అమెరికాలోని మిస్సోరి రాష్ట్ర సెయింట్ లూయిస్ హిందూ దేవాలయంలో మహా కుంభాభిషేక ఉత్సవాలు మే 11 నుండి 15వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ గంగవరపు శ్రీనివాస రజనీకాంత్, అధ్యక్షురాలు డా.రాజ్యలక్ష్మి నాయుడులు తెలిపారు. అయిదురోజుల పాటు వివిధ పూజా కార్యక్రమాలు, హోమాలు, అన్నదానం, ఆలయ సంప్రోక్షణ వంటి కార్యక్రమాలు హైందవ సాంప్రదాయానికి అనుగుణంగా ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు భారీ స్థాయిలో చేస్తున్నట్లు వెల్లడించారు. సెయింట్ లూయిస్ పరిసర ప్రాంత ప్రవాసులు ఈ వేడుకల్లో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ ఉత్సవాల నిర్వహణకు నిధుల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం 6గంటలకు స్థానిక ఆలయంలో ఏర్పాటు చేసినట్లు మీడియా కమిటీ ఛైర్మన్ రాజా సూరపనేని తెలిపారు.
రేపు సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ కుంభాభిషేక సన్నాహక సమావేశం
Related tags :