DailyDose

అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం

అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం

అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. అమరావతినే ఏపీ రాజధానిగా నిర్ధారిస్తూ 2022-23 బడ్జెట్‌లో కేటాయింపులను కేంద్రం ప్రకటించింది. విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులను కేంద్ర కేటాయించింది. ఏపీ నూతన రాజధాని అమరావతి పేరుతోనే బడ్జెట్‌లో ప్రొవిజన్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. కేంద్ర బడ్జెట్‌లో పట్టణాభివృద్ధి శాఖ నుంచి అమరావతిలో సచివాలయం, ఉద్యోగుల నివాస గృహాల నిర్మాణానికి నిధులను కేటాయించారు. సచివాలయ నిర్మాణానికి రూ.1214 కోట్లను అంచనా వ్యయంగా కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల నివాస గృహాల కోసం రూ. 1126 కోట్లను కేంద్రం అంచనా వేసింది. ఈ బడ్జెట్‌లో రూ. లక్షల రూపాయలను పట్టణాభివృద్ది శాఖ కేటాయించింది. GPOA కి భూసేకరణ కోసం రూ. 6.69 కోట్ల అంచనా వ్యయంగా పేర్కొంది. 2020-21, 2021-22 బడ్జెట్‌లలో మొత్తం రూ. 4.48 కోట్లను కేంద్రం ఖర్చు చేయనుంది. ఉద్యోగుల నివాస గృహాలకు అవసరమైన భూ సేకరణకు 2021-22లో రూ. 21 కోట్లు అంచనా వేసి ఇప్పటి వరకు రూ.18.3 కోట్లను కేంద్రం ఖర్చు చేసింది.