తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబురు తీర్థముక్కోటికి విశేషంగా భక్తులు తరలివచ్చారు. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తరువాత అనుమతించడంతో భక్తులు ఉత్సాహంగా విచ్చేశారు. ప్రతి ఏడాదీ ఫాల్గుణ మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ తీర్థ ముక్కోటి జరుగుతుంది. గురువారం ఉదయం 6 నుండి సాయంత్రం 4 గంటల వరకు, తిరిగి శుక్రవారం ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు భక్తులను అనుమతించారు. మొత్తం 12300 మందికిపైగా భక్తులు తుంబురు తీర్థాన్ని సందర్శించారు.
*టిటిడి విస్తృత ఏర్పాట్లు
తుంబురు తీర్థానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. పాపవినాశనం డ్యామ్ వద్ద శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. పాపవినాశనం డ్యామ్ వద్ద ప్రథమ చికిత్స కేంద్రం, రెండు అంబులెన్స్‌లు, తుంబురు తీర్థం వద్ద ఒక వైద్యబృందాన్ని అందుబాటులో ఉంచారు. పలువురు భక్తులకు ఉచితంగా మందులు, మాత్రలు అందించారు. భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించేందుకు వీలుగా పాపానాశనం నుండి దారి పొడవునా పలు చోట్ల తాగునీటి కొళాయిలు ఏర్పాటుచేశారు. మార్గమధ్యంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా నిచ్చెనలు, బ్యారీకేడ్లు, ఇనుప కంచెలు, రోప్‌లు ఏర్పాటు చేశారు.
2. తిరుమలేశుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురే్‌షరెడ్డి శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. జస్టిస్ సురే్‌షరెడ్డికి ఆలయ రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.
3. ముగిసిన కాశీవిశ్వేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలుహోమం నిర్వహిస్తున్న అర్చకులు
నున్నలో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన కాశీవిశ్వేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారి రథోత్సవం, నిత్యార్చన, విశేష హోమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. తెల్లవారుజామున జరిగిన రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద పండితుల సమక్షంలో నిర్వహించిన విశేష హోమాల్లో దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు మామిళ్లపల్లి ఫణికుమార్ పర్యవేక్షణలో శివాచార్య గూడూరు గోపీకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. బ్రహ్మో త్సవాల ముగింపు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎన్ అరుణ తదితరులు పాల్గొన్నారు.
4.అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు
హనుమాన్‌జంక్షన్ కోడూరు పాడులో అయ్యప్పస్వామి జన్మది నోత్సవ ప్రత్యేక పూజలు శుక్రవారం రేపల్లె గురుస్వామి తోట శివశం కరరావు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వ హించారు. కోడూరుపాడు లోని కోందడరామాలయ ఆవరణలో గురు స్వామి ఆధ్వర్యంలో తెల్లవారు జామున శ్రీలక్ష్మీగణపతిహోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ పూజలో ఎంపీపీ యరగొర్ల నగేష్, రాష్ట్ర నాటకరంగ డైరెక్టర్‌నక్కా గాంధీ, వైస్ ఎంపీపీ చందు రమాదేవి, వి.వి.ఆంజనే యులు, నరేంద్ర, గూడపాటి రత్నశేఖర్ దంపతులు, ఆర్నేపల్లి రవి వర్మ దంపతులు, ఆళ్ల భాను, గరికపాటి పుల్లయ్య పాల్గొన్నారు. భువనేశ్వరీమాతకు ప్రత్యేక పూజలుగన్నవరం : మండలంలోని కేసరపల్లి శివారు భువనేశ్వరీ పీఠంలో భువనేశ్వరీ మాతకు పీఠాధిపతి కమలానంద భారతీస్వామి పర్యవేక్షణలో ప్రత్యేకపూజలు జరిపారు. శుక్రవారం హోలీ పున్నమి పురస్కరించుకుని భువనేశ్వరీ మాతకు 108 పర్యాయాలు లలిత సహస్త్రనామ పారా యణం, శ్రీ చక్ర నవవరణా ర్చన, పుష్పాభిషేకం జరిగింది. పుర ప్రముఖులు పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
5.అంకమ్మతల్లి ఉత్సవాలు ..
హనుమాన్‌జంక్షన్ బిళ్లనపల్లిలో కొలువు దీరిన అంక మ్మతల్లి ఉత్సవాలు శుక్రవారం ప్రత్యేక పూజల అనంతరం ముగిశాయి. రెండు రోజులుగా గ్రామోత్సవం అనంతరం తెల్లవారు ఝామున గుడిలోకి ప్రవేశించి అమ్మవారికి అర్చకులు శర్మ ఆధ్వర్యంలో పూజలు చేసి ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. మహిళలు మేళతాళాలతో ఊగింపుగా వెళ్లి పొంగళ్లు సమర్పించారు. భక్తులు మొక్కుబడులను చెల్లించు కున్నారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తు లకు దేవస్థానకమిటీ కొండ పావులూరి వెంకటబాబూరావు, మోహన్‌కుమార్, హేమంత్‌కుమార్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రసాద్, రాజశేఖర్, ఫణి, నాగరాజు, రవి పర్యవేక్షించారు.
6. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్, మే, జూన్‌కు సంబంధించిన టికెట్లను జారీ చేశారు. అయితే సర్వర్‌లో సాంకేతిక లోపంతో భక్తులు చేస్తున్న టికెట్లు బుక్ కావడంలేదు. అలాగే లక్కీడిప్ రిజిస్ట్రేషన్‌కు సైట్ ఓపెన్ కావడంలేదు. దీంతో భక్తులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.