శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అల్లాడుతోంది. రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం చేరుకోగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాలపొడి నుంచి లీటర్ పెట్రోల్ వరకు ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం లంక రూపాయి విలువ డాలర్‌లో పోల్చిచే రూ. 275 ($1 = 275.0000 Sri Lankan rupees)కు చేరుకుంది. దీంతో లంకేయులు తీవ్ర ఇబ్బంయదులు ఎదుర్కొంటున్నారు. శ్రీలంకలో నిత్యావసర ధరలు అమాంతం పెరిగాయి. ముడి చమురు నిల్వలు అయిపోయిన తర్వాత శ్రీలంక తన ఏకైక ఇంధన శుద్ధి కర్మాగారంలో ఆదివారం కార్యకలాపాలను నిలిపివేసినట్లు పెట్రోలియం జనరల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు అశోక రన్‌వాలా తెలిపారు. నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 283కు చేరుకోగా, డీజిల్ ధర రూ. 220కి చేరుకుంది. వంట గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 1,359 చేరుకుంది. కాగా, వంట గ్యాస్ కొరతతో చాలా హోటళ్లు మూసుకుపోయాయి. గ్యాస్ ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు కిరోసిన్ వాడుతున్నారు.ఇక కోడి గుడ్డు ధర రూ. 35, కిలో చికెన్ రూ. 1000, కిలో ఉల్లి ధర రూ. 600, పాలపొడి ప్యాకెట్ ధర రూ. 250, టీ ధర రూ. 100కు చేరుకున్నాయి.
ఇదిలా ఉండగా.. పెట్రోల్, డీజిల్ కోసం క్యూలో నిలుచున్న ఇద్దరు వ్యక్తులు ఆదివారం మృతిచెందినట్టు లంక పోలీసులు తెలిపారు. వీరు ఇంధనం కోసం క్యూలైన్‌లో నిలుచుకొని అస్వస్థతకు గురై చనిపోయినట్టు కొలంబోలో పోలీసు ప్రతినిధి నలిన్ తల్దువా పేర్కొన్నారు. మరోవైపు లంకేయులు విద్యుత్ కొరతను సైతం ఎదుర్కొంటున్నారు. ప్రతీ రోజూ కొన్ని గంటల పాటు కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నట్టు సమాచారం.
*కిలో చికెన్ 1000
శ్రీలంక ఆర్థిక సంక్షోభం తారాస్థాయికి చేరింది. కనీసం ఆహార పదార్ధాల దిగుమతులకు కూడా విదేశీ మారక నిల్వలు లేక, అవసరమైనంత అప్పు పుట్టక ఆ దేశం అల్లాడుతున్నది. గోరు చుట్టు రోకటి పోటులా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పరిస్థితిని మరింత దిగజార్చింది. దీంతో ఆహార ధరలు ఆకాశాన్ని తాకాయి. శ్రీలంకలో అక్కడి కరెన్సీ ప్రకారం ప్రస్తుతం ఒక్క గుడ్డు ధర రూ.35, కిలో చికెన్‌కు రూ.వెయ్యి. శ్రీలంకలో ద్రవ్యోల్బణం ఎంతగా పెరిగిపోయిందో చెప్పడానికి ఈ ధరలే నిదర్శనం. ధరలు ఇంకా పెరగవచ్చని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దుకాణాలు, పెట్రోల్ బంకుల ముందు జనం భారీ క్యూలు కడుతున్నారు. పెట్రోల్ కోసం బంక్ దగ్గర ఏడు గంటలకు పైగా నిలబడి ఇద్దరు వృద్ధులు కన్నుమూశారు. శ్రీలంకలో ప్రస్తుతం 400 గ్రాముల పాలపొడి ధర రూ.250గా ఉంది. కప్పు టీ రూ.100. లీటరు పెట్రోల్ ధర రూ.283, డీజిల్ ధర రూ.176గా ఉంది. పేపర్ దిగుమతి చేసుకోవడానికి డబ్బు లేక దేశవ్యాప్తంగా పాఠశాలల్లో పరీక్షలను రద్దు చేశారు.