Business

రష్యా దెబ్బకు కుదేలైన స్టాక్ మార్కెట్లు – TNI వాణిజ్యం

రష్యా దెబ్బకు కుదేలైన స్టాక్ మార్కెట్లు – TNI  వాణిజ్యం

* ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధరలు ఎగబాకుతున్నాయి. ఈ ప్రభావం ప్రపంచదేశాలతో పాటు భారత్ మీదా పడనుంది. ప్రస్తుతం ఎన్నికల కారణంగా స్థిరంగా కొనసాగుతున్న ఇంధన ధరలు.. త్వరలో రికార్డు స్థాయిలో పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణ కొనసాగుతున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం బ్యారెల్ చమురుపై ఐదు డాలర్ల మేర పెరిగింది. న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్స్ఛేంజీ ప్రకారం.. బెంచ్‌మార్క్‌ యూఎల్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 5.24 డాలర్లు పెరిగి 108.60 డాలర్లకు చేరింది. మన దేశంలో ప్రామాణికంగా తీసుకునే బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌పై 5.43 డాలర్లు ఎగబాకి 110.40 డాలర్లకు పెరిగింది. ‘ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ’లోని 31 దేశాలు 60 మిలియన్‌ బ్యారెళ్ల చమురును వ్యూహాత్మక నిల్వల నుంచి విడుదల చేసేందుకు అంగీకరించాయి. ధరల కట్టడి నిమిత్తమే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించాయి. కానీ, మార్కెట్లు దీన్ని ప్రతికూల ధోరణిలో తీసుకున్నాయి. నిల్వల విడుదలతో రష్యా నుంచి సరఫరా దెబ్బతింటుందన్న విషయం స్పష్టమైందని మార్కెట్‌ వర్గాలు భావించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

* సూచీల కుదేలు..రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. మండుతున్న చమురు ధరలు.. ఫలితంగా అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఉదయం నుంచి భారీగా పతనమవుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్ల నష్టంతో.. 55 వేల 40 వద్ద కొనసాగుతోంది.నిఫ్టీ దాదాపు 300 పాయింట్లు కోల్పోయి.. 16 వేల 485 వద్ద ఉంది.లాభనష్టాల్లో..యుద్ధం జరుగుతున్నా.. కోల్ ఇండియా, హిందాల్కో, టాటా స్టీల్ మాత్రం 5 శాతానికిపైగా పెరిగాయి. ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ 4 శాతం చొప్పున లాభపడ్డాయి.మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డీలాపడ్డాయి.సెన్సెక్స్ 30 ప్యాక్లో ఐదు షేర్లు మినహా అన్నీ నష్టాల్లోనే ఉండటం గమనార్హం

* టెస్లా కార్ల తయారీ కంపెనీ ఉక్రెయిన్ నుంచి పారిపోతున్న ప్రజలకు ఉచిత ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్‌ను అందిస్తామని ప్రకటించింది. రష్యా సైనిక దాడి నేపథ్యంలో ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా సహాయ పడేందుకు ఉచితంగా కార్లకు ఛార్జింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు టెస్లా తెలిపింది.టెస్లా, నాన్-టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం ఛార్జింగ్ స్టేషన్లను సిద్ధం చేసినట్లు టెస్లా ఈమెయిల్‌లో ప్రకటించింది.ఉక్రెయిన్ దేశ సరిహద్దుల్లోని ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం ట్ర్జెబౌనిస్కో (పోలాండ్), కోయిస్ (స్లోవేకియా), మిస్కోల్క్ (హంగేరి)లలో టెస్లా కార్ల తయారీ కంపెనీ విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది.యుద్దాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు టెస్లా కంపెనీ విద్యుత్ వాహనాలకు ఉచితంగా ఛార్జింగ్ చేసుకునేందుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది

* ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా మొండిపట్టు వీడకపోవడంతో స్టాక్‌ మార్కెట్లు నష్టపోతున్నాయి. రష్యా – ఉక్రెయిన్‌ల మధ్య జరిగిన మొదటి దఫా చర్చలు విఫలమైన తర్వాత ప్రపంచ దేశాలు రష్యపై ఆర్థిక ఆంక్షలు తీవ్రతరం చేశాయి. మరోవైపు రష్యా తన దాడులను ఉదృతం చేసింది. ఫలితంగా యుద్ధ పరిణామాలు మరింత సంక్షోభం దిశగా పయణిస్తున్నాయి. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడటానికే ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ప్రపంచ మార్కెట్లలో జోరు తగ్గింది, ఏషియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. ఉదయం 10 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 750 పాయింట్లు నష్టపోయి 55,497 పాయిం‍ట్ల దగ్గర ట్రేడవుతోంది. గత రెండు రోజులుగా వచ్చిన లాభాలు హుష్‌ కాకి అయ్యాయి. మరోసారి సెన్సెక్స్‌ 56 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయింది16,638 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ఉండగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, పవర్‌గ్రిడ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఏషియన్‌ పేయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.

* రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.3,157 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఇది గత ఏడాది ఫిబ్రవరి కంటే 19 శాతం ఎక్కువ. అటు, తెలంగాణలో కూడా జీఎస్టీ ఆదాయం 13 శాతం పెరిగి రూ.4,113 కోట్లకు చేరుకున్నది. ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు ఉన్నప్పటికీ జీఎస్టీ వసూళ్లలో పెరుగుదల కనిపించింది.

*స్కోడా ఆటో ఇండి యా కొత్త కారు స్లావియా 1.0 టీఎ్సఐని మార్కెట్లో విడుదల చేసింది. ఢిల్లీలో ఈ కారు ప్రారంభ ధర రూ.10.69 లక్షలు (ఎక్స్షోరూమ్). ఇందులో మూ డు వేరియెంట్లుంటాయి. యాక్టివ్, యాంబిషన్, స్టైల్. హై ఎండ్లోని స్టైల్ సన్రూఫ్ లేకుండా రూ.13.59 లక్షలు, సన్రూ్ఫతో రూ.13.99 లక్షలు కాగా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కారు ధర రూ.15.39 లక్షలు. 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్, ఒక లీటరు పెట్రోల్ ఇంజన్ దీని ప్రత్యేకతలు.

*దేశంలో అతిపెద్ద డ్రైసెల్ బ్యాటరీల తయారీ సంస్థ ఎవరెడీ ఇండస్ట్రీస్ యాజమాన్యం చేతులు మారే సూచనలు కనిపిస్తున్నాయి. కంపెనీ ఈక్విటిలో ఇప్పటికే 25.11% వాటా కలిగిన డాబర్ ఇండియా ప్రమోటర్లు ‘బర్మన్’ కుటుంబం మరో 26% షేర్ల కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఒక్కో షేరును రూ.320కి కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఎవరెడీ ప్రస్తుతం బీఎం ఖైతాన్ గ్రూప్ చేతిలో ఉంది. కంపెనీ ఈక్విటీలో ప్రస్తుతం వీరి వాటా 4.84% మాత్రమే. దీంతో కంపెనీని దక్కించు కునేందుకు బర్మన్ కుటుంబం ఈ ఆఫర్ ప్రకటించింది.

*హైదరాబాద్కు చెందిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ బ్రైట్కామ్ గ్రూప్ లిమిటెడ్పై క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ ఫోరెన్సిక్ ఆడిటింగ్కు ఆదేశించింది. కంపెనీ పద్దులను తనిఖీ చేసేందుకు డెలాయిట్ టచ్ థోమట్సు ఇండియా ఎల్ఎల్పీని ఫోరెన్సిక్ ఆడిటర్గా నియమించింది.

*ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది రష్యా. తాజాగా వడ్డీ రేట్లను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేటును 9.5 శాతం నుంచి 20 శాతానికి పెంచుతూ రష్యన్ సెంట్రల్ బ్యాంక్ సోమవారం నిర్ణయం తీసుకుంది.

*అర్హులైన బిడ్డర్లు లేకపోవడంతో ప్రభుత్వ రం గంలోని భారత్ బ్రాడ్బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ (బీబీఎన్ ఎల్) రూ.19,000 కోట్ల విలువ గల టెండర్ను రద్దు చేసింది. దేశంలోని 16 రాష్ర్టాల్లో 3.61 లక్షల గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్తో అనుసంధానం చేసేందుకు ఈ టెండర్లను ఆహ్వానించారు.

*చమురు మంట ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) భారత ఆర్థిక వ్యవస్థపై పెనుభారం మోపనుంది. 2022 మార్చి నాటికి ముడి చమురు దిగుమతి బిల్లు 11,000 నుంచి 11,500 కోట్ల డాలర్లకు (సుమారు రూ.8.25 లక్షల కోట్ల నుంచి రూ.8.62 లక్షల కోట్లు) చేరుతుందని అంచనా. గత ఆర్థిక సంవత్సరం (2020-21)తో పోలిస్తే దిగుమతుల బిల్లు 2021-22లో దాదాపు రెట్టింపు కానుంది. పెట్రోలియం మంత్రి త్వ శాఖకు చెందిన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాల్సిస్ సెల్ (పీపీఏసీ) ఈ విషయం పేర్కొంది.

*ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కనీసం 200 ఫ్యూచర్ రిటైల్ స్టోర్ల కార్యకలాపాలను తన ఆధీనంలోకి తీసుకుందని, ఆ స్టోర్లలోని సిబ్బందికి తన కంపెనీలో ఉద్యోగం కూడా ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దివాలా అంచుల్లో ఉన్న ఫ్యూచ ర్ రిటైల్ అద్దె చెల్లించలేకపోవడంతో కంపెనీకి చెందిన పలు స్టోర్ల స్థల యజమానులు రిలయన్స్ను ఆశ్రయించినట్లు వారు చెప్పారు.

*ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కనీసం 200 ఫ్యూచర్ రిటైల్ స్టోర్ల కార్యకలాపాలను తన ఆధీనంలోకి తీసుకుందని, ఆ స్టోర్లలోని సిబ్బందికి తన కంపెనీలో ఉద్యోగం కూడా ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.