Health

జీర్ణ సమస్యలకు ఇంగువ!

జీర్ణ సమస్యలకు ఇంగువ!

ఆహార పదార్థాల్లో రుచి, సువాసన కోసం ఇంగువ వాడకం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇంగువ తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారని పోషకాహార నిపుణులు అంటున్నారు. అంతేకాదు.. ఐబీఎస్ వంటి సమస్య ఉన్నా తొలగిపోతుందని అంటున్నారు. రక్తంలో గ్లూకోజ్ నిలువలు, బీపీ నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుందని వివరిస్తున్నారు. ఇంకా ఏం ప్రయోజనాలు చేకూరుతాయంటే…ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో చిటికెడు కన్నా కాస్త తక్కువ ఇంగువ వేయాలి. ఆ నీటిని పరగడుపున తాగాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు. ఇంగువ నీరు జీవక్రియల రేటు పెరిగేలా చేస్తుంది. ఫలితంగా జీర్ణశక్తి పెరుగుతుంది. ప్రతిరోజు ఇంగువ నీటిని తాగితే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ఇంగువలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలను ఇంగువ దూరం చేస్తుంది. ఈ సీజన్లో వచ్చే ఫ్లూను ఎదుర్కోవడానికి ఇంగువ నీరు బాగా పనికొస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఇంగువ నీరు ఉపశమనాన్ని అందిస్తుంది. మెనుస్ట్రువల్ క్రాంప్స్ను తగ్గించడంలో మందుల కన్నా ఇంగువ నీరు బాగా పనిచేస్తుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. జీర్ణసంబంధ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ముఖ్యంగా ఐబిఎస్తో బాధపడుతున్న వారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.