Politics

రేపు తెదేపా కీలక భేటీ – TNI రాజకీయ వార్తలు

రేపు తెదేపా కీలక భేటీ –  TNI రాజకీయ వార్తలు

* రేపు తెదేపా పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాాలా? వద్దా? అనే అంశంతో పాటు పలు విషయాలను చర్చించనున్నారు.తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన రేపు పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా.. వద్దా అనే అంశంపై ఈ మీటింగ్లో చర్చించనున్నారు. తాను సీఎంగానే అసెంబ్లీకి వస్తానని ప్రకటించిన చంద్రబాబు గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. చంద్రబాబు లేకున్నా మిగిలిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యే అంశంపై భేటీలో నిర్ణయించనున్నారు.రాష్ట్రంలో అనేక సమస్యలున్నందున అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని మెజార్టీ నేతలు అభిప్రాయపడుతుండగా.. అసెంబ్లీకి వెళ్లినా సమస్యలను ప్రస్తావించే అవకాశం వైకాపా ఇవ్వదని పలువురు నేతలు అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు భవిష్యత్ కార్యాచరణపై పొలిట్ బ్యూరో సమీక్షించనుంది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల నిర్వహణ, పార్టీ ఆవిర్భావ వేడుకలపైన సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు

*కేసీఆర్ ఓ మోనార్క్: ఉత్తమ్‌ గవర్నర్ వ్యవస్థను కించపరుస్తున్న కేసీఆర్ ఓ మోనార్క్ అని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ రాజ్యాంగాన్ని పూర్తిగా అవమానపరుసున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాలను, జుడీషియల్, పరిపాలనా వ్యవస్థ, మీడియా సహా అన్ని వ్యవస్థలను కేసీఆర్ సర్వనాశనం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీస్ వ్యవస్థలంటే కేసీఆర్‌కు పడదని ఉత్తమ్‌ విమర్శించారు

* అఖిలేష్‌కు మద్దతుగా మరోసారి యూపీకి దీదీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో సమాజ్‌వాదీ పార్టీకి అనుకూలంగా ఉత్తరప్రదేశ్ వెళ్లి మరీ ప్రచారం నిర్వహించి వచ్చారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ. తాజాగా మరోసారి ఉత్తరప్రదేశ్ వెళ్లి ప్రచారం నిర్వహించనున్నట్లు ఆమె ప్రకటించారు. ‘‘అఖిలేష్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి వారణాసికి వెళ్లబోతున్నాను. అలాగే వారణాసి గుడిని కూడా దర్శించుకుంటాను. బెంగాల్ ప్రజల ఆశీర్వాదం తీసుకున్నాకే యూపీకి వెళ్తున్నాను’’ అని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మమతా బెనర్జీ అన్నారు.

* ఏపీ డీజీపీగా కసిరెడ్డికి అర్హత లేదు: ఎంపీ రఘురామ ఏపీ కొత్త డీజీపీ నియామకంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, యూపీఎస్సీ చైర్మన్‌ ప్రదీప్‌కుమార్‌ జోషీకి ఎంపీ రఘురామ లేఖ రాశారు. ఏపీ డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఆ అర్హత లేదని రఘురామ పేర్కొన్నారు. సీఎం సొంత జిల్లా, సొంత సామాజిక వర్గానికి చెందిన వాడని కసిరెడ్డిని డీజీపీ చేశారని ఆయన ఆరోపించారు. డీజీ స్థాయి అధికారులు ఉండగా ఏడీజీ స్థాయి కసిరెడ్డికి ఉన్నతపీఠం కట్టబెట్టారన్నారు. డీజీ ర్యాంకులో ఉన్న 12 మంది అధికారులకు అన్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు. కేంద్రం, యూపీఎస్సీ వెంటనే జోక్యం చేసుకుని ఏపీలో స్వచ్ఛమైన పాలన సాగేలా చూడాలని రఘురామ కోరారు. గౌతం సవాంగ్‌ పేరుతో కలిపి ముగ్గురు అధికారుల పేర్లతో ప్రతిపాదనలు పంపేలా చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు. సీనియార్టీ, మెరిట్‌ ప్రాతిపదికన ముగ్గురు సీనియర్‌ అధికారుల జాబితాకు వెంటనే జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో ఎంపీ రఘురామ విజ్ఞప్తి చేశారు.

