Business

భార‌తీయుల‌కు టెక్ దిగ్గ‌జం హెచ్‌పీ శుభ‌వార్త‌ – TNI వాణిజ్య వార్తలు

భార‌తీయుల‌కు టెక్ దిగ్గ‌జం హెచ్‌పీ శుభ‌వార్త‌ – TNI  వాణిజ్య వార్తలు

* ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం హెచ్‌పీ భార‌తీయుల‌కు శుభ‌వార్త చెప్పింది. దేశీయంగా హెచ్పీ ల్యాప్‌ట్యాప్‌ల‌ను త‌యారు చేయడం ప్రారంభించిన‌ట్లు తెలిపింది. దేశీయం ఎల‌క్ట్రానిక్ ప్రొడ‌క్ట్‌ల త‌యారీని ప్రోత్స‌హించేందుకు కేంద్రం ప్రొడ‌క్ట్ లింక్‌డ్ ఇన్సెంటీవ్‌(పీఎల్ఐ) స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప‌థ‌కం సత్ప‌లితాల‌ను ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ప‌థ‌కంలో భాగంగా హెచ్ పీ సంస్థ మ‌న దేశంలో డెస్‌్చటాప్ లు, మినీ డెస్క్‌టాప్‌లు, డిస్‌ప్లే మానిటర్‌లు, ల్యాప్‌టాప్‌లను తయారు చేయడం ప్రారంభించిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఇంటర్నేష‌న‌ల్ డేటా కార్పొరేష‌న్ గ‌ణాంకాల ప్రకారం..2020నుంచి హెచ్‌పీ భార‌త్‌లో 58.7శాతం వృద్ధితో 31.5శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండ‌గా..2021లో వాణిజ్య విభాగంలో హెచ్‌పీ మార్కెట్ వాటా 57.5శాతం నుంచి 60.1శాతానికి వృద్ధి చెందింది. వినియోగం విభాగాల్లో 30శాతం నుంచి 32.9శాతానికి పెరిగిన‌ట్లు తెలిపింది.అయితే ఇప్పుడు ఆ మార్కెట్‌ను మరింత పెంచేందుకు భారీ ఎత్తున ల్యాప్‌టాప్‌ల‌ను త‌యారు చేస్తుంది. హెచ్‌పీ ఎల‌క్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చ‌ర్ కంపెనీ ఫ్లెక్స్ కంపెనీతో చేతులు క‌లిపింది. త‌మిళనాడులో చెన్నైకి చెందిన శ్రీపెరంబుదూర్‌లోని హెచ్‌పీ త‌యారీ యూనిట్ల‌ను పెంచేందుకు భారీ ఎత్తున పెట్టుబ‌డులు పెడుతున్న‌ట్లు హెచ్‌పీ ఇండియా మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ కేతన్ పటేల్ అన్నారు. వాస్త‌వానికి హెచ్‌పీ భార‌త్‌లో క‌మ‌ర్షియ‌ల్ డెస్క్ టాప్‌ల‌ను త‌యారు చేస్తుంది. అయితే తాజా పెట్టుబడ‌ల‌తో హెచ్‌పీ ఎలైట్ బుక్స్‌, ప్రో బుక్స్‌, హెచ్‌పీ జీ8 సిరీస్ నోట్‌బుక్స్‌తో పాటు భారీ ఎత్తున ల్యాప్‌టాప్‌ల‌ను త‌యారు చేస్తున్న‌ట్లు హెచ్ పీ వెల్‌ుడించింది..

*బ్యాంకులకు 15,000 కోట్ల అదనపు మూలధనం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బలహీనంగా ఉన్న పలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) కేంద్రం రూ. 15,000 కోట్ల మేర అదనపు మూలధనాన్ని సమకూర్చనుంది. ఇందులో సింహభాగాన్ని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ మొదలైనవి దక్కించుకోనున్నాయి. గత ఏడాది వడ్డీ రహిత బాండ్ల జారీ ద్వారా నిధులు సమకూర్చుకున్న బ్యాంకులకు ఈ అదనపు మూలధనం లభించనుంది. సదరు బాండ్ల వేల్యుయేషన్‌ను.. ముఖ విలువ కంటే తక్కువగా లెక్క గట్టారంటూ రిజర్వ్‌ బ్యాంక్‌ అభిప్రాయపడింది. దీనితో, నిధులు సమకూర్చుకున్నప్పటికీ ఆయా బ్యాంకుల టియర్‌ 1 మూలధన నిల్వలు.. నిర్దేశిత స్థాయికన్నా తక్కువగానే ఉన్నాయని ఆర్‌బీఐ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే పీఎస్‌బీలకు ప్రభుత్వం అదనపు మూలధనం సమకూర్చాల్సిన పరిస్థితి నెలకొంది.

