DailyDose

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పై TNI కథనాలు 26/2/2022

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పై TNI కథనాలు 26/2/2022

1. భారత్‌ను అవమానించిన అమెరికా అధికారికి అదిరిపోయే కౌంటర్!
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రపంచ దేశాలు తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో దీనిపై ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్‌లో భారత మద్దతు కోరుతున్నట్లు అంతకుముందే రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే భారత్ మాత్రం ఈ ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీనిపై అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అమెరికా విదేశీ వ్యవహారాల కౌన్సిల్ అధ్యక్షుడు రిచర్డ్ హాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుతిన్‌కు భారత్ భయపడిందంటూ అవమానించాడు.‘‘రష్యా ఇలా బహిరంగంగా ఉక్రెయిన్ ఆక్రమణకు దిగింది. అయినా సరే భారత్ మాత్రం జాగ్రత్తగా ఉంది. పుతిన్‌కు కోపం తెప్పించకూడదనే భారత దేశం ఓటింగ్‌లో పాల్గొనలేదు. అంటే పెద్ద దేశాలకు ఉండే బాధ్యతలు నిర్వహించే సత్తా, ఆధారపడదగ్గ భాగస్వామిగా ఉండటానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి భారత్ సిద్ధంగా లేదనడానికి ఇదే నిదర్శనం. చైనా ఎదుగుదల కోణంలో చూసుకున్నా కూడా ఇది ముందు చూపు లేని నిర్ణయమే’’ అంటూ రిచర్డ్ విమర్శించారు.దీనిపై జోహో సీఈవో శ్రీధర్ వేంబు స్పందించారు. ‘‘మిస్టర్ హాస్.. మీరు ఆఫ్ఘనిస్థాన్, ఉక్రెయిన్‌లో మీ విదేశీ పాలసీల వైఫల్యాలను పట్టించుకోకుండా, మీకు మద్దతు పలకలేదని భారత్‌ను విమర్శించాలని అనుకుంటున్నారా? ఉక్రెయిన్‌కు మీరు అండగా ఉన్నామనే భ్రమ కల్పించింది మీ ప్రభుత్వం. అవసరమైన సమయంలో చేతులెత్తేసింది కూడా మీరే. ఇప్పుడు భారత్‌పై పడి ఏడుస్తారే?’’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Whats-App-Image-2022-02-26-at-14-58-59
3. ర‌ష్యా సైనిక వాహ‌నాల‌పై ‘జెడ్’ (Z) గుర్తు ఎందుకు ఉందో తెలుసా?
ఉక్రెయిన్ మీద ర‌ష్యా సైనిక చ‌ర్య రెండో రోజూ కొన‌సాగుతోంది. ప‌లు న‌గ‌రాలు, మిల‌ట‌రీ బేస్‌ల‌పై ర‌ష్యా వైమానిక దాడులు కొన‌సాగుతున్నాయి. దీంతో వేలాది మంది పౌరులు అండ‌ర్ గ్రౌండ్‌లో దాక్కుండిపోయారు. తాజాగా… ఉక్రెయిన్‌లోని రెసిడెన్షియ‌ల్ హైరైజ్ అపార్ట్‌మెంట్‌పై ర‌ష్యా మిసైల్ దూసుకొచ్చింద‌ని పేర్కొంటున్నారు. అయితే.. ర‌ష్యాకు చెందిన ప‌లు సైనిక వాహ‌నాల‌పై z గుర్తు ఉండ‌టం అంద‌ర్నీ ఆక‌ర్షిస్తోంది.ఓ వాహ‌నంపై ఈ z గుర్తు ఓ స్థ‌లంలో ఓ ఆకారంలో, మ‌రో వాహ‌నంపై ఇదే గుర్తు మ‌రో ఆకారం, మ‌రో స్థ‌లంలో క‌నిపిస్తోంది. కానీ… z గుర్తు అన్ని వాహ‌నాల‌కూ క‌నిపిస్తోంది. ఇదో ర‌క‌మైన ఎర్ర‌జెండా లాంటిద‌ట‌. వీటిని రోజ్గావార్డియా ట్రూప్స్ అని పిలుస్తుంటారు. రష్యా జాతీయ భ‌ద్ర‌తా ద‌ళం అని కూడా అంటుంటారు. వీరంద‌రూ ఖైదీల‌ను తీసుకెళ్లే ఎవ్‌టోజాక్స్ వాహ‌నాల్లో వీరంద‌రూ వెళ్తున్నారు. బెల్గోరోడ్ ప్రాంతంలోని ఈ వాహ‌నాల‌ను ఎప్పుడూ ఈ జెడ్ గుర్తును క‌లిగే వుంటాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు.అయితే ర‌ష్యా జాతీయ భ‌ద్ర‌తా ద‌ళాలు వాడే వాహ‌నాల‌పైనే ఈ జెడ్ (z) గుర్తు వుంటుంద‌ని, దీనిని బ‌ట్టి, ర‌ష్యా వీరిని కూడా రంగంలోకి దింపింద‌ని అర్థం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రోజ్గా వార్డియా ట్రూప్స్ (ర‌ష్యా జాతీయ భ‌ద్ర‌తా ద‌ళం) ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ భ‌ద్ర‌తా వ్య‌వ‌హారాల‌ను మాత్ర‌మే చూస్తుంది. వీంద‌రూ మెరిక‌ల్లాంటి జ‌వాన్ల‌ని, ఆర్మ్‌డ్ ఫోర్స్ కంటే మెరిక‌ల్లా విధులు నిర్వ‌ర్తిస్తార‌ని తెలుస్తోంది. ఏ ప్ర‌దేశంలోనైనా చొర‌బ‌డి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే శ‌క్తి ఈ బ‌ల‌గాల‌కు ఉంటుంద‌ని, వీరికి అంత సుశిక్షితంగా ట్రైనింగ్ ఇస్తార‌ని నిపుణులు పేర్కొంటున్నారు.అయితే ఇంకో వాద‌న కూడా ఉంది. ర‌ష్యా సైనికులే ర‌ష్యా సైనికుల వాహ‌నాల‌పై కాల్పులు జ‌ర‌ప‌కుండా ఈ జెడ్ (z) గుర్తును వాడుతున్నార‌ని పేర్కొంటున్నారు. ఇదో ర‌క‌మైన క‌మ్యూనికేష‌న్ సిగ్న‌ల్స్ అని పేర్కొంటున్నారు. ఇక‌… కేవ‌లం యుద్ధాల్లోనే వీటిని ఉప‌యోగిస్తారు అన్న మెసేజ్ కూడా ఇందులో ఉంటుంద‌ట‌. అధికారుల‌కు కూడా సుల‌భంగానే యుద్ధానికి ఉప‌యోగించే వాహ‌న‌మేదో తెలిసిపోడానికి జెడ్ (z) అక్ష‌రం రాస్తార‌ట‌.
Whats-App-Image-2022-02-26-at-14-58-59-1
2. క్రెయిన్ అణ్వాయుధాలు ఏమయ్యాయి?