* వారణాసిలో బీజేపీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ప్రచారం?
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాజకీయ యుద్ధం ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీలో మకాం వేశారు. ఫెడరల్ ఫ్రంట్ చర్చలు ముమ్మరం చేసిన గులాబీ దళపతి యూపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. మోదీ నియోజక వర్గమైన వారణాసిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నట్లు సమాచారం.బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తానన్న సీఎం కేసీఆర్ ఆ దిశగా పావులు వేగంగా కదుపుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ చర్చలను ముమ్మరం చేయనున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భేటీ కావడంతోపాటు.. యూపీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారని సమాచారం. ప్రధాని నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి సెగ్మెంట్‌లోనే కేసీఆర్ ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తామంటూ గతంలో సీఎం కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంకేతాలిచ్చారు. వారణాసి లోక్ సభ స్థానం పరిధిలో ఈ నెల 7న ఏడో విడత యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ నెల 4న అక్కడ ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఎన్సీపీ నేత శరద్ పవర్ వెళ్లే అవకాశాలున్నాయి. వారితో పాటు కేసీఆర్ కూడా వారణాసి ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.

* ప్ర‌గ‌తి ప‌థంలో తెలంగాణ రాష్ట్రం : మంత్రి కేటీఆర్
తెలంగాణ అన్ని రంగాల్లో ప్ర‌గ‌తి ప‌థంలో ప‌య‌నిస్తోంద‌న్నారు. తెలంగాణ‌లో మౌలిక సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. బేగంపేట‌లోని గ్రాండ్ కాక‌తీయలో నిర్వ‌హించిన సీఐఐ స‌మావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.టీఆర్ఎస్ ఏడున్న‌రేండ్ల పాల‌న‌లో త‌ల‌స‌రి ఆదాయం బాగా పెరిగింద‌ని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో త‌ల‌స‌రి ఆదాయం రూ. 2.78 ల‌క్ష‌ల‌కు చేరింద‌న్నారు. ప‌శ్చిమ బెంగాల్, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర త‌ర్వాత పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌న‌దే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. 20 ఏండ్ల క్రితం హైద‌రాబాద్‌లో పెద్ద‌గా కంపెనీలు లేవు. ఇప్పుడు హైద‌రాబాద్‌లో అనేక ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కంపెనీలు ఉన్నాయి. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆవిష్క‌ర‌ణ‌లు, స్టార్ట‌ప్‌ల‌ను బాగా ప్రోత్స‌హిస్తుంద‌న్నారు. తెలంగాణ‌లో ఎన్నో స్టార్ట‌ప్‌లు వ‌చ్చి విజ‌య‌వంతంగా న‌డుస్తున్నాయి. త‌మ ప్ర‌భుత్వం తెచ్చిన టీఎస్ ఐపాస్ బాగా విజ‌య‌వంత‌మైంద‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు 15 రోజుల్లోనే అనుమ‌తులు ఇస్తున్నామ‌ని తెలిపారు. 500 మీట‌ర్ల కంటే త‌క్కువ విస్తీర్ణం ఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌త్వ‌ర అనుమ‌తి ఇస్తున్నామ‌ని చెప్పారు.

* రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చు: అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చని.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కార్యకర్తలకు సూచించారు. రాష్ట్ర సర్కార్ అవలంభిస్తున్న రైతు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావచ్చు: అచ్చెన్నాయుడురాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. కచ్చితంగా 160 స్థానాల్లో తెలుగుదేశం విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌లో తెలుగురైతు విభాగం కార్యశాలలో అచ్చెన్న పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి రైతును కలిసి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో వివరించాలన్నారు.రైతులను సీఎం జగన్‌ ప్రభుత్వం అడుగడుగునా ముంచిందన్నారు. ఉద్యోగుల నుంచి పేదల వరకు ప్రతీ రంగాన్ని ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసును తెదేపాకు అంటగట్టాలని చూశారని మండిపడ్డారు. వివేకా హత్య ద్వారా వచ్చిన సానుభూతితోనే జగన్‌ సీఎం అయ్యారు.. వివేక కేసులో నిందితులను ఎందుకు శిక్షించట్లేదని నిలదీశారు.