*క‌రెన్సీ ప‌త‌నం.. వ‌డ్డీ రేటు రెండింత‌లు పెంపు
కీల‌క‌మైన వ‌డ్డీ రేటును ర‌ష్యా రెండింత‌లు పెంచేసింది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే ర‌ష్యా క‌రెన్సీ ర‌బుల్ 30 శాతం ప‌డిపోయింది. ఈ నేప‌థ్యంలో బ్యాంక్ ఆఫ్ ర‌ష్యా ఇవాళ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. వ‌డ్డీ రేటును 9.5 శాతం నుంచి 20 శాతానికి పెంచిన‌ట్లు బ్యాంక్ పేర్కొన్న‌ది. దేశ క‌రెన్సీ మ‌రింత ప‌త‌నం కాకుండా ఉండేందుకు ర‌ష్యా ఈ చ‌ర్య‌ల‌కు దిగిన‌ట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ ర‌ష్యాతో బ్రిట‌న్‌, అమెరికా, ఈయూ దేశాల బ్యాంకులు సంబంధాలు తెంచుకోవ‌డంతో ర‌బుల్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ర‌ష్యా బ్యాంక్‌తో లావాదేవీల‌ను నిలిపివేసేలా త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు బ్రిట‌న్ తెలిపింది. స్విఫ్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ పేమెంట్ సిస్ట‌మ్ నుంచి ర‌ష్యాను బ్యాన్ చేయ‌డం వ‌ల్ల ఆ దేశ క‌రెన్సీ ప‌త‌న‌మ‌వుతోంది. క‌రెన్సీ విలువ మ‌రింత ప‌డిపోకుండా ఉండేందుకు.. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని నివారించేందుకు ర‌ష్యా వ‌డ్డీ రేట్ల‌ను పెంచిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. దేశంలోని కంపెనీలు 80 శాతం విదేశీ మార‌క నిలువ‌ల‌ను అమ్మేయాల‌ని ర‌ష్యా ఆదేశించింది. గ్లోబ‌ల్ మార్కెట్ నుంచి ర‌ష్యా ఒంటరి అవుతోంద‌ని కొంద‌రు నిపుణులు అంటున్నారు. ఆయిల్‌, గ్యాస్ ఎగుమ‌తి చేసే ర‌ష్యా .. ఎక్కువ‌గా స్విఫ్ట్ సిస్ట‌మ్‌పై ఆధార‌ప‌డుతోంది.

* వచ్చే ఆర్థిక సంపత్సరం ప్రథమార్ధంలో దక్షిణాదియేతర మార్కెట్లలోకి కార్యకలాపాలను గణనీయంగా విస్తరించనున్నట్లు ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్‌ జ్యుయలర్స్‌ ఇండియా ఈడీ రమేష్‌ కల్యాణరామన్‌ తెలిపా రు. ఇందుకోసం ఫ్రాంచైజీ విధానాన్ని ఎంచుకో వాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ముందుగా 2025 నుంచి ఈ విధానంలో విస్త రించాలని భావించినప్పటికీ గత 3–4 త్రైమాసికాలుగా నెలకొన్న డిమాండ్‌ను చూసి.. అంతక న్నా ముందుగానే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ముందుగా 2–3 స్టోర్స్‌తో కార్యకలాపాల విస్తరణను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఫ్రాం చైజీ మోడల్‌లో స్టోర్‌ ఏర్పాటు వ్యయం సుమారు రూ. 20 కోట్లుగా ఉంటుందని తెలిపా రు. ఇందులో సింహభాగం వాటా ఉత్పత్తులదే ఉంటుందని, పెట్టుబడి వ్యయాలు తక్కువగానే ఉంటాయని వివరించా రు. ప్రస్తుతం కంపెనీకి 21 రాష్ట్రాలు, నాలుగు దేశాల్లో 151 సొంత షోరూమ్‌లు ఉన్నాయి. వీటిలో 121 స్టోర్స్‌ భారత్‌లో ఉన్నాయి.

*దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న ల్యాంకో అమర్కంటక్ విద్యుదుత్పత్తి ప్లాంట్ను చేజిక్కించుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పవర్ రెడీ అవుతున్నాయి. ఈ రెండు సంస్థలతో పాటు జిందాల్ పవర్, ఓక్ట్రీ క్యాపిటల్ ఫండ్ సహా ప్రభుత్వ రంగ సంస్థలైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎ్ఫసీ), ఆర్ఈసీ, ఎన్టీపీసీ లిమిటెడ్ కూడా పోటీ పడుతున్నాయి.

*ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కనీసం 200 ఫ్యూచర్ రిటైల్ స్టోర్ల కార్యకలాపాలను తన ఆధీనంలోకి తీసుకుందని, ఆ స్టోర్లలోని సిబ్బందికి తన కంపెనీలో ఉద్యోగం కూడా ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దివాలా అంచుల్లో ఉన్న ఫ్యూచ ర్ రిటైల్ అద్దె చెల్లించలేకపోవడంతో కంపెనీకి చెందిన పలు స్టోర్ల స్థల యజమానులు రిలయన్స్ను ఆశ్రయించినట్లు వారు చెప్పారు. మూతపడే పరిస్థితుల్లో ఉన్న స్టోర్ల లీజ్ అగ్రిమెంట్లను రిలయన్స్ తన అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్) పేరిట బదిలీ చేసింది. అయితే, మళ్లీ వాటిని ఫ్యూచర్ గ్రూప్నకే అద్దెకిచ్చిందని వారన్నారు. అప్పటి నుంచే స్టోర్ల రీబ్రాండింగ్ను ప్రారంభించిన రిలయన్స్ రిటైల్.. ఆ కేంద్రాల్లో పనిచేస్తున్న వారిని తన కంపెనీలో చేర్చుకుందన్నారు

*చమురు మంట ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) భారత ఆర్థిక వ్యవస్థపై పెనుభారం మోపనుంది. 2022 మార్చి నాటికి ముడి చమురు దిగుమతి బిల్లు 11,000 నుంచి 11,500 కోట్ల డాలర్లకు (సుమారు రూ.8.25 లక్షల కోట్ల నుంచి రూ.8.62 లక్షల కోట్లు) చేరుతుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరం (2020-21)తో పోలిస్తే దిగుమతుల బిల్లు 2021-22లో దాదాపు రెట్టింపు కానుంది. పెట్రోలియం మంత్రి త్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాల్సిస్ సెల్ (పీపీఏసీ) ఈ విషయం పేర్కొంది.

*కంపెనీలు, పరిమిత భాగస్వామ్య సంస్థల (ఎల్ఎల్పీ)పై వచ్చే ఫిర్యాదుల విచారణ ప్రక్రియను ప్రభుత్వం మరింత పటిష్ఠం చేసింది. ఎంసీఏ21 పోర్టల్ ద్వారా అందే ఫిర్యాదులను ఎలకా్ట్రనిక్ రిజిస్టర్లో నమోదు చేయాలని కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ).. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలు (ఆర్ఓసీ), ప్రాంతీయ డైరెక్టర్లకు ఆదేశించింది. ఈఫిర్యాదులకు సర్వీస్ రిజిస్టర్ నంబరు (ఎస్ఆర్ఎన్) కేటాయించి.. ఆ నంబరుతోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని స్పష్టం చేసింది. దీనివల్ల ఫిర్యాదుల పేరుతో జరిగే అనధికారిక దుర్వినియోగానికి తెరపడుతుందని భావిస్తున్నారు.

*అర్హులైన బిడ్డర్లు లేకపోవడంతో ప్రభుత్వ రం గంలోని భారత్ బ్రాడ్బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ (బీబీఎన్ ఎల్) రూ.19,000 కోట్ల విలువ గల టెండర్ను రద్దు చేసింది. దేశంలోని 16 రాష్ర్టాల్లో 3.61 లక్షల గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్తో అనుసంధానం చేసేందుకు ఈ టెండర్లను ఆహ్వానించారు. రూ.29,430 కోట్ల వ్యయ అంచనాతో ఈ ప్రాజెక్టుకు గత జూన్లో అమోదం లభించగా ప్రభుత్వం వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ,19,041 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టును 9 ప్యాకేజీల కింద విభజించి ఒక్కో దానికి ఒక్కో టెండర్ జారీ చేశారు. అర్హులైన బిడ్డర్లు రాకపోవడంతో ఈ టెండర్లన్నింటినీ రద్దు చేసినట్టు ఈ నెల 8వ తేదీన బీబీఎన్ఎల్ ప్రకటించింది. పరిశ్రమ నుంచి సూచనలు స్వీకరించిన అనంతరం మళ్లీ బిడ్లు ఆహ్వానించనున్నట్టు సంస్థ వర్గాలు తెలిపాయి.

