నాగ చైతన్యతో విడాకుల అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది సమంత. భారీ బడ్జెట్ చిత్రాలకు ఒకే చెబుతూ జోరు చూపిస్తోంది. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ అభిమానులను పలకరిస్తోంది.తాజాగా సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. తెలుపు రంగు పట్టు చీరను ధరించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆ చీర మీద ఎంబ్రాయిడరీ ఉంది. మ్యాచింగ్ జ్యువేలరీని కూడా సామ్ ధరించింది. ఈ చీరను చూసి అభిమానులు ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఆమె ధరించిన చీర ధర ఎంత అని ఆరా తీయడం ప్రారంభించారు. తాజాగా నెటిజన్లు అవాక్కయ్యే విషయం వెలుగులోకి వచ్చింది. సామ్ ధరించిన చీర ఖరీదు వివరాలు బయటకొచ్చాయి. ఈ చీర ధర దాదాపుగా రూ.1.15లక్షలు ఉంటుందని తెలిసింది.
ప్రస్తుతం సమంత ‘శాకుంతలం’ లో నటిస్తుంది. ఈ మూవీని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. మహా భారతంలోని ఆది పర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్లో ‘యశోద’ తో పాటు, హాలీవుడ్లో ‘‘ది అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’’ అనే చిత్రంలో నటిస్తుంది.