NRI-NRT

పోలాండ్, హంగేరిలకు వెళ్తున్న ఏపీ అధికారులు

పోలాండ్, హంగేరిలకు వెళ్తున్న ఏపీ అధికారులు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భీకర పోరు జరుగుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ ప్రజలను, విద్యార్థులను రక్షించడానికి పోలాండ్, హంగేరీల దేశాలకు ఏపీ ప్రతినిధులను పంపాలను నిర్ణయించింది. తక్షణమే ఏపీ ప్రతినిధులను పంపాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. తెలుగు విద్యార్థుల తరలింపు కోసం ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. విద్యార్థుల వివరాలను విదేశాంగ శాఖకు ఏపీ సర్కార్ అందించింది.