ప్రముఖ టెక్ దిగ్గజం, ప్రీమియం మొబైల్ తయారీ సంస్థ యాపిల్ కంపెనీ రష్యాకు భారీ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్-రష్యా మధ్య ఇంకా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యాపిల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాలో యాపిల్ కంపెనీకి చెందిన అన్నీ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు అమెరికన్ టెక్నాలజీ కంపెనీ యాపిల్ ప్రకటించింది. ఒక ప్రకటనలో యాపిల్ “మేము రష్యాలో అన్ని ఉత్పత్తి అమ్మకాలను నిలిపిచేసాము. గత వారం, ఆ దేశానికి మా కంపెనీ ఉత్పత్తుల ఎగుమతులను నిలిపివేశాము” అని పేర్కొంది. అలాగే, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల కారణంగా ఆపిల్ కంపెనీ రష్యాలో ఆపిల్ పే, ఇతర సేవలను పరిమితం చేసినట్లు పేర్కొంది.
రష్యాకు భారీ షాక్ ఇచ్చిన యాపిల్ కంపెనీ..!
