ఉక్రెయిన్ బ్రిటనర్లకు స్పెషల్ వీసా.. వెల్లడించిన బోరిస్ జాన్సన్!
*రష్యా దండయాత్రతో ప్రాణాలరిచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిన ఉక్రెయిన్లకు బాసటగా నిలిచేందుకు ముందుకొచ్చింది బ్రిటన్. తమదేశంలో స్థిరపడిన ఉక్రెయిన్ల కుటుంబ సభ్యులు బ్రిటన్‌కు రావచ్చునని తెలిపింది. వారికి వీసాలు జారీ చేస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సోమవారం ప్రకటించారు. వేలాది మంది ఉక్రెయిన్లకు ఊరట కల్పించేందుకు ప్రతిపాదించిన నూతన ఉక్రెయిన్ వీసా విధానంపై వచ్చేవారంలో పార్లమెంట్‌లో ప్రభుత్వం వెల్లడించనున్నది.
అంతేకాదు.. ఉక్రెయిన్ సంతతి బ్రిటన్‌వాసులకు ప్రాథమిక, వైద్యపరమైన అవసరాలు తీర్చేందుకు నాలుగో కోట్ల పౌండ్ల హ్యుమానిటేరియన్ ప్యాకేజీని తెలిపారు బోరిస్ జాన్సన్. కనుక తమదేశంలో సెటిలైన ఉక్రెయిన్లు.. తమ వారిని బ్రిటన్‌కు తీసుకురావచ్చునన్నారు.
రష్యా దండయాత్రతో వేలాది మంది ఉక్రెయిన్లు నిరాశా నిస్పృహల్లో చిక్కుకున్నారని, అటువంటి వారికి తమ ప్యాకేజీతో లబ్ధి చేకూరుతుందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. కష్టాల్లో ఉన్న ఉక్రెయిన్లకు బాసటగా నిలువాల్సిన సమయంలో తమ దేశం వెనుకడుగు వేయదని బోరిస్ జాన్సన్ చెప్పారు. ఉక్రెయిన్‌ను కాపాడేందుకు ఆర్థిక, మిలిటరీ సహకారం అందిస్తామన్నారు.