DailyDose

ఘనంగా ‘రామినేని’ విద్యా పురస్కారాల ప్రధానం

ఘనంగా ‘రామినేని’ విద్యా పురస్కారాల ప్రధానం

కేంద్రప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన కస్తూరి రంగన్‌ విద్యావిధానం మన భారతీయ సంస్కృతికి ప్రతిబింబం వంటిదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ నూతన విద్యావిధానం భారత్‌ను మళ్లీ ‘విశ్వగురువు’గా మార్చేందుకు దోహదపడుతుందని చెప్పారు.
Whats-App-Image-2022-03-02-at-13-12-13-1
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నూతన విద్యావిధానాన్ని అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ హాలులో డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన గురు పురస్కారాలు, ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ సభలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. కులం, మతం, వర్గం, జిల్లా, భాష పేరుతో సమాజాన్ని చీల్చే వ్యక్తులను, శక్తులను దూరంగా పెట్టాలన్నారు.
Whats-App-Image-2022-03-02-at-13-12-13-2
ఈ సందర్భంగా 2020, 2021 సంవత్సరాలకు సంబంధించి 32 మంది మండల విద్యాశాఖాధికారులకు గురు పురస్కారాలను, 286 మంది హైస్కూల్‌ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా రామినేని ఫౌండేషన్‌ వెంకయ్యను ఘనంగా సత్కరించి ఆయనకు బొబ్బిలి వీణను బహూకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఆర్జీయూకేటీ వీసీ ఆచార్య కె హేమచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కార్యదర్శి పాతూరి నాగభూషణం పాల్గొన్నారు.
Whats-App-Image-2022-03-02-at-13-12-13
డాక్టర్ రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2020-21కి గాను గురు సన్మానం మరియు ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేయడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారత ఉపరాష్ట్రపతి.. శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.. అలాగే రాష్ట్ర మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారికి, గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి హెని క్రిస్టినా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారికి, మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డ, మురుగుడు హనుమంతరావు, ఐఏఎస్ సిసోడియా, హేమచంద్రారెడ్డి తదితరులకు ధన్యవాదాలు తెలిపిన ఫౌండేషన్ కన్వీనర్ మరియు గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం, ఫౌండేషన్ చైర్మన్ ధర్మప్రచారక్.