1991లో సోవియెట్ యూనియన్ పతనమైన తర్వాత ఆ దేశానికి సంబంధించిన అణ్వాయుధాలన్నీ బెలారస్, కజకస్తాన్, ఉక్రెయిన్లో ఉండేవి. అందులోనూ ఉక్రెయిన్ అతి పెద్ద అణు భాండాగారంగా నిలిచింది. ప్రపంచంలోనే అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్న మూడో దేశంగా అవతరించింది. సైనిక స్థావరాలను ధ్వంసం చేసే సామర్థ్యం కలిగిన 3 వేలకు పైగా టాక్టికల్ అణ్వాయుధాలు, యుద్ధ నౌకలు, సాయుధ వాహనాలు, నగరాలను లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేసే అణ్వాయుధాలు ఉక్రెయిన్ దగ్గరే ఉండేవి. వీటిలో ఎస్ఎస్–19, ఎస్ఎస్–24 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు 176 వరకు ఉంటే, మరో వెయ్యి వరకు గగన తలం మీదుగా దాడి చేసే క్షిపణి వ్యవస్థలన్నీ ఉక్రెయిన్ దగ్గరే ఉన్నాయి.60 వరకు టీయూ–22 బాంబర్లు కూడా ఉండేవి. ఆ తర్వాత కాలంలో అతి పెద్ద ఆయుధాగారాన్ని నిర్వహించే ఆర్థిక శక్తి లేక ఉక్రెయిన్ అల్లాడిపోయింది. అంతే కాకుండా ఆ అణ్వాయుధాలను వాడడానికి అవసరమైన కేంద్రీకృత ఫైరింగ్ కంట్రోల్స్ అన్నీ రష్యా రాజధాని మాస్కోలో ఉన్నాయి. దీంతో అమెరికా సహా ఇతర పశ్చిమ దేశాలకు ఉక్రెయిన్ అణ్వాయుధాలు ఒక తలనొప్పిగా మారాయి. చర్చోపచర్చల తర్వాత ఆ ఆయుధాలను నాశనం చేయడానికి వీలుగా 1994లో రష్యా, యూకే, అమెరికాలతో ఉక్రెయిన్ బుడాపెస్ట్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆయుధాలను విధ్వంసం చేసినప్పటికీ ఆ దేశ స్వాతంత్య్రం, సార్వభౌమత్వాన్ని గుర్తిస్తామని అమెరికా, యూకే, రష్యాలు హామీ ఇచ్చాయి. దీంతో ఎన్నో వార్హెడ్లు, ఇతర క్షిపణుల్ని ధ్వంసం చేసింది. టీయూ–160 బాంబర్లు, ఇతర అణుసామాగ్రిని రష్యాతో వస్తుమార్పిడి విధానం కుదుర్చుకొని ఆ దేశానికి బదలాయించింది. బదులుగా రష్యా చమురు, గ్యాస్లను సరఫరా చేసింది. 2001 మేలో చివరి యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. అంతర్జాతీయ ఆయుధ నియంత్రణ అసోసియేషన్ నివేదిక ప్రకారం ఉక్రెయిన్ 11టీయూ–160 వ్యూహాత్మక బాంబులు, 27 వ్యూహాత్మక టీయూ–95 బాంబులు, 483 కేహెచ్–55 గగన తలం మీదుగా ప్రయోగించే క్రూయిజ్ క్షిపణుల్ని ధ్వంసం చేసిందని, మరో 11 భారీ బాంబులు 582 వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణుల్ని రష్యాకు అప్పగించిందని వెల్లడించింది
Whats-App-Image-2022-02-26-at-14-58-58-1
3. చిక్కుకుపోయిన భారత పౌరులు సరిహద్దులకు వెళ్లవద్దు
ఉక్రెయిన్ దేశంపై రష్యా మిలటరీ దండయాత్ర నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులకు భారత రాయబార కార్యాలయం తాజా సలహా జారీ చేసింది. ఉక్రెయిన్ దేశంలోని భారతీయ పౌరులందరూ ప్రభుత్వ అధికారులతో ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లవద్దని భారత రాయబార కార్యాలయం కోరింది. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పరిస్థితి సున్నితంగా ఉందని, పౌరులను స్వదేశానికి తరలించేందుకు పొరుగుదేశాలతో భారతీయ రాయబార కార్యాలయం నిరంతరం యత్నిస్తుందని అధికారులు చెప్పారు. ఉక్రెయిన్ దేశంలోని భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.హంగేరీ, రొమేనియా, పోలాండ్‌లకు భారతీయ విద్యార్థులను తరలించి అక్కడి నుంచి న్యూఢిల్లీకి తీసుకువచ్చేందుకు పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఎల్వివ్, చెర్నివ్ట్సీ పట్టణాల్లో క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేశారు. ఉక్రెయిన్ నుంచి తమ జాతీయుల నిష్క్రమణను సమన్వయం చేయడానికి భారతదేశం హంగేరీలోని జహోనీ సరిహద్దు పోస్ట్, క్రాకోవిక్, పోలాండ్‌లోని షెహిని-మెడికా ల్యాండ్ సరిహద్దు పాయింట్లు, స్లోవాక్ రిపబ్లిక్‌లోని వైస్నే నెమెకే, రొమేనియాలోని సుసెవా ట్రాన్సిట్ పాయింట్‌లలో అధికారుల బృందాలను ఏర్పాటు చేసింది.ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలో ఉన్న భారతీయులు ప్రస్తుతం వారుంటున్న నివాస స్థలాల్లోనే ఉండాలని వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలనీ లేదా షెల్టర్‌లలో ఉండాలని రాయబార కార్యాలయం సూచించింది.
Whats-App-Image-2022-02-26-at-14-58-58
4. ఒంటరిగా వదిలేశారు : ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆవేదన
రష్యా పెద్ద ఎత్తున విరుచుకుపడుతూ ఉంటే ప్రపంచం తమను ఒంటరిగా వదిలేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.రష్యాతో పోరాడి, తమ దేశాన్ని కాపాడుకునే బాధ్యతను కేవలం తమపైనే పెట్టిందని వాపోయారు. గురువారం ఉదయం ప్రారంభమైన యుద్ధంలో దాదాపు 137 మంది ఉక్రెయిన్ సైనికులు, సాధారణ ప్రజలు మరణించిన నేపథ్యంలో శుక్రవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.”మన దేశాన్ని కాపాడుకోవడానికి మనల్ని ఒంటరిగా వదిలేశారు” అని వోలోడిమిర్ ఉక్రెయిన్ ప్రజలకు చెప్పారు. మన పక్షాన నిలబడి పోరాడటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు. తమ పక్షాన నిలబడి పోరాడటానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నట్లు తనకు కనిపించడం లేదన్నారు. ఉక్రెయిన్‌కు NATO సభ్యత్వంపై హామీ ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారని ప్రశ్నిస్తూ, ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 137 మంది ఉక్రెయినియన్లు ప్రాణాలు కోల్పోయారని, వీరిలో సైనికులు, సామాన్య ప్రజలు ఉన్నారని చెప్పారు. 316 మంది గాయపడినట్లు తెలిపారు.
Whats-App-Image-2022-02-26-at-14-58-57
5. 0ఉక్రెయిన్ పై దాడిని తక్షణమే ఆపాలి: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి
ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడుల నేపథ్యంలో మూడో రోజు యుద్ధం ఆపాలని, దళాలను ఉపసంహరించుకోవాలని ఐక్యరాజ్యసమితి కోరింది. మరో వైపు రష్యా వైమానిక దాడుల హెచ్చరికలతో తాను కైవ్‌ నగరంలోనే ఉంటానని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు.80ఏళ్ల వృద్ధుడు సైతం ఉక్రెయిన్ సైన్యంలో చేరి పోరాట స్ఫూర్తి నింపారు. ఉక్రెయిన్-రష్యా వార్ అప్ డేట్స్ ఇలా ఉన్నాయి……కీవ్: పలు ఉక్రేనియన్ నగరాల్లో రష్యా వైమానిక దాడుల హెచ్చరికలతో తాను కైవ్‌ నగరంలోనే ఉంటానని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు.ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్‌లోని కైవ్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.మాస్కో ఉక్రెయిన్‌పై దాడిని తక్షణమే ఆపివేయాలని రష్యా దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాన్ని వీటో చేసింది. యునైటెడ్ స్టేట్స్, దాని మద్దతుదారులకు ఓటమి అనివార్యమని తెలిసినా, రష్యా దేశాన్ని ప్రపంచంలో ఒంటరి చేయాలని చూస్తోంది. శుక్రవారం జరిగిన ఓటింగ్ అనుకూలంగా 11 దేశాలు ఓటు చేశాయి. రష్యా ఓటు వేయలేదు. చైనా, భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గైర్హాజరయ్యాయి.ఉక్రెయిన్‌పై దాడులను తక్షణమే నిలిపివేయాలని రష్యా చట్టసభ సభ్యులు పిలుపునిచ్చారు.రష్యా చట్టసభ సభ్యుడు మిఖాయిల్ మాట్వీవ్ ఉక్రెయిన్‌పై దాడులను వెంటనే నిలిపివేయాలని కోరారు
zelenskybiden
6. ఈ యుద్ధం ఎందుకు జరిగెనో…!
బాంబుల మోతతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌-రష్యా పరిణామాలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఈ భయానక పరిణామాలకు కారణం రష్యా భద్రతా సమస్యా? లేక అమెరికా ప్రపంచాధిపత్య వ్యామోహమా? అన్నది అటుంచితే బలైపోతున్నది మాత్రం ఉక్రెయిన్‌ ప్రజలే. ”మా దేశాన్ని కాపాడుకునే విషయంలో మేం ఒంటరిగా మిగిలిపోయాం. మాతో కలిసి పోరాడేందుకు ఎవరున్నారు? నాకైతే ఎవరూ కనిపించడం లేదు” అంటున్న ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఉక్రెయిన్‌ కోసం నాటో బలగాలను పంపే ఆలోచనే తమకు లేదని నాటో చీఫ్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ ప్రకటించారు. ఇప్పటికే రష్యా దాడులతో చాలా ప్రాంతాల్లో విధ్వంసానికి గురైన ఆ అమెరికా మిత్రదేశానికి ఈ ప్రకటన పెద్ద షాకే ఇచ్చింది. అమెరికా నాయకత్వంలోని నాటో బలగాలపై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయిపోగా, చివరికి నాటోను నమ్మి నట్టేట మునిగినట్టయింది ఉక్రెయిన్‌ పరిస్థితి.
