Politics

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి – TNI రాజకీయం

గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి  – TNI రాజకీయం

*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మన రాష్ట్ర గవర్నర్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్రంలో జగన్ పాలనను సరిదిద్దాల్సిన గవర్నర్.. సీఎంకు వంత పాడుతున్నారని మండిపడ్డారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మన రాష్ట్ర గవర్నర్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. దేశ చరిత్రలోనే మొదటి సారిగా గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని చెప్పారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఇక్కడ కళాశాలలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

* ప్రత్యామ్నాయం లేకనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం: మమత
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రత్యామ్నాయం లేకనే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, బలమైన ప్రత్నామ్నాయం కనుక ఏర్పడితే ప్రజలు తప్పనిసరిగా బీజేపీని అధికారం నుంచి సాగనంపుతారని అన్నారు. టిఎంసీ సహా అన్ని విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఏర్పడాలని అన్నారు. మంగళవారంనాడు పార్టీ సంస్థాగత సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడారు. బీజేపీ సస్పెండెడ్ నేతకు టీఎంసీ పదవిటీఎంసీ చైర్‌పర్సన్‌గా మమతా బెనర్జీ గత నెలలో తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ రాష్ట్ర కమిటీని కొత్తగా ఏర్పాటు చేశారు. ఇందులో తన విధేయులే ఎక్కువ మంది ఉండేలా చూసుకున్నారు. పార్టీ సీనియర్ నేతలు, యువ నేతలకు మధ్య విభేదాలు తలెత్తిన క్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీని మమతా బెనర్జీ పూర్తిగా ప్రక్షాళన చేశారు. పాతవారితో పాటు కొత్త తరం నేతలకు కూడా కమిటీలో చోటు కల్పించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సుబ్రత బక్షిని, సెక్రటరీ జనరల్‌గా పార్థ చటర్జీని నియమించారు. రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రాతో సహా సుమారు 20 మంది ఉపాధ్యక్షులకు, 19 మంది రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను నియమించారు.

* మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నాం: ఏపీ సీఎం జగన్‌
తమ ప్రభుత్వ తీసుకొచ్చిన వివిధ సంక్షేమ పథకాలతో మహిళల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నదని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. గత రెండున్నరేండ్ల కాలాన్ని మహిళాభ్యున్నతి కోసమే వినియోగించామన్నారు. ఎన్నో పథకాలను తీసుకొచ్చి మహిళల సాధికారతకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి జగన్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రతీ ఒక్క అక్క, చెల్లెండ్లకు మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు.

* ఈటల తనకు తాను ఎక్కువ ఊహించుకుంటున్నారు: బాల్క సుమన్
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ తనకు తాను ఎక్కువ ఉహించుకుంటున్నారన్నారు. తమతో ఉంటే ట్రెజరీ బెంచ్‌లో కూర్చున్నాడని… తమను విడిచాక రోడ్డుమీద కూర్చున్నాడని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి అధికార అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే నియోజకవర్గాల పెంపు బిల్లుకు ఆమోదం తెలుపాలన్నారు. బీజేపీకి గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లలో డిపాజిట్లు రావని ఈటల పేర్కొన్నారు

* కోన వెంకట్రావును వైసీపీ గూండాలే పొట్టన బెట్టుకున్నారు: అచ్చెన్నాయుడు
టీడీపీ నేత కోన వెంకట్రావును వైసీపీ గూండాలే పొట్టన బెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వేధింపుల వల్లే వెంకట్రావు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో ఎత్తిచూపినందుకే వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. మహిళా దినోత్సవం రోజున వైసీపీ నేతలు ఒక మహిళ మంగళసూత్రాన్ని తెంచేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యులైన వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. వైసీపీ గూండాలకు పోలీసులు రక్షకులుగా మారారని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.