* భారతీయులను వెనక్కి తెచ్చే ఏ ప్రయత్నాన్నీ వదలం:
యుద్ధంతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ నుంచి భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఏ ఒక్క ప్రయత్నాన్నీ వదిలి పెట్టేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోన్‌భద్ర జిల్లాలో బుధవారంనాడు జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, ఆపరేషన్ గంగా పేరుతో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా వెనక్కి తెస్తున్నామని చెప్పారు. వేలాది మందిని ఇప్పటికే భారత్‌తు తీసుకువచ్చామని చెప్పారు. తాము చేపట్టిన ఆపరేషన్‌ను మరింత వేగవంతం చేసేందుకు నలుగురు మంత్రులను కూడా అక్కడకు పంపామని, భారతీయులను సురక్షితంగా తెచ్చేందుకు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని కూడా వదలిపెట్టేది లేదని అన్నారు. ఇండియా బలం పెరుగుతున్నందున్నే మనం ఇలాంటి సురక్షిత చర్చలు తీసుకోగలుగుతున్నామని అన్నారు. కాగా, ఈనెల 7వ తేదీన జరిగే తుది విడత పోలింగ్‌లో సోన్‌భద్ర జిల్లా కూడా ఉంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటించనున్నారు.

* ఏపీకి కేంద్రం ప్రత్యేకంగా ఆర్థిక సహకారం అందిస్తోంది: సోమువీర్రాజు
సర్పంచుల అధికారాలను కుటుంబ పార్టీలు లాగేసుకున్నాయని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన రూ.7,800 కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు వెళ్లకుండా వైసీపీ దోచుకుంటోందని ఆరోపించారు. ఏపీకి కేంద్రం ప్రత్యేకంగా ఆర్థిక సహకారం అందిస్తోందన్నారు. రేషన్ రాయితీలో బియ్యానికి రూ.33 కేంద్రమే ఇస్తోందన్నారు. రైతులను ఏపీ ప్రభుత్వం ఆదుకోవడంలేదని విమర్శించారు. నిధుల మంజూరులో కేంద్రం ఎంత సహకారం చేసిందో వివరిస్తామని సోమువీర్రాజు పేర్కొన్నారు.

* బ్రాహ్మణులను వైసీపీ సర్కార్ దారుణంగా మోసం చేసింది: Bonda uma
బ్రాహ్మణ సమాజికవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు ప్రభత్వంలో బ్రాహ్మణులకు స్వర్ణ యుగమన్నారు. వైసీపీ గత 3 సంవత్సరాలుగా ఒక్క రూపాయి నిధులు మంజరు చేయలేదని తెలిపారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణ విద్యార్ధులకు స్కాలర్షిప్‌లు, ఫించన్‌లు, అనేక పథకాలు వచ్చేవని గుర్తుచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ కార్పొరేషన్‌ను మూసివేసే దిశగా పాలన ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం వెంటనే ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణులకు అండగా టీడీపీ పోరాటం చేస్తుందని బోండో ఉమా స్పష్టం చేశారు

* భారత్‌లో సక్సెస్‌‌ఫుల్ స్టార్టప్ అంటే తెలంగాణ: మంత్రి KTR
దేశంలో సక్సెస్ ఫుల్ స్టార్ట్ అప్ అంటే తెలంగాణ రాష్ట్రం అని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం సీఐఐ సమ్మిట్‌లో మంత్రి మాట్లాడుతూ…ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ దేశంలో నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అని చెప్పుకొచ్చారు. కొత్త రాష్ట్రంలో ఎన్నో స్టార్టప్‌లో సక్సెస్ ఫుల్‌గా నడుస్తున్నాయన్నారు. టీఎస్ ఐ పాస్‌తో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. విభజన సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నా.. మౌలిక వసతుల్లో ముందుకు దూసుకెళ్తున్నామన్నారు. అగ్రి ఉత్పత్తులు కూడా రాష్ట్రంలో బాగా పెరిగాయని ఆయన అన్నారు. రైతులకు సాయం అందించేందుకు రైతు బంధు తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. పారిశ్రామిక అభివృద్ధి కూడా రాష్ట్రంలో వేగంగా జరుగుతోందన్నారు. ఆత్మనిర్బర్ భారత్ ప్యాకేజితో చాలా మందికి ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు. ఇన్వెస్ట్ ఇండియా కూడా పరిశ్రమలకు మరింత సహకారం అందించాలన్నారు. సీఐఐ కూడా కేంద్రం దగ్గర గట్టిగా మాట్లాడి కొత్త పరిశ్రమలకు లబ్ది చేకూరేలా చూడాలని మంత్రి కేటీఆర్ కోరారు