*అండగా నిలుస్తాయనుకున్న అమెరికా సహా పశ్చిమదేశాలన్నీ సానుభూతి ప్రకటనలకే పరిమితమైపోవడంతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు అసహనంతో రగిలిపోతున్నారు. ”అంత్యంత శక్తివంతమైన దేశం కేవలం దూరం నుంచి చూస్తూ ఉంది” అంటూ పరోక్షంగా అమెరికాపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అసలు తమను నాటోలో భాగస్వాములు కావాలంటు ఎవరు ముందుకొచ్చారంటూ నాటో దేశాలపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. దీనిని బట్టి ఈ పరిణామాలకు కారణాలేమిటో, ఎవరి ప్రయోజనాలకు ఎవరు బలవుతున్నారో కొంత అర్థం చేసుకోవచ్చు. నేటి ఈ ఉక్రెయిన్‌-రష్యాల వివాదానికీ నాటో కూటమికీ సంబంధమేటో తెలియాలంటే కొంచెం చరిత్రలోకి వెళ్లాల్సి ఉంటుంది.
* నాటో… అంటే నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌. 1949లో అమెరికా నేతృత్వంలో కెనడా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ సహా 12 దేశాలతో ఏర్పాటయింది. ఈ కూటమిలోని దేశాలపై మరేదేశం యుద్ధానికి దిగినా ఒకరికొకరు అండగా సైనిక సహకారం అందించుకోవాలన్నది దీనికి భూమిక. సభ్యదేశాల్లో దేనిపై దాడి జరిగినా తమపై జరిగినట్టుగానే భావించాలన్నది ఒప్పందం. ఇది పైకి పరస్పర సహకారం కోసం, ఆత్మరక్షణార్థం ఏర్పడిన సైనిక కూటమిగా కనిపించినా… దీని అసలు లక్ష్యం అది కాదని దాని చరిత్ర, విస్తరణ చూస్తే అర్థమవుతుంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపాలో నాటి సోవియట్‌ యూనియన్‌ ప్రభావాన్ని అడ్డుకోవడం, ప్రపంచాధిపత్యాన్ని సాధించడమే దాని అసలు లక్ష్యమన్నది చరిత్ర చెపుతున్న సత్యం. అయితే దీనికి ప్రతిగా నాటి సోవియట్‌ రష్యా తూర్పు ఐరోపాలోని కమ్యూనిస్టు దేశాలతో ఏర్పాటు చేసిన ”వార్సా” కూటమి నాటో ఆటలు సాగనివ్వలేదు. కానీ 1991లో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం తరువాత వార్సా కూటమి నిర్వీర్యమైంది. ఆ తరువాత నాటి తూర్పు ఐరోపా దేశాలను కలుపుకుని అమెరికా తన నాటో కూటమిని 30 దేశాలకు విస్తరించింది. ఇందులో మాజీ సోవియట్‌ యూనియన్‌ నుండి చీలిన దేశాలు కూడా కొన్ని చేరిపోయాయి. ఇది తమ దేశ భద్రతకు ప్రమాదమని భావించిన రష్యా మొదటి నుండీ ప్రపంచ వేదికలపై గట్టిగా వ్యతిరేకిస్తోంది. దీనితో తూర్పు దిశగా తమ వ్యాప్తి ఉండదని రెండు దశాబ్దాల క్రితమే నాటో హామీ ఇచ్చింది. ఆ మేరకు నాటోలో చేరిన తూర్పు యూరప్‌ దేశాల నుండి మీ బలగాలను, ఆయుధ సంపత్తిని వెనక్కి తీసుకోవాలని సుదీర్ఘకాలంగా రష్యా కోరుతోంది. అయినా పట్టించుకోకపోగా ఇప్పుడు రష్యా సరిహద్దుల్లో ఉన్న ఉక్రెయిన్‌ను కూడా నాటోలో చేర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేయడమే నేటి ఈ యుద్ధ సంక్షోభానికి ప్రధాన కారణం.
*ఈ మొత్తం పరిణామాల్లో అమెరికాకు పావుగా వ్యవహరించిన ఫలితాన్ని నేడు ఉక్రెయిన్‌ అనుభవిస్తోంది. అమెరికాకు తన ప్రయోజనమే తప్ప ప్రపంచ ప్రయోజనాలు పట్టవని ఇది మరోసారి నిరూపిస్తోంది. అలాగని రష్యానూ సమర్థించలేం. కారణాలేమైనప్పటికీ ఏ దేశమూ మరో దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయకూడదు. సమస్య ఎలాంటిదైనా శాంతియుతంగా దౌత్య మార్గంలో పరిష్కరించుకోవాలేగానీ, యుద్ధమెప్పుడూ న్యాయమైనది కాదు. ఎందుకంటే… అది మొదట బలితీసుకునేది సాధారణ సైనికుల్నీ, అమాయక ప్రజల్నే. అది మిగిల్చే విషాదం అంతులేనిది. కాకపోతే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు మొదలు బ్రిటన్‌ ప్రధాని దాకా అందరూ దౌత్య ప్రయత్నాలకు వెచ్చించాల్సిన సమయాన్ని కూడా ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికే వాడుకోవడం అమానవీయం. వారు కనీసం రష్యా కోరుతున్నట్టు ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వబోమని స్పష్టమైన హామీ ఇవ్వగలిగినా పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. అయినా ప్రజల ఆశలూ, ఆకాంక్షలతో సంబంధంలేని ఈ ఆధిపత్య ధోరణులలో న్యాయాన్యాయాలకు చోటెక్కడిది..?
Whats-App-Image-2022-02-26-at-14-58-56
7. ఉక్రెయిన్‌పై య‌ద్ధోన్మాదంతో పేట్రేగిపోతున్న ర‌ష్యా.. త‌న‌ను నిలువ‌రించేందుకు య‌త్నిస్తున్న దేశాల‌ను త‌న‌దైన శైలి హెచ్చ‌రిక‌ల‌తో బెదిరిస్తోంది. త‌న‌పై ఆంక్ష‌లు విధిస్తే.. ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేస్ సెంట‌ర్‌ను కూల్చేస్తామ‌ని ర‌ష్యా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ర‌ష్యా స్పేస్ డైరెక్ట‌ర్ ఈ భీతావ‌హ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు ఉక్రెయిన్‌తో ఉన్న స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చ‌ల‌తోనే ప‌రిష్క‌రించుకోవాల‌ని ఐక్య‌రాజ్య స‌మితి స‌హా చాలా దేశాలు ర‌ష్యాకు చెప్పాయి. అయితే ఏ దేశం మాట కూడా లెక్క‌పెట్ట‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధానికి తెగ‌బ‌డ్డారు. ఈ క్ర‌మంలో అమెరికా, నాటో దేశాలు ర‌ష్యాపై ప‌లు ఆంక్ష‌ల‌ను విధించాయి. తాజాగా శుక్ర‌వారం నాడు రష్యాపై అమెరికా సైబ‌ర్ దాడుల‌కు దిగింది. పుతిన్ ఆస్తుల‌ను ఫ్రీజ్ చేస్తామంటూ యూరోపియ‌న్ యూనియ‌న్ హెచ్చ‌రించింది
Whats-App-Image-2022-02-26-at-14-58-57-1
8. వణుకుతున్న ప్రాణాలు.. బాంబుల మోతలు.. ఎముకలు కొరికే చలి
కట్టుబట్టలతో బంకర్లు, అండర్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్లలో తెలుగు విద్యార్థులు
ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలోని ఖార్కీవ్‌ నగరంలో గడ్డకట్టే చలితో పాటు బాంబుల మోత తెలుగు విద్యార్థులను వణికిస్తోంది. గురువారం ఉష్ణోగ్రత మైనస్‌ 2 డిగ్రీలు ఉండగా శుక్రవారం ఒక్కసారిగా మైనస్‌ 6 డిగ్రీలకు పడిపోయింది. ఒకవైపు దట్టమైన మంచు కురుస్తుంటే.. మరోవైపు మిసైల్‌ దాడులతో నగరం అగ్నిగుండంగా మారింది. కళ్లముందు పేలుతున్న బాంబులను చూస్తూ.. ఎముకలు కొరికే చలికి వణుకుతూ తెలుగు విద్యార్థులు కట్టుబట్టలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బంకర్లు, అండర్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. కనీసం కప్పుకోవడానికి బ్లాంకెట్స్‌ లేని దయనీయ స్థితిలో రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తెచ్చుకున్న ఆహారం అయిపోతే ఆకలితో చావడం తప్ప వేరే గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Whats-App-Image-2022-02-26-at-14-58-55
9. Ukraine లో జీవన వ్యయం ఇంత తక్కువా.. ఓ విద్యార్థి ఆ దేశంలో ఉండేందుకు నెలకు ఎంత ఖర్చవుతుందంటే.. ప్రస్తుతం రష్యా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్‌.. పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు నెలవు. దీంతో భారీ సంఖ్యలో విదేశీ విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తుంటారు. ఇక ఇక్కడ ఇలా భారీగా అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం రావడానికి పలు కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకొవాల్సింది జీవన వ్యయం. అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలతో పోల్చుకుంటే ఉక్రెయిన్‌లో లివింగ్ కాస్ట్ చాలా తక్కువ అనడంలో ఎలాంటి సందేహం లేదు. యూరోప్‌లోనే అత్యంత చౌకైన స్టూడెంట్ జీవన వ్యయం గల దేశం ఉక్రెయినే. దాంతో ఆటోమెటిక్ ఇతర దేశాలకు చెందిన విద్యార్థులకు ఉక్రెయిన్ మొదటి ఛాయిస్‌గా మారుతుంది. అలాగే సాంకేతిక, వైద్య విద్య కోర్సులను అక్కడి స్థానిక భాషలతో పాటు ఇంగ్లీష్‌లో కూడా బోధన ఉండడం మరో కారణం. దీంతో పాటు కోర్సులకు సంబంధించిన ఫీజులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందుకే చాలా తక్కువ వ్యయంతో ఉన్నత చదువులు పూర్తి చేసుకోవచ్చనే కారణంతో విదేశీ విద్యార్థులు ఉక్రెయిన్‌కు క్యూకడుతుంటారు.