* ప్రజలు తీర్పు ఇచ్చారు. ఫలితాలు లాంఛనమే: తేజస్వీ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడా గెలవబోదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ జోస్యం చెప్పారు. ప్రజలు ఇప్పటికే ఈ తీర్పు ఇచ్చేశారని, ఫలితాలు లాంఛనమేనని ఆయన అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ప్రజలు వీడ్కోలు చెప్పనున్నారన్న ఆయన.. యోగి ప్రభుత్వంపై చాలా కోపంగా ఉన్నారని, అది ఎన్నికల సమయంలో కనిపించదని అన్నారు. మార్చి 10న విడుదలయ్యే ఎన్నికల ఫలితాల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయ ఢంకా మోగించి యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని తేజస్వీ అన్నారు.ఇక మిగిలిన రాష్ట్రాల్లో సైతం బీజేపీకి పరాభవం తప్పదని అన్న ఆయన.. గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, పంజాబ్‌లో గట్టి పోటీ ఉన్నప్పటికీ.. ఆ పోటీలో బీజేపీ లేదని అన్నారు. అయితే ఎన్నికల్లో బీజేపీ ట్యాంపరింగ్‌కు పాల్పడుతోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తేజస్వీ పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఎన్నికల పూర్తి ఫలితాలు విడుదలయ్యే ఆఖరి నిమిషం వరకు కన్నేసి ఉంచాలని అన్నారు.

* ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్: అమిత్ షా
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రిపుర రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించబోతున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. త్రిపురలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాజధాని అగర్తలాలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రిపురలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి చేసిన అభివృద్ధిని, మున్ముందు చేయబోయే పనుల గురించి ప్రస్తావించారు.‘‘బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రపంచంతో త్రిపురకు మరింత అనుసంధానం పెరిగింది. రాష్ట్రంలో రైల్వే లైన్లు పెరిగాయి. నాలుగేళ్లలో 542 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మించాము. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో నేరాలు 30 శాతం తగ్గాయి’’ అని అమిత్ షా అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ రైతుల ఆదాయం రెట్టింపైందరని అన్నారు. ప్రస్తుతం రైతుల ఆదాయం 1.3 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. ఇక ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ యంత్రాగాల్లోని ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించబోతున్నట్లు ప్రకటించారు.

* నాలుగు రాష్ట్రాల్లో పాగా వేస్తాం..యూపీలో కీల‌క పాత్ర పోషిస్తాం : కాంగ్రెస్‌
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కేంద్రంలోని దుర‌హంకార స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా ఓటు వేశార‌ని కాంగ్రెస్ నేత దీపీంద‌ర్ హుడా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌, మ‌ణిపూర్‌, గోవా రాష్ట్రాల్లో సొంతంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంద‌ని యూపీలో మార్పు త‌ధ్య‌మ‌ని, కాంగ్రెస్ యూపీలో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. ఇక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ముగియ‌గా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ స్పందించారు.అసెంబ్లీ ఎన్నిక‌ల పోరులో తాము శ‌క్తివంచ‌న లేకుండా పోరాడామ‌ని, తాము ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం వేచిచూస్తున్నామ‌ని ఆమె వ్యాఖ్యానించారు. మ‌హిళా సాధికార‌త ప్ర‌ధానంగా ప్రియాంక గాంధీ ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌చార వ్యూహాన్ని ముందుండి న‌డిపించ‌డంతో ఆ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నెల‌కొంది. యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 40 శాతం టికెట్ల‌ను మ‌హిళా అభ్య‌ర్ధుల‌కు కేటాయిస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో 403 స్ధానాల‌కు గాను 159 మంది మ‌హిళా అభ్య‌ర్ధుల‌ను కాంగ్రెస్ బ‌రిలో దింపింది.

* మ‌హిళా పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం పెట్టుబ‌డి రాయితీ : మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని మ‌హిళా పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం పెట్టుబ‌డి రాయితీ ఇస్తామ‌ని, వారు ఎద‌గ‌డానికి స‌హ‌కారం అందిస్తామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌లకు ప్ర‌భుత్వం అన్ని ర‌కాల తోడ్పాటును అందిస్తుందని స్ప‌ష్టం చేశారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని సుల్తాన్‌పూర్‌లో మ‌హిళా పారిశ్రామిక పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మహిళా పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేసిన ఫ్లో ఇండస్ట్రియల్ పార్క్ పైలాన్‌ను కేటీఆర్ ఆవిష్క‌రించారు.

* కోన వెంకట్రావును వైసీపీ గూండాలే పొట్టన బెట్టుకున్నారు: అచ్చెన్నాయుడు
టీడీపీ నేత కోన వెంకట్రావును వైసీపీ గూండాలే పొట్టన బెట్టుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వేధింపుల వల్లే వెంకట్రావు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో ఎత్తిచూపినందుకే వేధింపులకు గురిచేశారని మండిపడ్డారు. మహిళా దినోత్సవం రోజున వైసీపీ నేతలు ఒక మహిళ మంగళసూత్రాన్ని తెంచేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యులైన వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. వైసీపీ గూండాలకు పోలీసులు రక్షకులుగా మారారని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.