*దేశీయంగా ఎలకా్ట్రనిక్ చిప్, డిస్ప్లే తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీలు రెడీ అవుతున్నాయి. సుమారు రూ.1,53,750 కోట్ల (2,050 కోట్ల డాలర్లు) పెట్టుబడితో ఈ ప్లాంట్లను నెలకొల్పేందుకు ఐదు కంపెనీలు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. వేదాంత ఫాక్స్కాన్ భాగస్వామ్య సంస్థ, ఐజీఎ్సఎస్ వెంచర్స్, ఐఎ్సఎంసీ 130.6 కోట్ల డాలర్ల (రూ.1.02 లక్షల కోట్లు) పెట్టుబడితో ఎలకా్ట్రనిక్ చిప్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాయని తెలిపింది. అంతేకాకుండా రూ.76,000 కోట్లతో కూడిన సెమీకాన్ ఇండియా కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.42,000 కోట్ల మేర పెట్టుబడుల మద్దతును ఈ కంపెనీలు కోరుతున్నాయని పేర్కొంది.

*ఆర్థికంగా దివాలా తీసిన ల్యాంకో గ్రూప్నకు ఉత్తరప్రదేశ్లోని అన్పరలో ఉన్న 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ను కొనుగోలు చేసేందుకు మూడు కంపెనీలు బిడ్లు సమర్పించాయి. ఈ జాబితా లో హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్), ఐల్యాబ్స్ గ్రూప్తో పాటు ఢిల్లీకి చెందిన హిందుస్తాన్ పవర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (హెచ్పీపీఎల్) ఉన్నాయి. ల్యాంకో గ్రూప్ రుణదాతలు బకాయిల రికవరీ కోసం ఈ ప్లాంట్ను అమ్మకానికి పెట్టాయి. ఈ దివాలా పరిష్కార ప్రక్రియకు సలహాదారుగా వ్యవహరిస్తున్న డెలాయిట్కు బిడ్లను తనిఖీ కోసం పంపాలని రుణదాతలు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సలహాదారు అభిప్రాయం ఆధారంగా దివాలా పరిష్కార ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని రుణదాతలు భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) నేతృత్వంలోని రుణదాతల కన్సార్షియానికి ల్యాంకో ఇన్ఫ్రాటెక్ రూ.12,000 కోట్లకు పైగా బకాయిపడింది.

*మధ్యప్రదేశ్లోని ఇండోర్, మహారాష్ట్రలోని గోందియా, హైదరాబాద్ మధ్య వచ్చే నెల 13 నుంచి విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు ఫ్లై బిగ్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉడాన్ పథకంలో భాగంగా నడిపే ఈ విమాన సర్వీసు టికెట్ల బుకింగ్ (ఆన్లైన్, విండో) సౌకర్యం వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కానుందని ఫ్లై బిగ్ ఎయిర్లైన్స్ చైర్మన్, ఎండీ సంజయ్ మాండవీయ తెలిపారు. టికెట్ చార్జీని రూ.1,999గా నిర్ణయించినట్లు, గరిష్ఠ ధర రూ.2,600గా ఉండనుందని ఆయన వెల్లడించారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వచ్చేనెల 13న ఇండోర్ నుంచి ఈ విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు భండారా-గోందియా నియోజకవర్గ ఎంపీ సునీల్ మేండే తెలిపారు.

*వ్యాపార టర్నోవర్ రూ.20 కోట్లు దాటిన సంస్థలు.. బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ఇన్వాయి్సలను జనరేట్ చేయటం తప్పనిసరని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. వస్తు సేవల పన్ను (జీఎ్సటీ) కింద రూ.500 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలు బీ2బీ లావాదేవీల ఎలకా్ట్రనిక్ ఇన్వాయిస్ను 2020 అక్టోబరు 1 నుంచి ప్రభుత్వం అమలు చేస్తోంది. అలాగే 2021 జనవరి 1 నుంచి రూ.100 కోట్లు పైబడిన టర్నోవర్ కలిగిన సంస్థలకు, గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి రూ.50 కోట్ల పైబడిన సంస్థలకు దీన్ని వర్తింప చేసింది. తాజాగా దీన్ని రూ.20 కోట్ల పైబడిన టర్నోవర్ కలిగిన సంస్థల బీ2బీ లావాదేవీలకు దీన్ని వర్తింప చేసింది.