***ప్రధానంగా భారత విద్యార్థులు ప్రతియేటా వైద్య విద్య కోసం వేల సంఖ్యలో ఉక్రెయిన్‌కు వెళ్తుంటారు. ఎందుకంటే మన దగ్గర నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికే వైద్య సీటు దొరుకుతుంది. ఆ సీట్లు పరిమిత సంఖ్యలో ఉంటాయి. ఇక ఎంట్రన్స్ రాసేవారు భారీ సంఖ్యలో ఉంటారు కనుక ఆటోమెటిక్‌గా కాంపీటేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే కోర్సుల ఫీజులు కూడా భారీగానే ఉంటాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఉక్రెయిన్‌లో ఓ విద్యార్థికి వారు అభ్యసించే కోర్సును బట్టి నెలకు రూ. 22,230 నుంచి రూ. 29,640 వరకు ఖర్చు అవుతుందని సమాచారం. దీంట్లో వసతి, పుస్తకాలు, యూటిలిటీ బిల్స్, ఇతర ఖర్చులు కలిపి ఉంటాయి. ఇక జీవన వ్యయం అనేది ఆ దేశంలోని నగరాలను బట్టి కూడా మారుతోంది. పెద్ద నగరాలైన ఒడెస్సా, కీవ్‌లో జీవన వ్యయం చాలా అధికం. అదే చిన్న నగరాలైన ఖార్కీవ్, సుమీలలో చాలా తక్కువ. అసలు ఉక్రెయిన్‌లో జీవన వ్యయం ఎంత ఉంటుంది? ఓ విద్యార్థి ఆ దేశంలో ఉండేందుకు నెలకు ఎంత ఖర్చవుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాం. మొదట ఉక్రెయిన్‌లో సగటు జీవన వ్యయంపై ఓ లుక్కేద్దాం..ఆహారానికి ఒక విద్యార్థికి నెలకు రూ. 10,380 ఖర్చు అవుతుంది. అంటే ఏడాదికి రూ. 1,24,560. అదే అద్దె నెలకు కనీసం రూ. 16,088 అవుతుందంటే సంవత్సరానికి రూ. 1,93,054. ఇక ఎలక్ట్రిసిటీ, గ్యాస్‌కు నెలకు రూ. 1,112 అవుతుంది. అంటే ఏడాదికి రూ. 13,350 అన్నమాట. మంచి నీటి కోసం నెలకు 1,320 అవుతుంది. సంవత్సరానికి రూ.15,840. బుక్స్ కోసం నెలకు రూ. 147 అయితే, ఏడాది రూ.588. టీవీ కెబుల్‌కు నెలకు రూ.380 వేసుకుంటే ఏడాదికి 4,450. రవాణాకు నెలకు రూ.750 అవుతుందంటే సంవత్సరానికి రూ. 8,900 అవుతుంది.
*ఉక్రెయిన్‌లో కోర్సును బట్టి సగటు ట్యూషన్ ఫీజు..ఇంజనీరింగ్ – రూ. 1,70,922కంప్యూటర్ సైన్స్ – రూ.1,70,922సోషల్ సైన్స్ – రూ. 1,85,785మెడిసిన్ – రూ. 3,12,118బిజినెస్ అండ్ ఫైనాన్స్ – రూ. 1,48,628పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులు – రూ. 2,22,942వసతికి ఉక్రెయిన్‌లో వ్యయం ఇలా..సిటీ సెంటర్‌లో ఉండే అపార్ట్‌మెంట్‌లోని సింగిల్ బెడ్‌రూంనకు నెలకు రూ. 21,413. అదే సిటీ సెంబర్ బయట ఉండే అపార్ట్‌మెంట్‌లోని సింగిల్ బెడ్‌రూంనకు నెలకు రూ. 12,856. ఇక సిటీ సెంటర్‌లో ఉండే అపార్ట్‌మెంట్‌లోని త్రిబుల్ బెడ్‌రూంనకు నెలకు రూ. 41,690. అదే సిటీ బయట ఉండే అపార్ట్‌మెంట్‌లోని త్రిబుల్ బెడ్‌రూంనకు నెలకు రూ. 24,449.
*ఆహారం విషయానికి వస్తే..ఉక్రెయిన్‌లో లీటర్ పాల ధర రూ. 41.62, డజన్ గుడ్లు రూ. 75, లోకల్ చీజ్ రూ.308, బీఫ్(1 కిలో) రూ. 280, యాపిల్స్(1 కిలో) రూ. 57.96, టమాటలు(1 కిలో) రూ. 95.87, బియ్యం(తెల్లవి) కేజీ రూ. 73.57, అరటి పండ్లు(1 కిలో) రూ. 95.12, మంచి నీరు(1.5 లీటర్ బాటిల్) రూ. 31.12, బంగాళదుంపలు కేజీ రూ. 23 నుంచి రూ. 73 వరకు ఉంటుంది
Whats-App-Image-2022-02-26-at-11-12-09
10. Russian వైమానిక దాడి మధ్య ఉక్రేనియన్ జంట వివాహం ఉక్రెయిన్ దేశంపై రష్యా భీకర దాడి జరుగుతున్న సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సైనిక బాంబుల దాడి మోత…వైమానిక దాడులు…మోగుతున్న సైరన్ల మధ్య ఉక్రెయిన్ దేశంలోని కీవ్ నగరంలోని చర్చ్‌‌లో ఓ జంట వివాహం చేసుకుంది. ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడి కొనసాగుతున్నా, వధూవరులు యారినా అరివా, స్వ్యటోస్లావ్ ఫర్సిన్ లు చర్చ్ లో వివాహం చేసుకున్నారు.రష్యా దళాలు సాగిస్తున్న వైమానిక దాడులు, బాంబుల దాడులతో కీవ్ నగరంలో దట్టమైన పొగ వ్యాపించినా కొత్త జంట మాత్రం చర్చ్ లో వివాహం చేసుకున్నారు. రష్యా సేనల దాడితో పరిస్థితి భయానకంగా ఉన్నా తాము తమ భూమి కోసం పోరాడుతున్నామని వరుడు అరివా చెప్పారు. యుద్ధం వల్ల బహుశా మేం చనిపోవచ్చు, కాని మేమిద్దరం అన్నింటికీ ముందు కలిసి ఉండాలనుకుంటున్నాం.’’ అని క్షిపణి దాడుల మధ్యలో చర్చిలో చేసుకున్న వివాహం గురించి యారినా అరివా, స్వ్యటోస్లావ్ ఫర్సిన్ లు చెప్పారు. రష్యా దండయాత్ర నేపథ్యంలో యారినా అరివా, స్వ్యటోస్లావ్ ఫర్సిన్ జంట చర్చ్‌లో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు
Whats-App-Image-2022-02-26-at-11-11-33
11. ఉక్రెయిన్ విద్యార్థుల కోసం విమాన టికెట్లు ఏర్పాటు చేయాలని జగన్‌ ఆదేశం ఉక్రెయిన్ విద్యార్థులకు విమాన టికెట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ నుంచి సొంత ప్రాంతాలకు చేరేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. విమాన టికెట్లు కొనలేని విద్యార్థులకు ఆ ఖర్చు ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఏపీ భవన్ నుంచి విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
oi-1
12. ఐరాస స్థాపన లక్ష్యం నెరవేరలేదు : సెక్రటరీ జనరల్
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్య రాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో ప్రతిపాదించిన తీర్మానం వీగిపోవడంతో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ట్విటర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఐరాస యుద్ధం నుంచి పుట్టిందని, యుద్ధాన్ని అంతం చేయడం కోసం పుట్టిందని, నేడు ఈ లక్ష్యం నెరవేరలేదని పేర్కొన్నారు. అయితే మనం ఆశావాదాన్ని వదిలిపెట్టకూడదన్నారు. శాంతి కోసం మనం మరొక అవకాశం ఇవ్వాలని చెప్పారు. ఐక్యరాజ్య సమితి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945లో ఏర్పాటైంది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో అమెరికా, దాని మిత్ర దేశాలు ప్రతిపాదించిన తీర్మానం వీగిపోయింది. ఉక్రెయిన్‌పై దాడిని వెంటనే రష్యా నిలిపేయాలని, ఉక్రెయిన్ నుంచి అన్ని దళాలను పూర్తిగా ఉపసంహరించాలని ఈ తీర్మానం ప్రతిపాదించింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశమైన రష్యా ఈ తీర్మానానికి వ్యతిరేకంగా వీటో చేసింది. ఇది ముందుగా ఊహించిన విషయమే. అయితే రష్యాను ప్రపంచంలో ఏకాకిని చేయడానికి ఇది దోహదపడుతుందని అమెరికా, దాని మిత్ర పక్షాలు భావిస్తున్నాయి. ఈ తీర్మానంపై ఓటింగ్ నుంచి భారత్, చైనా, యూఏఈ గైర్హాజరయ్యాయి. ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాలన్నీ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. తాము ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు తీసుకెళ్తామని చెప్పాయి. రష్యాను జవాబుదారీ చేస్తామని తెలిపాయి.
