ఏళ్ల వయసులో మోడలింగ్‌లో అడుగుపెట్టారు బాలీవుడ్ నటి దీపికా పడుకోన్. అప్పట్లో ఎదురైన ఓ సంఘట చాలా బాధ కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆ విషయాన్ని పంచుకున్నారు. ‘‘కెరీర్ బిగినింగ్ ఉచిత సలహాలు ఇచ్చేవారు చాలామందే ఉంటారు. నాకు కూడా అలాంటి సలహాలిచ్చినవారు చాలామందే ఉన్నారు. అందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. సినిమాల కన్నా ముందు నేను మోడలింగ్ చేసేదాన్ని. ఆ సమయంలో ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చి మీరు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ సర్జరీ చేయించుకోండి అని అన్నారు. అది నాకు చెడుగా, ఇబ్బందికరంగా అనిపించింది. అయినా నేనంత సీరియస్‌గా తీసుకోలేదు. ఆ వయసులోనే సున్నితమైన విషయం గురించి అంత పరిణీతితో ఎలా ఆలోచించగలిగానా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మంచి సలహా విషయానికొస్తే.. నటిగా నా రెండో చిత్రం, బాలీవుడ్‌లో తొలి చిత్రం ‘ ఓం శాంతి ఓం’. షారుక్‌తో నటించా. సెట్‌లో ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నా. సలహాలు కూడా ఇచ్చేవారు. ‘‘నీకు మంచి టైమ్‌ని పంచే వ్యక్తులతో పని చేయ్యి. దీని వెనుక ఓ బలమైన కారణం ఉంది. సినిమా కానీ, ఏదైనా పని చేస్తున్నామంటే అందులోనే నీ జీవితాన్ని గడుపుతున్నావ్. అవే మనకు జ్ఞాపకాలు అవుతాయి. మంచి అనుభవాలను ఇస్తాయి అని ఆయన చెబుతుండేవారు. నేను అదే ఫాలో అవుతుంటా’’ అని దీపిక చెప్పుకొచ్చారు.