Movies

అదే నిజమైన సంతోషం

Auto Draft

మనసుకు నచ్చింది చేసినప్పుడే నిజమైన సంతోషం కలుగుతుందని, తనకు డ్యాన్సులు చేసినప్పుడు అలాంటి అనుభూతికి లోనవుతానని అంటున్నది బాలీవుడ్‌ తార సాన్యా మల్హోత్రా. డ్యాన్సర్‌గా కార్యక్రమాలు చేస్తూ చిత్ర పరిశ్రమను ఆకర్షించింది సాన్యా. ఆ తర్వాత అమీర్‌ ఖాన్‌ ‘దంగల్‌’ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా సూపర్‌హిట్‌ కావడంతో బాలీవుడ్‌ యువ తారల్లో ఒకరిగా మారిపోయింది సాన్యా. ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’, ‘పటాకా’, ‘బదాయి హో’, ‘శకుంతలా దేవి’ లాంటి చిత్రాలతో నటిగా పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన కొత్త సినిమా ‘లవ్‌ హాస్టల్‌’ తాజాగా విడుదలైంది. డ్యాన్స్‌ చేసినప్పుడు నా మనసు బాల్యానికి వెళ్తుంది. అప్పుడు నిజమైన సంతోషాన్ని అనుభవిస్తా. సినిమాల్లో బీట్‌ పాటలకు డ్యాన్సులు చేయాలని ఉంది. అలాంటి అవకాశం కోసం చూస్తున్నా. నేను నటిగా మారి పేరు తెచ్చుకున్నాక కూడా మా ఇంట్లో వాళ్లకు సినిమాల గురించి తెలియదు. మేము రోజుకు 13 గంటలు కష్టపడతాం. అమ్మకు ఆ విషయం తెలియదు. ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా నేర్చుకోవచ్చు కదా అంటుంటుంది’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సాన్యా. ప్రస్తుతం సాన్యా తెలుగు సినిమా ‘హిట్‌’ హిందీ రీమేక్‌లో నాయికగా నటిస్తున్నది.