Kyiv
13. యూఏఈ రెసిడెంట్స్‌కు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కీలక సూచన!
భారత్ నుంచి దుబాయ్ వెళ్లే యూఏఈ రెసిడెంట్స్‌కు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కీలక సూచన చేసింది. ఆ దేశంలో ప్రవేశానికి వీరికి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జీడీఆర్ఎఫ్ఏ) లేదా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్(ఐసీఏ) అనుమతి అవసరం లేదని ప్రకటించింది. అలాగే దుబాయ్ వచ్చే అతిథులకు యూఏఈ ఇతర పలు సడలింపులు కూడా ఇచ్చినట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ట్వీట్ చేసింది. అయితే, ప్రయాణికులకు విమానం ఎక్కడానికి 48 గంటల ముందు టెస్టు చేయించుకున్న పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని ఎయిర్‌లైన్ తెలియజేసింది. దీంతో పాటు నివాసితులు తప్పనిసరిగా చెల్లుబాటయ్యే యూఏఈ రెసిడెంట్ వీసా కలిగి ఉండడం, వ్యాక్సినేషన్ పూర్తవ్వడం, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని పేర్కొంది.
*ఇక ఇటీవలే భారత్ నుంచి దుబాయ్ వెళ్లేవారికి పలు ఆంక్షలు సడలించింది యూఏఈ సర్కార్. దీనిలో భాగంగా మన దేశీయులు దుబాయ్‌కు బయలుదేరే ముందు ఇక్కడి విమానాశ్రయాల్లో ర్యాపిడ్‌ ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈమేరకు కొవిడ్‌ నిబంధనలను సవరిస్తూ దుబాయ్‌ నిర్ణయాన్ని తీసుకుంది. ఇది భారత్‌తో పాటు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకూ వర్తిస్తుందని వెల్లడించింది. కాగా, విమానం ఎక్కడానికి 48 గంటల ముందు చేయించుకున్న కొవిడ్‌ పరీక్షలో ‘నెగెటివ్‌’ వచ్చిన ధ్రువపత్రాన్ని సమర్పిస్తే సరిపోతుందని సూచించింది. కానీ దుబాయ్‌లో దిగగానే పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
*అటు షార్జా కూడా భారత్ సహా 8 దేశాల వారికి శుభవార్త చెప్పింది. ఈ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్, ర్యాపిడ్ టెస్టును తొలగించింది. ఇకపై షార్జా వెళ్లేవారు పీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ మేరకు షార్జాకు చెందిన బడ్జెట్ క్యారియర్ ఎయిర్ అరేబియా మంగళవారం కీలక ప్రకటన చేసింది. భారత్‌తో పాటు పాకిస్థాన్, కెన్యా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఉగాండా దేశాల నుంచి షార్జా వచ్చే ప్రయాణికులకు పీసీఆర్, ర్యాపిడ్ పరీక్షను తొలగించినట్లు వెల్లడించింది. అయితే, విమానం ఎక్కడానికి 48 గంటల ముందు చేయించుకున్న కరోనా పరీక్ష తాలూకు ‘నెగెటివ్‌’ ధ్రువపత్రాన్ని చూపించాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్‌పై క్యూఆర్ కోడ్ ఉండడం తప్పనిసరి. అలాగే షార్జాలో దిగగానే పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.
hkb
14. రష్యాకు షాక్ ఇచ్చిన ఫేస్‌బుక్ ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఫేస్‌బుక్ షాక్ ఇచ్చింది. తన వేదికపై రష్యన్ స్టేట్ మీడియా ప్రకటనలను నిషేధించింది. ఉక్రెయిన్‌లో పరిస్థితిని నిరంతరం గమనిస్తుంటామని తెలిపింది. ఫేస్‌బుక్ సెక్యూరిటీ పాలసీ హెడ్ నథనియెల్ గ్లెయిచెర్ ఓ ట్వీట్‌లో శనివారం ఈ వివరాలను వెల్లడించారు. ఫేస్‌బుక్ ప్లాట్‌ఫాంపై రష్యన్ స్టే్ట్ మీడియా అడ్వర్టయిజ్‌మెంట్లను వేయడాన్ని, లేదా, కంటెంట్‌ను మానెటైజింగ్ చేయడాన్ని నిషేధిస్తున్నట్లు నథనియెల్ తెలిపారు. ఈ కొత్త ఆంక్షలు ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తాయన్నారు. రష్యన్ స్టేట్ మీడియాకు లేబుల్స్‌ను వేయడం కొనసాగిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌లో రష్యన్ స్టేట్ మీడియా అడ్వర్టయిజ్‌మెంట్లు ప్రచురితం కాబోవన్నారు. ఈ మార్పులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఈ వారాంతంలో కూడా కొనసాగుతాయని చెప్పారు. ఉక్రెయిన్‌లో పరిస్థితిని నిరంతరం నిశితంగా గమనిస్తుంటామన్నారు. అంతకుముందు ట్విటర్ కూడా ఇదే విధంగా రష్యన్ స్టేట్ మీడియా అడ్వర్లయిజ్‌మెంట్లు, కంటెంట్ మానిటైజింగ్‌పై నిషేధం విధించిం
oi-1
15. రష్యా చర్యలపై ఐరాసా భద్రతా మండలిలో ఓటింగ్‌.. భారత్‌ దూరం..
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయింది. రష్యా చర్యలను ఖండిస్తూ భద్రతా మండలిలో భద్రతా మండలిలో (UNSC) ఓటింగ్‌ నిర్వహించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ అమెరికా చేసిన ఈ ప్రతిపాదనపై మండలిలోని మొత్తం 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి.కాగా మొదటి నుంచి ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో తటస్థంగా ఉన్న భారత్‌తో పాటు చైనా, యూఏఈలు ఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. అయితే భద్రతా మండలిలో అయిదు శాశ్వత దేశాల్లో ఒకటైన రష్యా.. తన విటో అధికారాన్ని ఉపయోగించి తీర్మాణాన్ని వీగిపోయేలా చేసింది. ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉన్న సందర్భంగా ఐరాసలో భారతరాయబారి టీఎస్‌ తిరుమూర్తి మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో విభేదాలు, వివాదాలను పరిష్కరించడానికి అన్ని సభ్య దేశాలు చర్చలు జరపాలని భద్రతా మండలికి సూచించారు. ఉక్రెయిన్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాలతో భారత్‌ తీవ్ర ఆందోళనకు గురవుతోందని తెలిపారు. హింసను తక్షణమే నిలిపివేసేందుకు తగిన ప్రయత్నాలు చేయాలని కోరుతున్నామన్నారు. మానవాళి ప్రాణాలను పణంగాపెట్టడం వల్ల ఎలాంటి పరిష్కారం లభించదని తెలిపారు
02262022121110n56
16. అమెరికా ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన జెలెన్‌స్కీ
ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీకి అమెరికా ఆఫ‌ర్ ఇచ్చింది. మ‌రో దేశానికి త‌ర‌లించేందుకు అమెరికా ఆయ‌న‌కు స్నేహ‌హ‌స్తం అందించిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఆ ఆఫ‌ర్‌ను జెలెన్‌స్కీ తిర‌స్క‌రించిన‌ట్లు ఉక్రెయిన్ మీడియా పేర్కొన్న‌ది. ప్ర‌స్తుతం కీవ్ న‌గ‌రంలోనే ఉన్న‌ట్లు జెలెన్‌స్కీ తాజా వీడియోలో తెలిపారు. ర‌ష్యా దాడి త‌ర్వాత జెలెన్‌స్కీ బంక‌ర్‌లోకి వెళ్లారు. త‌న స్టాఫ్‌తో క‌లిసి కొన్ని గంట‌ల క్రితం ఓ వీడియోను ఆయ‌న రిలీజ్ చేశారు. అందరం ఇక్క‌డే ఉన్నామ‌ని, ఇక్క‌డే పోరాడుతామ‌ని, త‌న‌కు ఆయుధాలు కావాల‌ని వీడియోలో జెలెన్‌స్కీ ప్ర‌క‌ట‌న చేశారు. దేశాన్ని ర‌క్షించుకుంటామ‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు అన్నారు.
