మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి అనంతరం నటిగా మారిన సుందరి ప్రియాంక చోప్రా. మిస్ వరల్డ్ కిరీటాన్ని కూడా ఆమె గెలుపొందింది. అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది ఈ అందాల రాశి. ప్రస్తుతం ప్రియాంక చోప్రాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. తనకు సంబంధించిన విలాసవంతమైన కారును ప్రియాంక అమ్మేసిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళ్లితే..
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. నిక్‌తో వివాహం అనంతరం ఆమె అమెరికాలోనే నివాసముంటుంది. ప్రియాంక ఇండియాలో ఉన్నప్పుడు విలాసవంతమైన కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్‌ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ కారు ఆమె గ్యారేజీలోనే ఖాళీగా ఉంటుందట. అందుకే ఈ కారును బెంగళూరుకు చెందిన ఓ బిజినెస్‌మ్యాన్‌కు అమ్మేసిందని తెలుస్తోంది. ప్రియాంక కొన్న కారు ధర దాదాపుగా రూ.4.5కోట్లు ఉంటుందని సమాచారం. ఈ కారు 6.6 లీటర్ ట్విన్ టర్బో ఇంజిన్‌తో పనిచేస్తుంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా ‘జీ లే జరా’ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో అలియా భట్, కత్రినా కైఫ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.