* జనాల ప్రాణాలు తీసేవారిని కాపాడేందుకే సీఎం ఉన్నారా?: సోమిరెడ్డి
వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు పార్టీలకి అతీతంగా బాధపడ్డామని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వివేకా హత్య కేసు మసిపూసి మారెడుకాయ చేయాలనుకున్నారని విమర్శించారు. నిజం ఎప్పుడు దాగదని.. సీఎం కార్యాలయంలోనే వివేకా హంతకులు ఉండటం దారుణమన్నారు. ఒక ఎంపీ తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవాలని సోమిరెడ్డి పేర్కొన్నారు. సునీత ఇచ్చిన వాంగ్మూలంతో వివేకా హత్య కారకులు ఎవరో తెలిసిపోతుందన్నారు. జనాల ప్రాణాలు తీసేవారిని కాపాడేందుకే సీఎం ఉన్నారా? అని ప్రశ్నించారు. సీఎం మౌనంగా ఉన్నారంటే, మౌనం అర్దాంగీకరమేనన్నారు. వివేకా హత్యతో జగన్మోహన్ రెడ్డి, ఆయన బంధువుల పాపాలు పండాయన్నారు. వైఎస్ వివేకా హత్యకి కారకులైన వాళ్ళు రెండు కళ్లు అని చెప్పుకొనే వాళ్లు ఈ పాలకులని సోమిరెడ్డి పేర్కొన్నారు

* కేసీఆర్ కుటుంబ మూలాలు బీహార్‌లో ఉన్నాయి: రేవంత్‌రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ మూలాలు బీహార్‌లో ఉన్నాయని, కల్వకుంట్ల కుటుంబం బీహార్‌ నుంచి వలస వచ్చిందన్నారు. ఈ విషయాన్ని 2008లో కేసీఆర్‌ ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారన్నారు. అయినా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు 2 సార్లు అధికారం ఇచ్చారన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో అభద్రతా భావం, అనుమానం మొదలైందని, కేసీఆర్‌ వ్యవహారం కూడా అనుమానాలను బలపరుస్తున్నాయని రేవంత్ అన్నారు. సీఎస్ సోమేష్‌కుమార్‌, డీజీపీ అంజనీకుమార్‌తో పాటు.. రజత్‌కుమార్, అరవింద్‌కుమార్, సందీప్‌కుమార్, సుల్తానియా బీహార్ వాళ్లేనన్నారు. ఇతర కీలక శాఖల్లో బీహార్‌ అధికారులకు సీఎం పెద్దపీట వేశారని ఆరోపించారు. ఇక్కడి ఐఏఎస్‌లకు కేసీఆర్‌ అన్యాయం చేస్తున్నారన్నారు. బీహార్‌కు చెందిన మంత్రి సంజయ్‌కుమార్ ఝూ తనపై దాడి చేస్తున్నారని, కేసీఆర్‌ను ఎలా ప్రశ్నిస్తావంటూ సంజయ్‌కుమార్‌ అంటున్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు

* కుమారస్వామి మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన Achennaidu
టీడీపీ కేంద్ర కార్యాలయ ఆహ్వాన కమిటీ కన్వీనర్ వల్లూరి కుమారస్వామి మృతి పట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో రోజూ తన విధులు సమర్థంగా నిర్వర్తించే కుమారి స్వామి గుండెపోటుతో మరణించడం కలచివేసిందన్నారు. పార్టీ కోసం నిత్య సైనికుడిలా ఆయన పనిచేశారన్నారు. కుమారస్వామి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కుమారస్వామి కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు.