02262022140225n13
17. భారత్-రష్యా సంబంధాలపై అమెరికా ఆసక్తికర వ్యాఖ్య
రష్యాతో భారత్అమెరికా దేశాలకు ఉన్న సంబంధాలు విభిన్నమైనవని జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వ్యాఖ్యానించింది. భారత్‌కు రష్యాతో రక్షణభద్రత సంబంధాలతో సహా అనేక విధాలుగా సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. అటువంటి సంబంధాలు రష్యాతో తమకు లేవని తెలిపింది. నిబంధనల ఆధారిత అంతర్జాతీయ వ్యవస్థను పరిరక్షించేందుకు తమ పలుకుబడిని ఉపయోగించాలని రష్యాతో సంబంధాలున్న ప్రతి దేశాన్ని తాము కోరామని తెలిపింది.అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకర్లతోమాట్లాడుతూతమకు భారత దేశంతో చాలా ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయన్నారు. భారత్-అమెరికా అత్యంత ముఖ్యమైన విలువలను పంచుకుంటున్నాయని తెలిపారు. అయితే రష్యాతో భారత దేశానికి సత్సంబంధాలు ఉన్నట్లు తమకు తెలుసునన్నారు. ఆ సంబంధాలు అమెరికా-రష్యా మధ్య ఉన్న సంబంధాల కన్నా భిన్నమైనవని తెలిపారు.
02262022112152n96
18. పుతిన్‌ ఆస్తుల స్తంభనకు అమెరికా, ఈయూ అంగీకారం..
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఆస్తుల్ని స్తంభింపజేసేందుకు అమెరికా, ఈయూ అంగీకారం తెలిపాయి. యూరోప్లోని మానవహక్కుల సంఘం నుంచి రష్యాను సస్పెండ్ చేస్తూ ఐరోపా కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న భీకర దాడుల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఆస్తుల్ని స్తంభింపజేసేందుకు అంగీకారం తెలిపింది. అమెరికాలో ఉన్న వీరిద్దరి ఆస్తుల్ని స్తంభింపజేయాలని నిర్ణయించింది.రష్యా అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆస్తులను స్తంభింపజేయాలని ఈయూ కూడా ఆమోదించింది. యూరప్‌ దేశాల్లో ఉన్న వీరిద్దరి ఆస్తుల్ని స్తంభింపజేయాలని నిర్ణయించింది.రష్యాను సస్పెండ్ చేసిన ఐరోపా కౌన్సిల్..ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో యూరోప్లోని మానవహక్కుల సంఘం నుంచి రష్యాను సస్పెండ్ చేస్తూ ఐరోపా కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ కౌన్సిల్లో 47 దేశాలు ఉన్నాయి.మరోవైపు.. రష్యా చర్యను పలు దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. జపాన్, ఐరోపా, ఆస్ట్రేలియా, తైవాన్ సహా పలు దేశాలు తీవ్రమైన ఆంక్షలకు సిద్ధమయ్యాయి. ఫ్రాన్స్ సహా దాని యూరోపియన్ మిత్రదేశాలు.. రష్యాపై కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. ఆర్థిక, ఇంధన, ఇతర రంగాలే లక్ష్యంగా ఆ ఆంక్షలు విధించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయెల్ మేక్రాన్ పేర్కొన్నారు. రష్యా పరిశ్రమలు, మిలిటరీని అదుపు చేసే లక్ష్యంతో సెమీకండక్టర్లు, ఇతర హైటెక్ ఉత్పత్తుల ఎగుమతులను ఆయా దేశాలు నియంత్రిస్తున్నాయి.రష్యా బృందాలు, బ్యాంకులు, వ్యక్తుల వీసాలను జపాన్‌ నిలిపివేసింది. ఇతర కఠిన ఆంక్షలను విధించింది. ఈ క్రమంలోనే జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా కీలక వ్యాఖ్యలు చేశారు. బలగాలతో ఏ దేశం సరిహద్దులను మార్చాలని చూసినా ఊరుకోబోమని హెచ్చరించారు. రష్యా చర్య కేవలం ఐరోపానే కాక ఆసియాపైనా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు
02262022112144n16
19. ఉక్రెయిన్ ఉక్కు మహిళ! మా గడ్డ పై ఏం పని మీకు ?
రష్యా దళాలు గురువారం ఉక్రెయిన్ సరిహద్దును దాటి దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అవి ఇప్పుడు రాజధాని కైవ్‌కు సమీపంలో ఉన్నాయి. రష్యా సైనికులు ఉక్రెయిన్ సరిహద్దును దాటి వీధుల్లోకి ప్రవేశించడంతో ఉక్రెనియన్లు రష్యా దాడిని ఖండిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా విస్తృత నిరసనలు చేపట్టారు. టోక్యో నుంచి న్యూయార్క్‌ వరకు రష్యా కార్యాలయలు వద్ద, బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభించారు. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు సైతం సైనిక దుస్తులతో యుద్థ రంగంలోకి వెళ్లి తమ సైనికులకు ధైర్యాన్ని నింపడమే కాక తాను సైతం రష్యా బలగాలతో తలపడుతున్నాడు.ఇంకో వైపు ఆ దేశపు మహిళలు సైతం తాము కూడా తమ దేశం కోసం ఏం చేయడానికైన సిద్ధం అంటున్నారు. ఈ మేరకు రాజధానికి సమీపంలోని ఓడరేవు నగరమైన హెనిచెస్క్‌లోని వీధుల్లోకి వస్తున్న రష్యా బలగాలకు ఒక ఉక్రెయిన్‌ మహిళ ఎదురు నిలబడి ప్రశ్నల వర్షం కురిపించింది. ఏ మాత్రం బెరుకు లేకుండా మా దేశంలో ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. తుపాకులు, పెద్ద మెషిన్‌ గన్లు పట్టుకున్న ఆ సైనికులు నివ్వెరపోయాలా ఆక్రోసించింది. దీంతో వారు ఆ మహిళతో ఇక్కడ ఏం జరగటం లేదంటూ..ఆమెను శాంత పరచడానికి ప్రయత్నించారు. అయితే ఆమె ఏ మాత్రం ఖాతరు చేయకుండా మీకు ఇక్కడేం పని అంటూ గర్జించింది.దెబ్బకు ఆ రష్యా సైన్యం తాము ఇక్కడ సైనిక కసరత్తులు చేస్తున్నాం దయచేసి మీరు వెళ్లండి అని వాళ్లు సున్నితంగా చెబుతున్న ఆమె లక్ష్యపెట్టలేదు. పైగా ఈ భూమి పై మీకు ఏం దొరకదు. కనీసం ఈ గింజలైన తీసుకుని జేబులో పెట్టుకోండి. మీరంతా ఇక్కడ పడుకున్నప్పుడు కనీసం ఆ పొద్దుతిరుగుడు పువ్వులు అయిన పెరుగుతాయని వ్యంగ్యంగా చెప్పి నిష్క్రమించింది.పొద్దు తిరుగుడు పువ్వు ఉక్రెయిన్ జాతీయ పుష్పం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ సైనికులను చూసి ఏ మాత్రం భయపడకుండా నిలబడిన “నిర్భయ”, ఆమెను తమ దేశ దళాలతో మాట్లాడమని చెప్పాలి ఎందుకంటే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా తమ బలగాలను ధైర్యంగా పోరాడేలా చేయగల సమర్థురాలు అని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.
