కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం సంతెకుడ్లూరులో మరోసారి వైసీపీలో వర్గ విబేధాలు వెలుగుచూశాయి. హోలీ ఊరేగింపు విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వారిని స్థానికంగా ఆస్పత్రికి తరలించిన స్థానికులు వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.