడిగించిది. 2026 మార్చి 31 దాకా ఇది వర్తిస్తుంది . ఇందుగ్గాను రూ .1,364.88 కోట్ల ఆర్థికవ్యయం అంచనా వేశారు. ఈ పథకం ఇమ్మిగ్రేషన్ వీసా జారీ, విదేశీయుల నమోదు, భారత్లో వారి కదలికలను కనిపెట్టడానికి సంబంధించిన విధుల అనుసంధానం, సానుకూలతకు ప్రయత్నిస్తుంది. ఇమ్మిగ్రేషన్ వీసా సేవల ఆధునికీకరణ, మెరుగుదల విషయంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ పథకం పొడిగింపు సూచిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాజెక్టు ప్రపంచవ్యాప్త నెట్వర్కుతో పనిచేస్తుంది. ఐవీఎఫ్తార్టీ పథకం అమలులోకి వచ్చాక వీసాల జారీ పెరగడమే కాకుండా.. అంతకుమునుపు 15 నుంచి 30 రోజుల సమయం పడుతుండగా, ఇపుడు కేవలం మూడు రోజుల్లోపే ఈ వీసాలు జారీ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. భారత్ నుంచి అంతర్జాతీయ రాకపోకలు కూడా గత పదేళ్లలో 3.71 కోట్ల నుంచి 7.5 కోట్లకు పెరిగినట్లు వివరించింది.