02262022111853n36
20. ఉక్రెయిన్‌లో మెలిటోపోల్ నగరం రష్యా సేనల వశం ఉక్రెయిన్‌ ఆగ్నేయ దిశలోని జపొరిజ్జ్య ప్రాంతంలో ఉన్న మెలిటోపోల్ నగరం తమ వశమైందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఐగోర్ కొనషెంకోవ్ శనివారం చెప్పారు. రష్యన్ సాయుధ దళాలు ఈ నగరంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించినట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత కోసం తమ సైన్యం అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ జాతీయవాదులు, స్పెషల్ సర్వీసెస్ ప్రతిఘటనను తిప్పికొట్టేందుకు కూడా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రష్యా గురువారం నుంచి ఉక్రెయిన్‌పై దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ దళాలను తిప్పికొట్టేందుకు డోనెట్‌స్క్, లుహాన్‌స్క్ పీపుల్స్ రిపబ్లిక్స్ సహాయం కోరాయని, దీనికి ప్రతిస్పందిస్తూ యుద్ధం చేస్తున్నామని రష్యా చెప్తోంది. ఉక్రెయిన్ సైనిక మౌలిక సదుపాయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, సాధారణ ప్రజానీకానికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్తోంది. ఉక్రెయిన్‌ను ఆక్రమించాలనే ఆలోచన తమకు లేదంటోంది. డీమిలిటరైజ్, డీ-నాజిఫై ఉక్రెయిన్ లక్ష్యంగా ఈ ప్రత్యేక ఆపరేషన్‌ను రష్యా ప్రారంభించిందని విశ్లేషకులు చెప్తున్నారు.
02262022102556n47
21. రష్యాను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సైనికుడి ఆత్మాహుతి
రష్యాతో పోలిస్తే ఉక్రెనియన్ సైన్యం బలహీనమైందే అయినా, అక్కడి సైనికులు మాత్రం వీరోచితంగా పోరాడుతున్నారు. రష్యన్ బలగాల్ని అడ్డుకునేందుకు, ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా పోరాటం కొనసాగిస్తున్నారు. దేశాన్ని దురాక్రమణ నుంచి కాపాడుకునేందుకు చివరివరకూ ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒక ఉక్రెయిన్ సైనికుడు రష్యన్ బలగాల్నిఅడ్డుకునేందుకు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. రష్యా సైన్యం క్రిమియా సరిహద్దు నుంచి, ఒక బ్రిడ్జి ద్వారా ఉక్రెయిన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. రష్యా ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ఉక్రెయిన్‌లోని మెరైన్ బెటాలియన్‌కు చెందిన విటాలీ వోలోడిమైరోవిచ్ అనే సైనికుడు ఆ బ్రిడ్జిపై మైన్స్ అమర్చి, ఆ బ్రిడ్జిని పేల్చేశాడు. ఆ సమయంలో విటాలీ అక్కడే ఉండటంతో బ్రిడ్జితోపాటు అతడు కూడా పేలిపోయాడు. బ్రిడ్జి కూలిపోవడంతో రష్యా సైన్యానికి ట్యాంకర్లతో ఆ మార్గం ద్వారా ఉక్రెయిన్‌లోకి ప్రవేశించడం కష్టమైంది. అయితే, విటాలీ త్యాగాన్ని ఉక్రెయిన్ సైన్యం కొనియాడింది.
02262022013752n2
22. పుతిన్ ప్ర‌తిపాద‌న‌ల‌కు ఓకే చెప్పిన జెలెన్‌స్కీ !
ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ చేసిన ప్ర‌తిపాదిన‌ల‌కు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ర‌ష్యాతో శాంతి చ‌ర్చ‌లు నిర్వ‌హించేందుకు జెలెన్‌స్కీ అంగీకారం తెలిపిన‌ట్లు ప్రెస్ సెక్ర‌ట‌రీ సెర్గే నికిఫ‌రోవ్ తెలిపారు. కాల్పుల విర‌మ‌ణ‌కు కూడా జెలెన్‌స్కీ ఆమోదం తెలిపిన‌ట్లు సెర్గే చెప్పారు. చ‌ర్చ‌ల‌ను తిర‌స్క‌రించిన‌ట్లు వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తున్నామ‌ని, శాంతి, కాల్పుల విర‌మ‌ర‌ణ ఒప్పందానికి ఉక్రెయిన్ క‌ట్టుబ‌డి ఉంద‌ని, ఇదే మా శాశ్వ‌త సిద్ధాంత‌మ‌ని, ర‌ష్యా అధ్య‌క్షుడు చేసిన ప్ర‌తిపాద‌న‌ల‌ను తాము అంగీక‌రిస్తున్నామ‌ని త‌న ఫేస్‌బుక్ పేజీలో సెర్గే తెలిపారు. అయితే శాంతి చ‌ర్చ‌ల‌కు సంబంధించిన స్థ‌లం, తేదీ గురించి సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు నికోఫ‌రోవ్ తెలిపారు. చ‌ర్చ‌లు ఎంత వేగంగా జ‌రిగితే, అంత త్వ‌ర‌గా సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయ‌ని ఆయ‌న అన్నారు. మిన్‌స్క్‌లో చ‌ర్చ‌లు నిర్వ‌హించాల‌ని ర‌ష్యా భావించ‌గా.. వార్సాలో జ‌రిగే బాగుంటుంద‌ని ఉక్రెయిన్ అభిప్రాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది.
02262022013747n95
23. రష్యా అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడనున్న మోడీ
ఉక్రెయిన్లో నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రధాని నరేంద్రమోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్తో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ (ఫిబ్రవరి 24) రాత్రి మోడీ ఫోన్ చేయనున్నట్లు సమాచారం. రష్యా, ఉక్రెయిన్ సంక్షోభంతో పాటు అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు, విద్యార్థుల భద్రత గురించి పుతిన్తో ఫోన్లో చర్చించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లో పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోడీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజీత్ దోవల్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఉక్రెయిన్ లో తాజా పరిస్థితులపై చర్చించారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను హంగేరీ సరిహద్దుల ద్వారా తరలించాలని నేతలు నిర్ణయించారు. ఇప్పటికే హంగేరీ, ఉక్రెయిన్ సరిహద్దుల్లోని జొహానైకు చేరుకున్న ఇండియన్ ఎంబసీ సిబ్బంది అక్కడి ప్రభుత్వ సాయంతో ఇండియన్లను హంగేరీకి తీసుకురానున్నారు. అక్కడి నుంచి వారిని స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
6555
24. బహుళ అంతస్తుల భవనాన్ని ఢీకొన్న రష్యా క్షిపణి
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ రష్యా సైనిక చర్యతో విలవిల్లాడుతోంది. ఉక్రెయిన్ సైన్యం మాత్రం వీరోచితంగా ప్రతిఘటిస్తుండగా, రష్యా సైనిక బలగాల బాంబు దాడులతో రాజధాని సహా పలు నగరాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. సైనిక స్థావరాలపైనే తాము దాడులు జరుపుతున్నట్టు రష్యా చెబుతున్నప్పటికీ జనావాసాలను సైతం బాంబులు తాకుతున్నాయి. తాజాగా కీవ్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనాన్ని రష్యా క్షిపణి తాకడంతో ఆ భవనం పూర్తిగా దెబ్బతింది. ఇందుకు సంబంధించి భవంతిలో నివసించే వారే తీసినట్టుగా చెబుతున్న ఒక వీడియో అక్కడి పరిస్థితిని అద్దంపడుతోంది
31-2
25. తగ్గేదేలే అంటున్న ఉక్రెయిన్‌ సేన.. రష్యా బలగాలకు పట్టపగలే చుక్కలు..
ఉక్రెయిన్‌లో రష్యా బలగాలకు, ఆ దేశ సైనికులకు మధ్య భీకర పోరు నడుస్తోంది. ఎంతో ఆయుధ సంపత్తి ఉండి అత్యాధునిక టెక్నాలజీ వెపన్స్‌ కలిగిన రష్యాకు ఉక్రెయిన్‌పై దాడి భారీ నష్టాన్నే మిగిల్చినట్టు తెలుస్తోంది. గత మూడు రోజులుగా జరుగున్న యుద్దంలో ఉక్రెయిన్‌ సైన్యం తగ్గేదేలే అంటూ తమ సామర్థ్యానికి మించి పోరాడుతోంది. ర‌ష్యా ద‌ళాల‌ను ఉక్రెయిన్ సైన్యం ధీటుగా ఎదుర్కొంటున్న‌ట్లు ప‌శ్చిమ దేశాలు పేర్కొన్నాయి.ఇదిలా ఉండగా.. ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 3500 మంది ర‌ష్యా సైనికులు చ‌నిపోయిన‌ట్లు ఉక్రెయిన్ ఆర్మీ త‌న ఫేస్‌బుక్ పేజీలో తాజాగా పేర్కొంది. అంతేకాకుండా మ‌రో 200 మంది ర‌ష్యా సైనికులను తాము అరెస్టు చేసిన‌ట్లు కూడా గర్వంగా వెల్లడించారు. ఈ క్రమంలో తమ దేశ సైనికులు రష్యాకు చెందిన 14 విమానాల‌ను, 8 హెలికాప్ట‌ర్ల‌ను, 102 యుద్ధ ట్యాంక్‌ల‌ను, 536 ఆర్మీ వాహనాలను నాశనం చేసినట్టు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది.

