Movies

ఏం చేయాలో తెలియట్లేదంట

ఏం  చేయాలో తెలియట్లేదంట

మల్టీ టాలెండెట్‌ హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. డాక్టర్ల సూచనల మేరకు ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అనుక్షణం బిజీగా ఉండే శ్రుతీకి ఇంట్లో ఖాళీగా కూర్చోవడం చాలా బోరింగ్‌గా ఉందట. పైగా చాలా నీరసంగా ఉందనీ, ఏమీ తోచని స్థితిలో ఉన్నానంటోంది. ‘‘కరోనా వల్ల రెండు రోజులకే చాలా నీరసించిపోయాను. ఏం చేయాలో తెలియడం లేదు’’ అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టేటస్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం శ్రుతీ పోస్ట్‌ వైరల్‌గా మారింది. త్వరగా కోలుకోవాలని కొందరు సినీ తారలు, అభిమానులు ఇన్‌స్టా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ‘మీ అందరి బ్లెసింగ్స్‌తో త్వరలో కోలుకుని వస్తాను’’ అని శ్రుతీహాసన్‌ సమాధానమిచ్చారు.ఆమె నటించిన  బెస్ట్‌ సెల్లర్‌’ వెబ్‌ సిరీస్‌ ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌తో ‘సలార్‌’, గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది.