NRI-NRT

FLASH: రాజంపేటలో వేమన సతీష్ అరెస్టు

FLASH: రాజంపేటలో వేమన సతీష్ అరెస్టు

రాజంపేటను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో శనివారం రాజంపేట సరిహద్దు వెంకట్రాజంపేట నుండి కడప వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. కాగా.. 144 సెక్షన్ పేరుతో పోలీసులు పాదయాత్రను అడ్డుకున్నారు. ప్రముఖ ప్రవాసాంద్రుడు తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్ తన స్వస్థలం రాజంపేటలో జరుపుతున్న ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. జేఏసీ కన్వినర్, తెదేపా నేత చంగల్ నాయుడు తదితరులతో కలిసి ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేమన సతీష్ తో పాటు ఆందోళన చేస్తున్న ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రానికి విడుదల చేశారు. రాజంపేటను జిల్లా కేంద్రం గా ప్రకటించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఈ సందర్భంగా వేమన సతీష్ తదితరులు ప్రకటించారు.
Whats-App-Image-2022-02-26-at-18-51-30-2
Whats-App-Image-2022-02-26-at-18-51-30-3
Whats-App-Image-2022-02-26-at-18-51-30-4
Whats-App-Image-2022-02-26-at-18-51-30-5
Whats-App-Image-2022-02-26-at-18-51-30-6
Whats-App-Image-2022-02-26-at-18-51-30-7
Whats-App-Image-2022-02-26-at-18-51-30