31
26. రష్యన్‌ మీడియాకి షాక్‌ ! కఠిన నిర్ణయం తీసుకున్న సోషల్‌ మీడియా దిగ్గజం
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో సోషల్‌ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. మెటా పరిధిలోని ఫేస్‌బుక్‌లో రష్యన్‌ మీడియాకు సంబంధించిన అడ్వెర్‌టైజ్‌మెంట్లును నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు ఫేస్‌బుక్‌ వేదికగా రష్యన్‌ మీడియాకు ఆదాయం సంపాదించే మార్గాలన్నింటినీ మూసి వేస్తున్నట్టు కూడా తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. మెటా ఆధ్వర్యంలో ప్రస్తుతం వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఫేస్‌బుక్‌ ప్లాట్‌ఫామ్‌పై నిషేధం అమల్లోకి రానుంది .మరి మిగిలిన ప్లాట్‌ఫామ్స్‌ విషయంలో మెటా నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. మెటా తీసుకున్న తాజా నిర్ణయంతో రష్యన్‌ మీడియా నుంచి వచ్చే సమాచారం ఇకపై ఫేస్‌బుక్‌లో కనిపించవు. అదే విధంగా చాలా వరకు రష్యన్‌ వీడియోలు, ఇతర సమాచారం కూడా ఫిల్టర్‌ అవనుంది.రష్యా కమ్యూనిస్టు దేశం కావడంతో అక్కడ మీడియా స్వేచ్ఛ పరిమితం. ప్రభుత్వం కనుసన్నల్లో రష్యన్‌ మీడియా వెల్లడించే సమాచారామే పెద్ద దిక్కు. తాజా పరిణామాల నేపథ్యంలో రష్యన్‌ మీడియాపై ఫేస్‌బుక్‌లో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. దీంతో రష్యాకు సంబంధించిన సమాచారం మరింత తక్కువగా బయటి ప్రపంచానికి వెల్లడి కానుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఇటు అమెరికాతో పాటు అటూ యూరోపియన్‌ దేశాలు అనేక కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రకటించిన చర్యలన్నీ ప్రభుత్వ పరమైనవే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా వీటికి ప్రైవేటు కంపెనీలు కూడా జత కలుస్తున్నాయి. ముందుగా ఫేస్‌బుక్‌ తరఫున మెటా నుంచి ప్రకటన వెలువడింది. మరి ఈ దారిలో మరిన్ని ప్రైవేటు కంపెనీలు నడుస్తాయా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
27
27-1
27. యుద్ధభూమిలో తెలుగు విద్యార్థులు.. భయం గుప్పిట్లో ప్రాణాలు..!
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో.. అక్కడ చదువుకుంటున్న రాష్ట్ర విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అక్కడ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు.. ఎప్పుడు ఏమవుతుందోనని బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. యుద్ధప్రభావిత ప్రాంతాలకు దూరంగా ఉన్నవారు ప్రశాంతంగా ఉన్నప్పటికీ.. రాజధాని కీవ్తోపాటు పరిసరాల్లో ఉన్న విద్యార్థులు భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. ఉక్రెయిన్లో కొనసాగుతున్న దాడుల కారణంగా భీకర వాతావరణం నెలకొంది. రాజధాని కీవ్ తోపాటు పలు కీలక నగరాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆయా నగరాల్లోని జనాలు సురక్షిత ప్రాంతాలకూ తరలిపోతున్నారు. ఉన్నత విద్యకోసం ఉక్రెయిన్ వెళ్లిన రాష్ట్ర విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. యుద్ధ విమానాల బీభత్సం, బాంబుల మోత కొనసాగుతున్న వేళ తెలుగు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడి భయానక పరిస్థితులను ఇక్కడి కుటుంబ సభ్యులకు వివరిస్తూ.. తమను కాపాడాలను వేడుకుంటున్నారు. ఉక్రెయిన్ నుంచి తమ పిల్లలను భారత్ కు రప్పించాలంటూ.. వారి కుటుంబ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
*యుద్ధభూమిలో తెలుగు విద్యార్థులుతిండి కూడా లేకుండా..
తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడకు చెందిన వేముల కీర్తి ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతోంది. భయానక పరిస్థితుల నేపథ్యంలో వారంతా ఓ మెట్రోస్టేషన్‌లో తినడానికి తిండి కూడా లేకుండా గడుపుతున్నట్లు తెలిపింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్‌ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ ఉక్రెయిన్‌లో చిక్కుకోవడంతో తల్లిదండ్రలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సురక్షితంగా తమ కుమారుడిని దేశానికి వచ్చేలా ప్రభుత్వాలు చూడాలని తండ్రి నర్సింహులు కోరుతున్నారు.యుద్ధభూమిలో తెలుగు విద్యార్థులుయుద్ధభూమిలో తెలుగు విద్యార్థులుమరికొన్ని రోజుల్లో వద్దామని..మెదక్‌కు చెందిన రాగం మధు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఎంబీబీఎస్ అభ్యసిస్తున్నాడు. ఫైనల్‌ ఇయర్ చదువుతున్న మధు… మరికొన్ని రోజుల్లో పరీక్షలు పూర్తి చేసుకుని భారత్‌కు వచ్చేందుకు ప్లాన్‌ చేసుకున్నాడని.. ఇంతలోనే ఇలా యుద్ధంలో చిక్కుకుపోయాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
*తలదాచుకునేందుకు స్థలం లేక..
ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం మెడిదపల్లిపాలెం గ్రామానికి చెందిన రావుల మహేశ్‌రెడ్డి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోసం ఉక్రెయిన్‌కు వెళ్లి అక్కడే చిక్కుకున్నాడు. తమ పరిస్థితి దారుణంగా ఉందని వీడియో పంపడంతో… తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. తమ కుమారుడిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.
29
28. స్పేస్ స్టేషన్‌ను భారత్‌లో కూల్చాలా: రష్యా రష్యాపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని, ఈ నిర్ణయం తమ భాగస్వామ్యంలో నడుస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్‌ఎస్‌) పరిశోధనలపై ప్రభావం చూపుతుందని రష్యా అభిప్రాయపడింది. ఇదే జరిగితే, 500 టన్నుల బరువున్న స్పేస్ స్టేషన్ భారత్ లేదా చైనాలో పడే అవకాశాలుంటాయని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ (రొస్కొస్మోస్) చీఫ్ డిమిట్రీ రోగోజిన్ అన్నారు. ‘‘రష్యాపై అమెరికా విధించే ఆంక్షలు ఐఎస్‌ఎస్‌ పరిశోధనలపై ప్రభావం చూపుతాయి. పరిశోధనలకు రష్యా దూరంగా ఉంటే స్పేస్ స్టేషన్ అనియంత్రిత కక్ష్యలో తిరగకుండా ఎవరు అడ్డుకుంటారు? అమెరికా లేదా యూరప్‌లో పడకుండా ఎవరు రక్షిస్తారు? స్పేస్ స్టేషన్ ఇండియా లేదా చైనాలో పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ అంశంపై ఆ రెండు దేశాలను బెదిరించాలా? ఐఎస్ఎస్ రష్యా మీదుగా మాత్రం వెళ్లదు. కాబట్టి, ఏదైనా నష్టం జరిగితే అది మీకే’’ అంటూ అమెరికాను డిమిట్రీ హెచ్చరించారు. అమెరికా, రష్యా, కెనడా, యూరప్, జపాన్ దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థల ఆధ్వర్యంలో ‘ఐఎస్ఎస్‘ పనిచేస్తోంది.
02262022013756n23
29. నిస్సహాయస్థితిలో భారత అమ్మాయిలు.. బంకర్‌లో దాక్కుని కాపాడండి అంటూ..
రష్యా సైనిక దాడి కారణంగా ఉక్రెయిన్‌లో భయానక వాతావరణం చోటుచేసుకుంది. ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌తో కాలం గడుపుతున్నారు. తాజాగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇద్దరు భారతీయ అమ్మాయిలు వారి దీన స్థితిని వీడియోలో ప్రపంచానికి తెలిపారు. 24 గంటలుగా తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతున్నామంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో చూశాక అయినా భారత ప్రభుత్వం ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తమను స్వదేశానికి తీసుకువెళ్లాలని అభ్య ర్థించారు. అయితే, రష్యా దాడుల నేపథ్యంలో కర్నాటకలోని బెంగళూరుకు చెందిన ఇద్దరు విద్యార్థినిలు తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతంలో చిక్కుకుపోయారు. బాంబుల దాడుల కారణంగా వారు ఓ బంకర్‌లో దాక్కున్నట్టు తెలిపారు. ఈ సందర్బంగా వారి నిస్సుహాయ స్థితి గురించి ఓ వీడియోను రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. వీడియోలో మేఘన, రక్ష మాట్లాడుతూ.. దాడుల నేపథ్యంలో తాము ఓ బంకర్‌లో దాక్కున్నామని అన్నారు. 24 గంటలుగా తమకు తినడానికి తిండి, తాగడానికి నీరు, సరైన వెంటిలేషన్‌ లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.
10