NRI-NRT

సింగపూర్ లో భారతీయ మహిళకు జైలు శిక్ష

సింగపూర్ లో భారతీయ మహిళకు జైలు శిక్ష

భారత సంతతికి చెందిన 62 ఏళ్ల ఓ మహిళకు శుక్రవారం సింగపూర్ న్యాయస్థానం 20 నెలల రెండు వారాల జైలు శిక్ష విధించింది. సింగపూర్‌కు చెందిన ఓ పెద్దాయన నుంచి మోసపూరితంగా 1,13,400 సింగపూర్ డాలర్లు(మన కరెన్సీలో రూ.63.71లక్షలు) కాజేసిన కేసులో భారతీయ మహిళ దేవకి గోపాల్ ముత్తుకు కోర్టు ఈ శిక్ష విధించింది. కోర్టులో పేర్కొన్న  వివరాల ప్రకారం.. 2016లో ఇన్సూరెన్స్ ఏజెంట్ అయిన సింగపూర్‌కు చెందిన 71 ఏళ్ల ఓ వృద్ధుడితో దేవకికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత తన కుమారుడు రాజేశ్వరన్ వీరప్పన్‌ను కూడా ఆ పెద్దాయనకు పరిచయం చేసింది. ఆ పరిచయాన్ని అడ్డుపెట్టుకుని స్వదేశంలో ఉన్న తమ ఆస్తులు చిక్కుల్లో పడ్డాయని వాటిని విడిపించేందుకు కొంత నగదు కావాలని తల్లీకుమారుడు ఆ వృద్ధుడిని అడిగారు.