*యూకేకు చెందిన డేటా అనలిటిక్స్, ఈఆర్పీ స్పెషాలిటీ సంస్థ కగూల్ డేటా.. హైదరాబాద్లో తన కార్యకలాపాలను విస్తరించింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని కపిల్ టవర్స్లో రెండో డెవలప్మెంట్ను ఏర్పాటు చేసింది. కగూల్.. హైదరాబాద్లో 2017లో తొలి సెంటర్ను ఏర్పాటు చేసింది. విస్తరణలో భాగంగా హైదరాబాద్లో రెండో సెంటర్ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ ఇండియా హెడ్ కల్యాణ్ గుప్తా బ్రహ్మాండ్లపల్లి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంటర్లో 200 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా అందులో 70 శాతం మంది స్థానికులేనని ఆయన పేర్కొన్నారు. కాగా 2025 చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను 2,000కు పెంచటమే కాకుండా రూ.38 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కల్యాణ్ చెప్పారు. ప్రస్తుతం కగూల్ డేటా.. యూకే, అమెరికా, భారత్, మలేషియా, దక్షిణ అమెరికా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోందన్నారు. ఈ మధ్యనే అమెరికాలోని షికాగోలో డెవల్పమెంట్ సెంటర్ను ఏర్పాటు చేయగా త్వరలోనే మలేషియాలో కొత్త సెంటర్ను నెలకొల్పనున్నట్లు కల్యాణ్ తెలిపారు.

*ఈ ఏడాది ఆగస్టు 15 నాటికల్లా దేశంలో 5జీ టెలికాం సేవలు ప్రారంభించాలని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఆసక్తితో ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని స్పెక్ట్రమ్ వేలానికి సంబందించిన విధి విధానాలపై ట్రాయ్ తన సిపారసులు వెంటనే పంపాలని ప్రభుత్వం కోరింది. 5జీ సేవల కోసం వేలం వేయాల్సిన స్పెక్ట్రమ్ బ్యాండ్, ధర వంటి విషయాలపై వచ్చే నెలాఖరులోగా ట్రాయ్ సిఫారసులు అందజేయాలని టెలికాం శాఖ (డాట్) కోరింది. ట్రాయ్ నుంచి సిఫారసులు అందితే మే లేదా జూన్ కల్లా 5జీ స్పెక్ట్రమ్ వేలం పూర్తి చేయాలని డాట్ భావిస్తోంది.

*ఎన్ఎస్ఈ కో-లొకేషన్ కేసులో దర్యాప్తును సీబీఐ మరింత విస్తృతం చేసింది. ఈ కేసులో ఎన్ఎ్సఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ అధికారి (జీఓఓ) ఆనంద్ సుబ్రమణియన్ను చెన్నైలో అరెస్టు చేసింది. మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణ కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించిన గుర్తు తెలియని యోగి.. సుబ్రమణియన్ అన్న వార్తల నేపథ్యంలో సీబీఐ ఆయన్ను అరెస్టు చేయడం విశేషం. గత కొద్ది రోజుల్లో సీబీఐ అధికారులు.. ఆనంద్ను పలు మార్లు ప్రశ్నించారు. సరైన సమాధానాలు రాకపోవడంతో ఆయన్ని అరెస్టు చేసి ప్రశ్నించాలని సీబీఐ నిర్ణయించింది. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే ఎన్ఎన్సీ మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణ, మరో మాజీ సీఈఓ రవి నారాయణ్, ఇంకా పలువురు అధికారులను ప్రశ్నించింది.

*నాగార్జునా ఆయిల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ కోస్టల్ అయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫ్రా లిమిటెడ్ను (సీఓజీఐఎల్) హల్దియా పెట్రోకెమికల్స్ లిక్విడేషన్ ప్రక్రియలో చేజిక్కించుకుంది. ఛటర్జీ గ్రూప్ (టీసీజీ) అనుబంధ సంస్థ హెచ్పీఎల్ సమర్పించిన లిక్విడేషన్ ప్లాన్ను ఎన్సీఎల్టీ అమరావతి బెంచి గత వారంలో ఆమోదించింది. కొనుగోలు కోసం రూ.37.5 కోట్లు చెల్లించేందుకు హెచ్పీఎల్ అంగీకరించింది. గత రెండేళ్ల కాలంలో దివాలా ప్రక్రియలో టీసీజీ గ్రూప్ చేజిక్కించుకున్న మూడో కంపెనీ ఇది. విశాఖపట్నంలో రిజిస్టర్ అయిన సీఓజీఐఎల్కు తమిళనాడులోని కడలూర్లో 322 ఎకరాల భూమి ఉంది. అది ఈ లిక్విడేషన్ ప్రక్రియలో హెచ్పీఎల్ చేతికి మారుతుంది.