*జగన్‌ వెన్నులో వణుకు: బుద్దా
వివేకానందరెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డే దోషి అని సాక్ష్యాలన్నీ రుజువుచేస్తున్న నేపథ్యంలో జగన్‌ను కూడా సీబీఐ విచారించాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అనగానే.. జగన్‌కు చెమటలు పడుతున్నాయని, వెన్నులో వణుకు మొదలైందని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడించడం ద్వారా కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. టీడీపీ నాయకుడు నాగుల్‌ మీరాతో కలిసి మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ఆడిస్తున్న నాటకంలో వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి పాత్రధారులుగా మారారన్న అనుమానం కలుగుతోందంటూ సజ్జల చేసిన ఆరోపణల ఈ నేపథ్యంలో వారిద్దరి (సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి) ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వారికి రక్షణ కల్పించాలని కోరారు. వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ రాష్ట్ర మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను కూడా విచారించి.. తద్వారా అసలు సూత్రధారులను కనిపెట్టి దోషులందరికీ శిక్ష పడేలా చేయాలని కోరారు. టీడీపీ నేత నాగుల్‌ మీరా మాట్లాడుతూ.. చిన్నాన్న హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్‌ చెల్లెలికి అన్యాయం చేస్తూ హంతకులను కాపాడే ప్రయత్నం చేస్తుండటం దారుణమన్నారు. సునీత ఒంటరి పోరాటానికి మహిళాలోకం మద్దతుగా నిలవాలని కోరారు

*బ్రాహ్మణులను వైసీపీ సర్కార్ దారుణంగా మోసం చేసింది: Bonda uma
బ్రాహ్మణ సమాజికవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు ప్రభత్వంలో బ్రాహ్మణులకు స్వర్ణ యుగమన్నారు. వైసీపీ గత 3 సంవత్సరాలుగా ఒక్క రూపాయి నిధులు మంజరు చేయలేదని తెలిపారు. టీడీపీ హయాంలో బ్రాహ్మణ విద్యార్ధులకు స్కాలర్షిప్‌లు, ఫించన్‌లు, అనేక పథకాలు వచ్చేవని గుర్తుచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణ కార్పొరేషన్‌ను మూసివేసే దిశగా పాలన ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం వెంటనే ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణులకు అండగా టీడీపీ పోరాటం చేస్తుందని బోండో ఉమా స్పష్టం చేశారు

*జగన్‌ వెన్నులో వణుకు: బుద్దా
వివేకానందరెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డే దోషి అని సాక్ష్యాలన్నీ రుజువుచేస్తున్న నేపథ్యంలో జగన్‌ను కూడా సీబీఐ విచారించాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అనగానే.. జగన్‌కు చెమటలు పడుతున్నాయని, వెన్నులో వణుకు మొదలైందని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడించడం ద్వారా కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. టీడీపీ నాయకుడు నాగుల్‌ మీరాతో కలిసి మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ఆడిస్తున్న నాటకంలో వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి పాత్రధారులుగా మారారన్న అనుమానం కలుగుతోందంటూ సజ్జల చేసిన ఆరోపణల ఈ నేపథ్యంలో వారిద్దరి (సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి) ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వారికి రక్షణ కల్పించాలని కోరారు. వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ రాష్ట్ర మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను కూడా విచారించి.. తద్వారా అసలు సూత్రధారులను కనిపెట్టి దోషులందరికీ శిక్ష పడేలా చేయాలని కోరారు. టీడీపీ నేత నాగుల్‌ మీరా మాట్లాడుతూ.. చిన్నాన్న హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్‌ చెల్లెలికి అన్యాయం చేస్తూ హంతకులను కాపాడే ప్రయత్నం చేస్తుండటం దారుణమన్నారు. సునీత ఒంటరి పోరాటానికి మహిళాలోకం మద్దతుగా నిలవాలని కోరారు.

*తెలంగాణ విజయవంతం: కేటీఆర్‌
తెలంగాణ అభివృద్ధిలో చాలా ముందంజలో ఉందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల శాఖ సోమవారం విడుదల చేసిన లెక్కలను ఆయన మంగళవారం ట్విటర్‌లో ప్రస్తావించారు. 2014లో రూ.1,24,104గా ఉన్న తలసరి ఆదాయం 2021లో 125శాతం పెరిగి రూ. 2,78,833కి చేరిందన్నారు. 2014లో రూ.5లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జిఎ్‌సడిపి) 2021లో 130శాతం పెరిగి రూ.11.54లక్షల కోట్లకు చేరిందన్నారు. కాగా.. రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నా తెలంగాణ అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

*బంగారు తెలంగాణ బూటకం: రేవంత్‌రెడ్డి
కేసీఆర్‌ చెబుతున్న బంగారు తెలంగాణ బూటకమని, రైతుల ఆత్మహత్యల తెలంగాణనే విషాదకర వాస్తవమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గడిచిన మూడు నెలల్లో ఒక్క మానుకోటలోనే 17 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడమే దీనికి నిదర్శనమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీలో షికారు చేస్తున్న కేసీఆర్‌కు రైతుల ఆర్తనాదాలు వినిపడటం లేదా? అంటూ మంగళవారం ట్వీట్‌ చేశారు.

*ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ వైసీపీ అండర్‌లో ఉంది: లోకేష్‌
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పాలనలో దళితులకు రక్షణ కరువైందని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పెద్దకంటిపల్లిలో అప్పు చెల్లించలేదని దళితుడు చంద్రన్‌పై.. ఈశ్వర్‌రెడ్డి విచక్షణారహితంగా దాడి చేశాడన్నారు. డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి అనుచరుడే ఈశ్వర్‌రెడ్డి అని లోకేష్ చెప్పారు. ద‌ళితుల‌పై వైసీపీ శ్రేణులు ద‌మ‌న‌కాండ‌ సాగిస్తున్నారని మండిపడ్డారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ వైసీపీ అండర్‌లో ఉందన్నారు. పోలీసులు వైసీపీకి వత్తాసు పలకడం ఇకనైనా మానుకోవాలన్నారు. దళితుడిపై దాడి చేసిన ఈశ్వర్‌రెడ్డిపై కేసు న‌మోదు చేయాలని లోకేష్‌ డిమాండ్ చేశారు.

*సీబీఐకి సహకరించి జగన్ నిజాయితీ నిరూపించుకోవాలి: బోండా ఉమా
వివేకా హత్యకేసులో పథకం ప్రకారం చంద్రబాబు, లోకేష్‌పై బురదజల్లారని టీడీపీ నేత బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రిని కోల్పోయిన కుమార్తెకు న్యాయం చేయమంటే తప్పా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నడిపిస్తున్నారని మాట్లాడటానికి సిగ్గుందా అని ప్రశ్నించారు. నిందితులను జగన్ కాపాడుతున్నారని అందరికీ అర్థమైందన్నారు. సీబీఐకి సహకరించి జగన్ నిజాయితీ నిరూపించుకోవాలన్నారు.

*కేసీఆర్ బంగారు తెలంగాణ బూటకం: రేవంత్ రెడ్డి
కేసీఆర్ బంగారు తెలంగాణ బూటకమని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. మానుకోటలో 3 నెలల్లో 17 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం సంక్షోభ తీవ్రతకు నిదర్శనమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీలో షికారు చేస్తోన్న సీఎంకు రైతుల ఆర్తనాదాలు వినబడటం లేదా? అని ప్రశ్నించారు

*2024 నాటికి అమెరికా తరహా రహదారులు – రూ.3లక్షల కోట్లతో 9వేల కిలోమీటర్ల గ్రీన్ఫీల్డ్ హైవేలు : నితిన్ గడ్కరీ
అమెరికా తరహాలో రహదారులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, 2024 నాటికి పూర్తి చేస్తామని కేంద్ర భూఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరి పేర్కొన్నారు. కర్ణాటకలోని బెళగావిలో ఐదు జాతీయ రహదారుల పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిలుగాసీఎం బసవరాజ్ బొమ్మై, కేంద్ర మంత్రి ప్రహ్లాద్జోషి, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే, మాజీ సీఎం జగదీశ్శెట్టర్, మంత్రులు శ్రీరాములు, గోవిందకారజోళ, సీసీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు

*పవన్ కులస్తులదే హడావుడి: నారాయణస్వామి
పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా ఆయన సామాజికవర్గానికి చెందినవారే రెండు రోజులు హడావుడి చేశారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. తిరుపతిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదోడు బాగుపడాలనే సీఎం జగన్ సినిమా టికెట్ రేట్లు తగ్గించారని చెప్పుకొచ్చారు. అఖండ, పుష్ప సినిమాలకు కూడా ఇదే టికెట్ రేట్లు వర్తించాయని, భీమ్లా నాయక్కు మాత్రం చంద్రబాబు ఎందుకు అంతలా స్పందిస్తున్నారని ప్రశ్నించారు. పవన్ రూ.100 కోట్లు పారితోషికం తీసుకుంటుంటే అందులో రూ.50 కోట్లు ప్రజలకు ఖర్చు పెట్టాలన్నారు. సీఎం జగన్ను దూషించేవాళ్లంతా రాక్షస మనస్తత్వంతో ఉండేవాళ్లని చెప్పారు. జగన్పై కేసులు పెట్టినవాళ్లంతా పతనమైపోయారని, రాజకీయంగా శూన్యమైపోయారని, ఇక చంద్రబాబు వంతు మిగిలిందని నారాయణస్వామి శాపనార్థాలు పెట్టారు.