* 2070 కల్లా కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్: మోదీ
ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ ప్రాజెక్టులను వేగిరపరచడం ద్వారా 2070 కల్లా భారత్‌ను కర్బన్ ఉద్గార రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని సాధించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గ్రీన్ ఫైనాన్సింగ్‌కు ఇదే తగిన తరుణమని పేర్కొన్నారు. ”ఫైనాన్సింగ్ ఫర్ గ్రోత్ అండ్ యాస్పిరేషనల్ ఎకానమీ” అనే అంశంపై మంగళవారంనాడు జరిగిన వెబినార్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, 2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుందని చెప్పారు. ఆ దిశగా పనులు వేగవంతం చేయడానికి పర్యావరణ హిత ప్రాజెక్టులను వేగవంతం చేయాలన్నారు.

* ఇదేందయ్యా జగనూ….: Ayyannapatrudu
మాజీ సీఎం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి పట్ల ఏపీ అసెంబ్లీలో సంతాపం తెలియజేయకపోవడంపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…‘‘ఇదేందయ్యా జగనూ…. మాజీ సీఎం, మాజీ గవర్నర్‌గా పనిచేసిన కొణిజేటి రోశయ్య గారికి కనీసం సభలో సంతాపం కూడా చెప్పడానికి మనసు రాలేదా?. నీ తండ్రి కి అత్యంత ఆత్మీయుడిగా మెలిగిన రోశయ్య గారు చనిపోతే నాడు నివాళికీ నువ్వు వెళ్లలేదు. నేడు కనీసం సభలో గౌరవంగా సంతాపం కూడా తెలుపలేదు. నాడు నీ నైజాన్ని, నిజ స్వరూపాన్ని ప్రపంచానికి తెలిపింది రోశయ్య గారు అనే నీకు ఇంత కక్ష అనేది బయట టాక్. నీ స్నేహితుడు అయిన గౌతమ్ రెడ్డికి సంతాపం తెలిపిన నువ్వు… మీ తండ్రి అన్నలా భావించిన రోశయ్యకు మాత్రం సంతాపం తెలుపలేదు’’ అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.

*అమరావతి రాజధానిలో గోల్‌మాల్‌ జరిగింది: మంత్రి బొత్స
అమరావతి రాజధానిలో గోల్‌మాల్‌ జరిగిందని మంత్రి బొత్స సత్సనారాయణ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఆర్డీఏ చట్టం ప్రకారం ముందుకు వెళతామని స్పష్టం చేశారు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తామన్నారు. అమరావతిని శాసన రాజధానిగా నిర్ణయించుకున్నామని, 2024 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు

*వివిధ రంగాల్లో మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారు: తానేటి వనిత
మహిళలకు సీఎం జగన్ పాలనలో ప్రత్యేకత ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. దేశాధినేతలు, కార్పొరేట్, వాణిజ్య, క్రీడా రంగాలలో, సామాన్య కుటుంబంలో మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు. జగనన్న అనే పదం సర్వసాధారణంగా మారిందన్నారు. అన్న అంటే అమ్మలో సగం, నాన్నలో సగమన్నారు. ఇంకా తానేటి వనిత మాట్లాడుతూ.. ‘‘మహిళ నిర్ణయాలు తానే తీసుకునే స్ధాయికి ఎదగడం సాధికారత. మహిళలను లక్షాధికారులుగా చూడాలని రాజశేఖరరెడ్డి కల కన్నారు. తండ్రి కలను కొడుకు సీఎం జగన్ నెరవేర్చుతున్నారు. దిశ చట్టం కేంద్రం ఆమోదం పొందాల్సి ఉంది. దిశ యాప్ ద్వారా మహిళల రక్షణకు చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు మహిళలను మోసం చేశారు. మహిళలను మంత్రులుగా చేశారు. మన రాష్ట్ర కేబినెట్ నుంచి మహిళా సాధికారత మొదలైంది. మహిళలకు 60% పదవులిచ్చిన ఏకైక సీఎం జగన్’’ అని కొనియాడారు.

