ఏపీ సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చుకుని మోటార్లకు మీటర్లు పెట్టారని.. విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకించినందునే కేసీఆర్ కేంద్రానికి శత్రువయ్యారని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో హరీష్రావు మాట్లాడుతూ.. తెలంగాణ భూమి కొని బోరువేసి మహారాష్ట్రలో పంటలకు నీరు తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ వస్తే చీకటి అవుతుందన్నారు. విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం రైతులను దోచుకోవాలని చూస్తోందన్నారు. మీ దగ్గరకు వచ్చే బీజేపీ నాయకులను ప్రశ్నించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపాలని.. కేంద్రానికి దుర్మార్గులు లేఖ రాశారన్నారు. బీజేపీ నాయకులు రేపో, మాపో ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నారన్నారు. గ్యాస్ సబ్సిడీ కూడా ఎగ్గొట్టారని.. కేంద్రప్రభుత్వం పేదల ఉసురుపోసుకుంటోందని హరీష్రావు విమర్శించారు.