Health

ఆరోగ్యానికి అండ.. కొబ్బరి బోండా

ఆరోగ్యానికి అండ.. కొబ్బరి బోండా

చలికాలం ముగిసి ఎండాకాలం ప్రారంభమైంది. ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభమైంది. దీంతో వేసవికి తగిన ఆహారాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎండాకాలంలో దాహం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ద్రవ పదర్థాలు అధికంగా తీసుకుంటే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ముఖ్యంగా కొబ్బరిబోండం సమ్మర్‌ డ్రింక్‌గా చెప్పవచ్చు. మన ఆరోగ్యాన్ని ఎల్లవేళలా చల్లగా ఉంచుతుంది. అనారోగ్యాల నుంచి కాపాడుతుంది. కొలెస్ట్రాల్ లేకపోవడంతో గుండెకు మేలు చేస్తుంది. ప్రపంచ జనాభాలో మూడోవంతు కొబ్బరితో చేసిన పదార్థాలను వాడుతారు. కొబ్బరినీళ్లు, నూనె, ఇలా రకరకాల కొబ్బరి పదార్థాలు మన నిత్య జీవితంలో భాగమవుతాయి. కొబ్బరి నీళ్లు పిల్లలు తాగడం వల్ల మానసిక శారీరక ఎదుగుదల, మూత్ర పిండాలు సాఫీగా పనిచేసేందుకు సహకరిస్తాయి.

వేసవి తీవ్రత నేపథ్యంలో శరీరంలో ఎలక్ట్రోలైట్స్ నష్టపోయి విరేచనాలు, వడదెబ్బ వంటి ఆరోగ్య రుగ్మతలు వస్తాయి. అలాంటప్పుడు తక్షణం కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల అనేక కేలరీల శక్తి, వివిధ పోషకాలు, ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్లు చేకూరుతాయి. కొబ్బరి బోండా నీరు సహజ సిద్ధంగా లభించే శుద్ధి కర పానీయమని చెప్పవచ్చు.ఇందులో ఉండే బయోయాక్టివ్ ఎంజెమ్స్ జీర్ణక్రీయలను మెరుగుపరచడానికి తోడ్పడతాయి. తద్వారా బరవు తగ్గే ప్రక్రియ వేగవంతమవుతుంది. కొబ్బరి నీళ్లలోని ఎంజెమ్స్‌తో పాటు అధికమొత్తంలో లభ్యమయ్యే ఫైబర్ పేగుల కదలికను నియంత్రిస్తుంది. ఎసిడిటీ, అజీర్ణం, ఇతర పేగు సంబంధిత సమస్యలను దూరంగా ఉంచుతుంది.

శరీరంలో ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి నింపడంలో కొబ్బరినీళ్లు ఎంతో ఉపకరిస్తాయి. తద్వారా శరీరానికి అసరమైన నీటిని అందించి, డీహైడ్రేష న్‌కు గురికాకుండా రక్షిస్తాయి. రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల హైపర్‌టెన్షన్ నియంత్రణలో ఉంటుంది. కొబ్బరి నీరు రక్తపోటును సరైన స్థాయిలో ఉంచడానికి దోహదపడుతుంది. కొబ్బరి నీళ్లలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించి, కడుపులో మంటను తగ్గిస్తాయి.