**టీఆర్ఎస్ ప్రభుత్వలో బడ్జెట్‌కి విలువ లేదు: కోదండరాం
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బడ్జెట్‌కి విలువ లేకుండా పోయిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వెనక్కి తీసుకుని సభలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బడ్జెట్‌కు, ఖర్చుకు20శాతం తారతమ్యం ఉంటోందని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో అప్పులు పెరుగుతున్నాయి.. అంచనాలు తప్పుతున్నాయని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ ఆత్మహత్యలకు పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. నిరుద్యోగభృతి ఏమైంది? అని ప్రశ్నించారు. విద్యా,వైద్యం మౌలిక సదుపాయాలు కల్పన లేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య , ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోదండరాం డిమాండ్ చేశారు

*నా విజయం వెనుక నా భార్య, బిడ్డ ఉన్నారు: ఎర్రబెల్లి
తన విజయం వెనక.. తన భార్య, బిడ్డ ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో వారు గ్రామ గ్రామం తిరిగి ప్రచారం చేసి తన విజయంలో భాగస్వామ్యం అయ్యారని గుర్తు చేసుకున్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. మహిళలను ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

*సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు: సీఎం జగన్
గౌతమ్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్ది తెలిపారు.
గౌతమ్‌రెడ్డి మృతి తనకు,పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రెండోరోజు గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సభ్యులు ప్రసంగించిన అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి తనకు చిన్నప్పట్నుంచి మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. మంచి స్నేహితుడ్ని కోల్పోవడం బాధాకరమని అన్నారు. గౌతమ్‌రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. చాలా సందర్భాల్లో గౌతమ్‌రెడ్డి తనకు అండగా నిలబడ్డారని సీఎం జగన్‌ గుర్తుచేశారు. ఆయన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించారని తెలిపారు. రాష్ట్రంలోకి కొత్త కంపెనీలు రావడంలో గౌతమ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు.పారిశ్రామిక మంత్రిగా గౌతమ్‌రెడ్డి చాలా కృషి చేశారని తెలిపారు. గౌతమ్‌రెడ్డి లేకపోయినా ఆయన కన్న కలలు నెరవేరుస్తామని సీఎం జగన్‌ అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. సంగం బ్యారేజీ పనులను 6 వారాల్లో పూర్తి చేస్తామని అన్నారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెడతామని అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

* మ‌హిళా పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం పెట్టుబ‌డి రాయితీ : మంత్రి కేటీఆర్
రాష్ట్రంలోని మ‌హిళా పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం పెట్టుబ‌డి రాయితీ ఇస్తామ‌ని, వారు ఎద‌గ‌డానికి స‌హ‌కారం అందిస్తామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌లకు ప్ర‌భుత్వం అన్ని ర‌కాల తోడ్పాటును అందిస్తుందని స్ప‌ష్టం చేశారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని సుల్తాన్‌పూర్‌లో మ‌హిళా పారిశ్రామిక పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మహిళా పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేసిన ఫ్లో ఇండస్ట్రియల్ పార్క్ పైలాన్‌ను కేటీఆర్ ఆవిష్క‌రించారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేటీఆర్ ప్ర‌సంగించారు. మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల కోసం ఏర్పాటైన ఏకైక కేంద్రం వీ హ‌బ్ అని కేటీఆర్ తెలిపారు. హైద‌రాబాద్‌లో ఏర్పాటైన వీ హ‌బ్‌కు సీఈవోగా దీప్తి ఉన్నారు. వీ హ‌బ్ సంద‌ర్శించి మ‌హిళ‌లు పారిశ్రామిక‌వేత్త‌లుగా ఎద‌గాలి. వీ హ‌బ్ ఇప్ప‌టికే 2,194 స్టార్ట‌ప్‌ల‌ను రూప‌క‌ల్ప‌న చేసింది. ఇందు కోసం రూ. 66.3 కోట్ల నిధులు కేటాయిస్తున్నామ‌ని తెలిపారు. స్టార్ట‌ప్ నిధుల‌తో 2,800 మందికి ఉపాధి క‌ల్ప‌న సృష్టించామ‌ని పేర్కొన్నారు.