*దేశంలో కాంగ్రెస్ పని ఖతం: ఇంద్రకరణ్రెడ్డి
మార్చి 10వ తేదీ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ ముక్కలు చెక్కలు కావడం ఖాయమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పని ఖతమైనట్లేనని.. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎ్సను ఎదుర్కొనే సత్తా లేకనే కాంగ్రెస్, బీజేపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.

*కేసీఆర్‎కు మెంటల్ ఎక్కింది: ఎమ్మెల్యే రాజాసింగ్
కేసీఆర్‎కు మెంటల్ ఎక్కిందని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిస్తున్నారని తాను విన్నానని ఆయన తెలిపారు. కేసీఆర్‎ను మెంటల్ హాస్పిటల్‎కు వెళ్ళమని గతంలో చాలా సార్లు చెప్పానని రాజాసింగ్ అన్నారు. ‘‘మా వద్దకు వచ్చినా మేము తీసుకువెళతాం. మోదీని చూస్తే కేసీఆర్కు పిచ్చి ఎక్కుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంగా చేసిన పనులు గవర్నర్ ప్రసంగం ద్వారా చెబుతారు. కానీ సంవత్సరం నుంచి చేసిందేమీ లేదు. అందుకే గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నారు. మహిళ అని చూడకుండా గవర్నర్ను అవమానిస్తారు. రాజ్యాంగ పదవీని అవమాన పరుస్తున్నారు.’’ అని రాజాసింగ్ మండిపడ్డారు.

*మహానగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు: తలసాని
విశ్వనగరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు నూతనంగా బిఓటీ పద్దతిలో నిర్మించిన అత్యాధునిక టాయిలెట్స్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంఎల్ఏ సాయన్న లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు లక్షలాది మంది రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్ వద్ద మొట్టమొదటగా వాటర్ లెస్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగిందని ఆయన చెప్పారు.

*వారణాసిలో కేసీఆర్ ప్రచారం?
జాతీయ రాజకీయాల్లో క్రియా శీల పాత్ర పోషించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు.. ఆ దిశగా పావులు వేగంగా కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో భేటీ కావడంతో పాటు యూపీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారని తెలుస్తోంది. సోమవారం ప్రగతిభవన్లో వార్షిక బడ్జెట్పై సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత రాత్రి 7:45గం.కు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమా నంలో కేసీఆర్ హస్తినకు వెళ్లారు. సీఎం వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, అదనపు డీజీ అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.

* సంగారెడ్డి జిల్లాకు 390 కోట్ల నిధులు విడుదల: హరీష్‌రావు
ఇటీవల సీఎం కేసీఆర్ సంగారెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాకు 390 కోట్ల నిధులను విడుదల చేశారని మంత్రి హరీష్‌రావు తెలిపారు. పట్టణంలో ఆయన మాట్లాడుతూ ఈ నిధులను ప్రజల అత్యంత అవసరమైన పనులకు ఉపయోగించే విధంగా ప్రతిపాదనలు రూపొందించే విధంగా ఎమ్మెల్యేలు చొరవ చూపాలని ఆయన కోరారు. మన ఊరు-మన బడి ఒక అధ్బుతమైన పథకమన్నారు. దీనిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలో ప్రారంభించాలని కేసీఆర్ సంకల్పించారని ఆయన తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరిస్తే పేద పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో చదివే అవకాశం కలుగుతుందన్నారు. కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.మన ఊరు మన బడికోసం 7,289 కోట్లు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈనెల ఎనిమిదిన వనపర్తిలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారన్నారు. ఈ సందర్భంగా మన ఊరు – మన బడికి తన నెల వేతనాన్ని మంత్రి విరాళంగా ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మన ఊరు -మన బడి కార్యక్రమం కింద 1097 పాఠశాలలు ఎంపిక అయ్యాయని ఆయన తెలిపారు.