హాటెస్ట్ అందాలతో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ కుర్రకారు మతుల్ని చెడగొట్టే మలయాళ మగువ మాళవికా మోహనన్ తాను ప్రేమలో ఉన్నానని, బాయ్ ఫ్రెండ్ను పరిచయం చేస్తానని కొన్నాళ్ళుగా ఊదరగొడుతున్నది. పైగా , తన బాయ్ ఫ్రెండ్ను పరిచయం చేసే వీడియో లింక్కు మిలియన్ వ్యూస్ రావాలన్నది. ఇంత హడావిడి చేసి, ప్రేమను వ్యక్తంచేస్తూ భావోద్వేగ పదాలను వాడుతూ ఓవర్ చేసి, కింద ఓ కార్ కంపెనీ ప్రకటన పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫాలోయర్లకు కోపం వచ్చి, దయ చేసి అభిమానుల ఎమోషన్లతో కామెడీ చెయ్యకు ” అంటూ కామెంట్లు పెడుతన్నారు.