* రేపు అగ్రి కమిషనరేట్‌ ముట్టడి: కిసాన్‌ మోర్చా
రైతు ప్రభుత్వమని చెప్పుకొంటూ అదే రైతును మోసం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర బీజేపీ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు శశిభూషణ్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా నీరు మొదలుకొని ఎరువుల సరఫరా వరకూ అన్నింటా విఫలమైన జగన్‌ ప్రభుత్వం కేంద్రం రైతులకు ఇచ్చిన నిధులు తీసుకుని రాష్ట్రంలో అన్నదాతలకు పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసరిస్తూ ఈ నెల 9న గుంటూరులోని వ్యవసాయ కమిషనరేట్‌ను ముట్టడిస్తున్నట్లు చెప్పారు. సోము వీర్రాజు, సీఎం రమేశ్‌, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొంటారని తెలిపారు.

* వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి ఇంగ్లీష్ మీడియంలో బోధ‌న : సీఎం కేసీఆర్
వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధ‌న ప్రారంభిస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. వ‌న‌ప‌ర్తి జిల్లా వేదిక‌గా మ‌న ఊరు – మ‌న బ‌డి కార్య‌క్ర‌మానికి సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా మ‌న ఊరు – మ‌న బ‌డి పైలాన్‌ను సీఎం కేసీఆర్, మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ క‌లిసి ఆవిష్క‌రించారు.ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్ర‌సంగించారు. మ‌న ఊరు మ‌న‌బ‌డి కార్య‌క్ర‌మం ప్ర‌భుత్వ విద్యారంగాన్ని ప‌టిష్టం చేయ‌నుందని తెలిపారు. దీనికి వ‌న‌ప‌ర్తి జిల్లా వేదిక‌గా శ్రీకారం చుట్టాం. వ‌న‌ప‌ర్తికి ఆ గౌర‌వం ద‌క్కుతుంది. తామంతా కూడా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుకుని పైకి వ‌చ్చిన వాళ్ల‌మే అని పేర్కొన్నారు. మీ ముందు ఈ హోదాలో నిల‌బ‌డ్డామంటే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆ రోజు గురువులు చెప్పిన విద్య‌నే కార‌ణం. భ‌విష్య‌త్‌లో చాలా చ‌క్క‌టి వ‌స‌తులు పాఠ‌శాల‌ల్లో నిర్మాణం కాబోతున్నాయి. వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి ఆంగ్ల బోధ‌న కూడా ప్రారంభం కాబోతుంద‌న్నారు. విద్యార్థులంద‌రూ ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాలి. మీ భ‌విష్య‌త్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాల‌ని కోరుకుంటున్నాను అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

*టీఆర్ఎస్ ప్రభుత్వలో బడ్జెట్‌కి విలువ లేదు: కోదండరాం
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బడ్జెట్‌కి విలువ లేకుండా పోయిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వెనక్కి తీసుకుని సభలోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బడ్జెట్‌కు, ఖర్చుకు20శాతం తారతమ్యం ఉంటోందని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో అప్పులు పెరుగుతున్నాయి.. అంచనాలు తప్పుతున్నాయని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ ఆత్మహత్యలకు పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. నిరుద్యోగభృతి ఏమైంది? అని ప్రశ్నించారు. విద్యా,వైద్యం మౌలిక సదుపాయాలు కల్పన లేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య , ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోదండరాం డిమాండ్ చేశారు.

* బీజేపీ నుంచి ఔట్‌.. మమత పార్టీలోకి మరో సీనియర్‌ నేత
ఈ ఏడాది జనవరిలో పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన పశ్చిమ బెంగాల్‌ బీజేపీ సీనియర్‌ నాయకుడు జై ప్రకాశ్‌ మజుందార్‌ మంగళవారం తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ మేరకు కోల్‌కతాలో జరిగిన సమావేశంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీ కండువా కప్పుకున్నారు. కాగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని అభియోగాలు మోపుతూ ముంజుందార్‌తో పాటు మరో పార్టీ నాయకుడు రితేష్ తివారీని బీజేపీ సస్పెండ్ చేసింది. వీరిద్దరూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు.అయితే పార్టీలో సస్పెండ్‌ అయిన, పార్టీ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలతో ఎంపీ లాకెట్‌ ఛటర్జీ సమావేశమైన మరుసటి రోజే మజుందార్‌ టీఎంసీలో చేరడం విశేషం. 2014లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన. జై ప్రకాష్ మజుందార్ ఇటీవలి వరకు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అయితే రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ విఫలమైందని, పార్టీ కార్యకర్తలను విస్మరించిందని ముజుందార్‌ విమర్శలు గుప్పించారు.